11, జూన్ 2014, బుధవారం

సీమాంధ్రవారికి కుట్రలు పన్నటం తప్ప వేరే పనిలేదనుకుంటే ఎలా?

శ్రీగుండు మధుసూదన్ గారు నిత్యం సీమాంధ్రవారి కుట్రలగురించి పుంఖానుపుంఖాలుగా వ్రాస్తూనే ఉంటారు. తెలంగాణా వచ్చాక కూడా వారేమీ శమించలేదు - నిందాలాపాలు తగ్గించలేదు.  అందుచేత విసుగుచెంది, ఈరోజున వారి నా తెలంగాణ కోటి రత్నాల వీణ బ్లాగులో నేను ఉంచిన వ్యాఖ్య.  వారు నా వ్యాఖ్యను ప్రకటించకపోవచ్చును కాబట్టి, నేనే దానిని ప్రకటించుకుంటున్నాను.

గుండువారూ, 

అబ్బబ్బ ఆపండి మీ‌ కుట్రపురాణప్రవచనం

సీ. ఎండహెచ్చిన కుట్ర ఎండతగ్గిన కుట్ర
  సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర
మబ్బటు పో కుట్ర మబ్బిటు రా కుట్ర
  సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర
వాన కురియ కుట్ర వాన వెలియ కుట్ర
   సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర
గాలివీచిన కుట్ర ధూళిరేగిన కుట్ర
   సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర

తే.గీ. పేదసీమాంధ్రయునికియే పెద్దకుట్ర
ఇంత యన్యాయమును సైచి యెదురుతిరిగి
బ్రతికి సీమాంధ్రజనులుంట పరమకుట్ర
కుట్రలకు వారు లొంగమి కూడ కుట్ర

ఇక నైనా కాస్త ప్రపంచంలోకి వచ్చి ఆలోచించండి.  నిత్యమూ సీమాంధ్రమీద నిందలేనా? వేరే పనిలేదా?