సినిమాల మీద విరక్తి వచ్చేసింది
క్రికెట్ మీద విరక్తి వచ్చేసింది
రెండు చోట్లా వయసైపోయిన వాళ్ళదే రాజ్యంగా ఉంటోందని
రాజకీయాల మీద విరక్తి వచ్చేసింది
తెలుగుసాహిత్యం మీద విరక్తి వచ్చేసింది
రెండు చోట్లా మతిలేని వాళ్ళదే రాజ్యంగా ఉంటోందని
ప్రపంచం మీద విరక్తి వచ్చేసింది
జీవితం మీద విరక్తి వచ్చేసింది
ఎక్కడా సంతోషించదగ్గది ఏమీ కనిపించటం లేదని
హుందాగా రిటైర్ అవ్వడం ఒక కళ. మనదేశం లో తాత హీరోలు, తాత రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా విరమించడం అరుదు. తమ కుమార్తెలు, మనవరాళ్ల వయసు వారితో వెర్రి గంతులు వేయడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించదు తాతయ్య నటులకు.
రిప్లయితొలగించండిమన దేశ క్రికెట్ టీమ్ లో ఒకప్పుడు (1960ల్లో) రమాకాంత్ దేశాయ్ అని ఫాస్ట్ బౌలర్ ఉండేవారు. మంచి ఆటగాడు. ఆయన క్రీడా సామర్థ్యం తగ్గనప్పటికీ కూడా రిటైరయ్యారు. రిటైర్ అవుతున్నానని ప్రకటించినప్పుడు అప్పుడేనా అని రిపోర్టర్లు అడిగారు. అప్పుడేనా అని అడిగే దశ లోనే రిటైర్ అవ్వాలి, ఇంకా ఎప్పుడు అని అడిగించుకునేటంత వరకు ఆగకూడదు … అని దేశాయ్ గారి సమాధానం.
రిప్లయితొలగించండిమన సినిమా హీరోలు దేశాయ్ గారి గురించి విన్నట్లు లేదు 😒.
అయితే ఒకటి ఒప్పుకోవాలి. సినిమా హీరోలకు కోట్ల సంపాదనతో ముడిపడున్మ విషయం (తమ సినిమా ఆడినా ఆడకపోయినా) కాబట్టి అలా లాగుతూనే ఉంటారు - వాళ్ళని మొయ్యడానికి అభిమానుల సంఘాలు, కులసంఘాలు ఉన్నాయిగా?
సీ గబగబా గిలికేటి కల్పనా సాహిత్యములు పది కాలాలు మనుట కష్ట
రిప్లయితొలగించండిమే నండి!రయ్యిన మ్యాన్యుఫాక్చరు జేసిన సరుకు మార్కెటునందు కూల
బడుతోంది చూస్తిరా?మరదే విధముగ మన సినిమాలు మరియు నవలలు తగు
నాలెడ్జి లేని సన్నాసుల చేజిక్కితొల్లిటి స్థాయిని దిగవిడిచి మ
తేగీ నుగడ కోల్పోయి ఏడ్వగా - నాటివారు
లోకరీతిని చాల తెలుసుకు జాగృ
తముగ విశ్లేషణను చూపి తత్వ మరసి
చేసిన సృష్టులు నిలిచె నేటి దాక!
(08/10/1993)
vairagyam manchide lendi. mokshaaniki daari.
రిప్లయితొలగించండి