22, జనవరి 2020, బుధవారం

ఫ్రీ డౌన్‍లోడ్ తెలుగు లైబ్రరీలు

2012 - 12  - 16
మ్యూజిక్‍ రీసెర్చ్ లైబ్రరీ పుస్తకాలు (ఫ్రీ డౌన్‍లోడ్) యాదృఛ్ఛికంగా ఈ లైబ్రరీ నాదృష్టికి వచ్చింది ఆసక్తి కల వారు సందర్శించండి

  మ్యూజిక్‍ రీసెర్చ్ లైబ్రరీ పుస్తకాలు

ఇక్కడ ఈనాటికి 131 పుస్తకాలు కనిపిస్తున్నాయి.

2012 - 12 - 27
మందరము - సవ్యాఖ్యానం  అన్నిపుస్తకాలు వేరొక చోట శ్రీ రామసేవాకుటీరములో లభిస్తున్నాయి.
మందరము-సవ్యాఖ్యానం.


2020-01-04
ఈసైట్ గురుకుల్ ఆర్గ్ అని లాభార్జన దృష్టిలేని ఆధ్యాత్మికపరమైన ఉచిత సమాచార వెబ్ సైటు.  అందులో ఉచిత భక్తి పుస్తకాలు అని ఒక పేజీ ఉంది ఉంది. అనేక పుస్తకాలని ఇక్కడ వర్గీకరించి అందిస్తున్నారు. ఈ సాయిరాం సైట్ లో 'ఉచిత భక్తి పుస్తకాలు',  'ఉచిత భక్తి మాసపత్రికలు',  'ఉచిత భక్తి వీడియోలు',  'ఉచిత భక్తి సమాచారం',  'ఉచిత పరిశోధన',  App అనే విభాగాలను సైట్ హోం పేజీ పైన  చూడవచ్చును.

2020-01-04

తెలుగు థీసిస్.కామ్  తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Free. ఇక్కడ అనేక పుస్తకాలూ ఇతర సమాచారమూ చూడవచ్చును. కంకంటి అని వెదకితే కంకంటి పాపరాజు ఉత్తరరామాయణమూ విష్ణుమాయావిలాసమూ రెండూ కనిపించాయి.

2020-01-04

అభినవ వ్యాస' 'జ్ఞాన ప్రపూర్ణ' శ్రీ దేవిశెట్టి చలపతిరావు గారు సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధముగా వ్యాఖ్యానించిన కొన్ని గ్రంధముల పుస్తకములను PDF ఫార్మాట్‍లో వారి సైట్ నుండి దిగుమతి చేసుకోవచ్చును. ఇక్కడ 53 పుస్తకాలు కనిపిస్తున్నాయి.

2020-01-04

జీవన్ముక్తి సాధన అని ఒక బ్లాగు ఉంది. ఇక్కడ చాలా విలువైన సమాచారం ఉంది. వైదిక ధార్మిక గ్రంధాలూ ఇంకా బోలెడు వర్గాలుగానూ సమాచారం ఉంది.

2020-01-04

కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి రచనలు ఉచితంగా పొందవచ్చును. వీటిలో కొన్ని చర్ల నారాయణ శాస్త్రి గారి రచనలు (చర్ల గణపతి శాస్త్రి గారి తండ్రి).  మరికొన్ని చర్ల సుశీల గారి రచనలు (చర్ల గణపతి శాస్త్రి గారి భార్య). ఈ పేజీలో మొత్తం 96 పుస్తకాలు లభిస్తున్నాయి.  వీటిలో 15 పుస్తకాలకు download links ఈయబడ లేదు.

2020-01-04

ఉచితంగా తెలుగులో PDF పుస్తకాలు ఫ్రీ గురుకుల్ ఆర్గ్ బ్లాగు సైట్‍ వద్ద లభిస్తున్నాయి. ఇక్కడ స్త్రీ ధర్మ సంబంద 16 పుస్తకాలు, సంగీత సంబంద 32 పుస్తకాలు, వివాహం/పెండ్లి సంబంద 15 పుస్తకాలు, ఆరోగ్య సంబంద 55 పుస్తకాలు, తెలుగు/తెలుగు చరిత్ర సంబంద 23 పుస్తకాలు, ధర్మసందేహాలు(Q&A) సంబంద 30 పుస్తకాలు, తీర్ధయాత్ర సంబంద 60 పుస్తకాలు, వ్రత సంబంద 25 పుస్తకాలు, స్తోత్ర సంబంద 94 పుస్తకాలు ఉన్నాయి.

2020-01-08

ఇది సాంకేతికం. ఆంగ్లమాధ్యమం. 951+ Free Maths Books అనే సైట్ ఉన్నది. ఇక్కడ అనేక గణితశాస్త్ర విభాగాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.

నిజానికి Free Stuff అనే సైట్‍లో పైన చెప్పిన గణితగ్రంథాలది ఒక భాగం మాత్రమే.

2020-01-10

Divine Life Society  వారి ప్రచురణలు ఉచితంగా ఆన్‍లైన్‍లో చదువుకుందుకు లేదా డౌన్‍లోడ్‍ చేసుకుందుకు లబిస్తున్నాయి. వివరాలకు Divine Life Society వారి డౌన్‍లోడ్‍ పేజీని దర్శించండి. ఆపేజీలోనే స్వామి కృష్ణానంద గారి పుస్తకాలు కూడా లభిస్తున్నాయి.

మరొక సైట్‍ HolyBooks.com. ఇక్కడ వారి మాటల్లో Download PDF's: holy books, sacred texts and spiritual PDF e-books in full length for free. Download the Bible, The Holy Quran, The Mahabharata and thousands of free pdf ebooks on buddhism, meditation etc. Read the reviews and download the free PDF e-books.  ఆసక్తి కలవారు ఈసైట్‍ను దర్శించండి.

2020-01-11

ఒక మంచి బ్లాగు ఉంది ఈ పని చేస్తూ.  ఆ బ్లాగు పేరు తెలుగు డౌన్‍లోడింగ్‍. ఇక్కడ ముఖ్యంగా కొత్తా పాతా తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయి. ఉదాహరణకు అడవి బాపిరాజు గారి నరుడు కనిపించింది, డౌన్‍లోడ్ చేసుకున్నాను. ఐతే నాకు ఇక్కడ యండమూరివి 69 పుస్తకాలు ఉన్నాయి కాని విశ్వనాథ వారిది ఒక్కటీ లేదు. అదీ కాక, ఈబ్లాగులో 21 డిసెం, 2014 తరువాత పోష్టింగులు లేవు.

మరొక బ్లాగు. దాని పేరు ఫ్రీ డౌన్‍లోడ్‍ PDF ఫైల్స్ అని. అక్కడ కూడా పుస్తకాలు బాగానే ఉన్నాయి.  వారు  Free download Pdf files of Comics, Novels, Magazines, Ebooks అనిచెప్పుకున్నారు. నాకు అక్కడ చలం పుస్తకం భగవాన్ పాదాల ముందు.. దివాన్  దొరికింది.


2020-01-19

అరవిందాశ్రమం వారి సైట్ దర్శించండి. అక్కడ అరవిందుల వారి మరియు మదర్ వారి రచనలు అరవిందాశ్రమం లైబ్రరీ పేజీ నుండి ఉచితంగా పొందవచ్చును.  అలాగే ఇక్కడ మరొక పేజీ నుండి కూడా వీటిని పొందవచ్చును - ముఖ్యంగా ఇక్కడ Collected PDFs అని పేజీ చివరన ఒక సంపుట‌ం‌ ఉంది. అది దింపుకుంటే చాలు అన్ని పుస్తకాలు ఒక దొంతిగా వచ్చేస్తాయి.

2020-01-21

దివ్యజ్ఞానసమాజం (The Theosophical Society) వారి సైట్‍ నుండి e-పుస్తకాలు ఉచితంగా లబిస్తున్నాయి. దివ్యజ్ఞానసమాజం గురించిన వికీపీడియా పేజీని ఆసక్తి కలవారు తిలకించండి.

మేడమ్‍ బ్లావట్స్కీ స్టడీ సెంటర్‍ నుండి ఆవిడ రచనలు ఉచితంగా లభ్యం అవుతున్నాయి. ఈవిడ దివ్యజ్ఞాన సమాజ స్త్జాపకురాలు.

World Teachers Trust వారు మాష్టర్ CVV గారి యోగ మార్గప్రచారకులు. వారి సైట్ నుండి డాక్టర్ కె. పార్వతీకుమార్ గారి నుండి వెలువడిన తెలుగు ప్రచురణలు ఉచిత తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ సైట్‍లొ ఇవేకాక ఇతరమైన అనేక గ్రంథాలు కూడా లభిస్తున్నాయి. సైట్ తెరచి పబ్లికేషన్స్ అన్న టాబ్ చూడగానే అందులో మనకు ఆన్‍లైన్‍ బుక్స్ అన్న లింక్ కనిపిస్తుంది. అందులో Dr. Ekkirala Krishnamacharya,Dr. K. Parvathi Kumar,Other, Russian Books, Telugu Books అన్న లింక్స్ కనిపిస్తాయి. కావలసిన పుస్తకాలను దిగుమతి చేసుకొని చదువవచ్చును.

2020-01-22

ఒక సైట్ ఉంది Rare Book Society Of India అని. అక్కడ అనేక అరుదైన పుస్తకాలు లభిస్తాయి డౌన్‍లోడ్ చేసుకుందుకు. ప్రస్తుతం పేజీకి 20 చొప్పున,  అక్కడ 112 పేజీలలో అవి చూపబడుతున్నాయి.  నాకు అక్కడ మహావీరాచార్యుడి గణితసార సంగ్రహం పుస్తకం దొరికింది . ఇది పావులూరి మల్లన గణితానికి మూల గ్రంథం. మీరు వెదికి అనేక పుస్తకాలను మీకు ఆసక్తి కలిగించేవాటిని దించుకోవచ్చును.

2021-01-25
శ్రీ సాయి మాస్టర్ సేవా ట్రస్టు వారి పేజీలో తెలుగులో 72పుస్తకాల వరకూ లభిస్తున్నాయి. ఇంకా ఆంగ్ల, తదితర భాషల్లోనూ పుస్తకాలున్నాయని తెలుస్తున్నది.

2021-02-02 కొత్త సమాచారం

పీడీయఫ్ డ్రైవ్ అని ఒక సైట్ ఉంది. అందులో వివిధ విభాగాలకు చెందిని పుస్తకాలు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొన వచ్చును. ఉదాహరణకు Python Programming  గురించిన పుస్తకాలూ‌ ఉన్నాయి.  Paul Brunton రచించిన పుస్తకాలూ‌ ఉన్నాయి. నేనొక పుస్తకం Python Programming  గురించినది దించుకొని చూసాను. సులభంగానే‌ వచ్చింది.

 

2021-05-15

మీరు archive.org site నుండి చాలా పుస్తకాలను download  చేసుకోవచ్చును. అనేక పాత పుస్తకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రయత్నించండి తప్పక.

2021-09-27

శ్రీపువ్వాడ రామదాసు గారి కీర్తనల పుస్తకమూ, శ్రీ పువ్వాడ శేషగిరిరావు గారి గ్రంథాలూ మనకు పువ్వాడకవిత అనే‌ సైట్ ద్వారా లబిస్తున్నాయి ఉచితంగా.  అకాశవాణి విజయవాడ  కేంద్రం వారు ప్రసారం చేసిన ఎక్కడ నున్నావు కృష్ణయ్యా అన్న పువ్వాడ రామదాసు గారి కీర్తనను విని అంతర్జాలాన్ని శోధించితే ఈ పుస్తకాలు కనిపించాయి.

Jyothish Books : ఈ సైట్‌లో జ్యోతిషగ్రంథాలు ఉచితంగా లభిస్తున్నాయి. (ఇంకా నేను ప్రయత్నించలేదు!)

Post Last Updated On  Feb 2 2022

15 కామెంట్‌లు:


 1. లింకు పని చేయుట లేదు :) బ్లాక్డ్ అని వస్తున్నది :)

  రిప్లయితొలగించు
 2. జిలేబీ గారు, నీహారిక గారు,
  అవునండి. లింక్ ఇవ్వటంలో పొరపాటు చోటుచేసుకున్నది. సరిచేసాను, పరీక్షించి చూసాను. దయచేసి మరలా ప్రయత్నించండి. అసౌకర్యానికి క్షంతవ్యుడను.

  రిప్లయితొలగించు
 3. శ్యామలీయం గారు

  లింకులన్నీ ఇపుడు పనిచేస్తున్నాయి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సంతోష మండీ ధన్యవాదాలు.
   పాఠకులు కూడ తమదృష్టికి వచ్చిన ఇటువంటి పుస్తకభాండారాల గురించిన సమాచారం నాతో పంచుకుంటే మరింత సంతోషం. అటువంటి కొత్త సమాచారాలను కూడా ఈటపాలో పొందుపరచటం వలన ఎక్కువ మందికి ఉపయోగం కలుగుతుంది కదా అని నా భావన.

   తొలగించు
 4. నేడు Divine Life Society వారి ప్రచురణలను కూడా ఈటపాలో సూచించటం జరిగింది. టపాను దర్శించండి వివరాలకు.

  రిప్లయితొలగించు


 5. పాఠకులకు సూచన....


  archive.org


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. ఆ ఆ ఇలాగే నాల్గు కామెంట్లు లాగదీసి‌
   అయ్యా / అమ్మా నాకు టైము లేదు ఈ టపా లకు కామెంట్లు ఇంతటితో సమాప్తమన బోతారు యెట్లాగున్ను :)

   కావున నో ఫర్ధర్ సజషెన్స్ మి లార్డ్ :)

   జిలేబి

   తొలగించు
  2. ఇంతటితో సమాప్తం అనటం సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది మీకు తెలుసు. ఇక్కడ నో లిమిట్. ఓకే?

   తొలగించు
 6. గురువు గారూ, నా చిన్న సలహా కుదిరితే పాటించగలరు. For your consideration only please.

  మీ బ్లాగు టెంప్లేటులో రైట్ సైడుబారులో ప్రస్తుతం ఉన్న "వర్గాలు", "అభిమానులు" లాగానే "ఇతర ఆసక్తికర వెబ్ సైట్లు" అని ఈ ఉచిత డౌన్లోడు లింకుల సూచికను ఉంచితే వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.

  Admin steps to be followed for this:
  - Go to Layouts
  - Go to sidebar-right
  - Click "Add a Gadget"
  - Select "Add Link List" (Display a collection of your favourite sites, blogs or web pages for your visitors)

  PS: this is as per my Blogger template. The actual sequence may vary in the template you are using but unlikely to be drastically different

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఇటువంటి ఆలోచన ఉందండీ. ఐతే తగినంత సమాచారం సేకరించాక ఆపని చేదాం అనుకొన్నాను. ఇప్పటికే తగినన్ని ఉన్నాయేమో. అలాగే చేదాం. లేదా ఉచితపుస్తకాల కోసం ఒక పేజీని Tab రూపంలో ఇవ్వవచ్చును. (ఇప్ప్టటికే కొన్ని Tab లు ఉన్నాయి చూడండి)

   తొలగించు
 7. గొప్ప సమాచారం..కృతజ్ఞతలు

  రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.