23, ఆగస్టు 2015, ఆదివారం

ఓ కోసలరాజసుతాతనయా
నా సంగతి  చక్కగ  నెఱుగుదువు
నీ సంగతి  కొధ్దిగ నెఱుగుదును
ఈ సంగతి జగ మేమెఱుగునయా ఓ
కోసలరాజసుతాతనయా

నను పట్టిన మాయను వదలించి
చనవిచ్చి మహాధ్భుత సత్పథము
కనజేసిన స్నేహితుడవు నీవు
నిను జేరి ప్రశాంతుడ నైతిని లే
నా సంగతి
నను లోకము మెచ్చును మెచ్చదుపో
తనియంగను క్రుంగను పనిగలదే
నను నీ పదసన్నిధి చేర్చితివి
నిను జేరి ప్రశాంతుడ నైతిని లే
నా సంగతి
శరణాగతుడగు జీవుడ నేను
కరుణామయుడవు దేవుడ వీవు
అరుదైనది మన యీ చుట్టరికం
తిరమైనదిలే నీ పెద్దరికం
నా సంగతి19, ఆగస్టు 2015, బుధవారం

ఆహా ఓహో అననే అనను
ఆహా ఓహో అననే అనను అందరి మాటలకు
బాహాబాహీలకు నే దిగను వలనుపదదు నాకునాలో నేనే రామరామయని నాదుభక్తి కొలది
వీలుచేసుకొని తలచుకొందును వెఱ్ఱిప్రేమ నాది
ఈ లోకములో ఎవరికి నచ్చును ఎవరికి నచ్చదిది
ఏల గణింతును నా మనసున కిది మేలని తోచినది
ఆహా

నా జీవితమిది నా భాగ్యమిది నా సంతోషమిది
రోజురోజునకు పెరుగుచున్నది లోకము చూడనిది
నా జన్మంబును ధన్యము చేయుచు నాదగు పుణ్యనిధి 
నా జీవనము రామార్పణము నాదు బుధ్ధి నాది
ఆహా

కొందరు హరిభక్తులుకని మెచ్చెద రందు వింతలేదు
కొందరు రామవిరోధులు తిట్టెద రందు వింత లేదు
అందరు జీవులు కర్మబంధముల కనుగుణమగు బుధ్ధి
పొంది రాముని పొగడుట తెగడుట యందు వింతలేదు
ఆహా18, ఆగస్టు 2015, మంగళవారం

నేలపై పుట్టినందు కేలా విచారము
నేలపై పుట్టినందు కేలా విచారము
మేలైన రామభక్తి మెత్తె పుణ్యముశ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మన
సార గడపుకొన్న జన్మము లెన్నింట 
సారెకును నేను ప్రియము మీర పాడితి గాన
జారకుండ నిలచితిని చక్కని భక్తి
నేలపై

వెలివిద్య లేల నేర్వ విలువైన రామవిద్య
తలలోన నాటుకొన్న తరువాతను
కలి యంటుకొనబోదు  కలుషమెల్ల వీగు
వెలలేని రామవిద్య వెలసియున్నను
నేలపై

కాలాంతరమున మోక్షగామిని కానుంటిని
ఈ లోన తన సేవ నిచ్చి ప్రేమతో
నీలమేఘశ్యాము డేలెడు జన్మములు
మేలే వేలైన గాని యేల దుఃఖము
నేలపై
17, ఆగస్టు 2015, సోమవారం

కలలన్నీ నీ కొఱకే కలిగినవి
కలలన్నీ నీ కొఱకే కలిగినవని తెలిసెను
కలరాని నాడు నీ వలిగితివని తెలిసెనుతీయని నీ పలుకు తేనెలతో ముఱిపించి
హాయిగా నా తోడ ఆడిపాడి వలపించి
వేయేల నేను నీ వేనని కడు రెట్టించి
పోయెదవు తెలవారిపోవులోన నమ్మించి
కలలన్నీ

కలలలో నీ తోడ కలిసియాడుదును నేను
కలిసి యాడుటే కాదు కడకు నీ యింటికి
పిలిచెద వొక నాడని తెలిసియింటిని నేను
నిలిపి నీ మీద యాశ నిలచియుంటిని నేను
కలలన్నీ

నీకొఱకే నాయాట నీకొఱకే నాపాట
నీకొఱకే నేలమీద నిలచి నడయాడుట
నీకొఱకే నా నిదుర నీకొఱకే నా కలలు
నాకు ప్రసన్నుడవు కమ్ము నా రామచంద్రుడ
కలలన్నీ16, ఆగస్టు 2015, ఆదివారం

ఎందుజూచిన హరిగలడుఅందరికి హరిగలడు మరి యన్నిటికి హరిగలడు
ఎందుజూచిన హరిగల డానందరాముడై హరిగలడుఇవల నవల గల యన్నిటిని సృష్టించినవాడై హరిగలడు
స్థావరజంగమప్రవితతమగు నీ సర్వసృష్టియై హరిగలడు
కేవల నిర్గుణుడయ్యును గుణముల క్రీడ సల్పుచు హరిగలడు
జీవకోటిహృత్సరసిజములలో చిద్విలాసుడై హరిగలడు
అందరికి

అర్తితోడ తనపదముల బడువా రందరి కెప్పుడు హరిగలడు
నేర్తుము ప్రీతిని నినుగూర్చియని నిలచిన వారికి హరిగలడు
కీర్తి నర్థమును కోరి గొలువ పరికించి యిచ్చుటకు హరిగలడు
వర్తింతుము నీ వారలమై యను భక్తుల బ్రోచుచు హరిగలడు
అందరికి

నిరుపమతత్త్వఙ్ఞానము గలిగిన నిశ్చలమతులకు హరిగలడు
పరమయోగులను పరిపరివిధముల పరిపాలించుచు హరిగలడు
హరిపారమ్యము నెఱిగినవారికి యన్ని విధముల హరిగలడు
స్థిరముగ నమ్మిన వారికి భవవిఛ్ఛేదనపరుడై హరిగలడు
అందరికి12, ఆగస్టు 2015, బుధవారం

తన రాకపోకలు తా నెఱుగడు
తన రాకపోకలు తా నెఱుగడు
తన కర్మఫలములు తా నెఱుగడుతనను నడపు శక్తి తా నొక టున్నదని
తన బుధ్ధి నెన్నడు తలపోయడు
తనచుట్టు బలవత్తరమైన ప్రకృతి
తనకు పరిమితి యని తా నెఱుగడు
తన రాక

హృదయస్థుడై యున్న యీశ్వరు నెఱుగడు
సదయుడు వాడని మది నెఱుగడు
వదలక వేదాంతవిదుల సేవింపడు
తుదకు తనగతి యేమొ యది యెఱుగడు
తన రాక

అటులయ్యు హరికృప  యెటునుండి వచ్చునో
మటుమాయ మగు లెల్ల మాయావరోధము
చటుకున శ్రీరామచంద్రుని పైభక్తి
పొటమరించును బుధ్ధిపుట్టి తరించును
తన రాకతానెవరో తా నెఱుగదయా
నీ నామమకరందపానవిలోల మైనాచిత్తము మైమరచి
తానెవరో తా నెఱుగదయా తానున్న గదా తన్నెఱుగతనలో నీ వుండ తాను నీలో నుండ
తనకు నీకును బేధమనునది లేకుండ
ఘనమైన యీ సృష్టి కరిగిపోవుచు నుండ
తనకేమి యునికి తనకేడ యునికి తనకేల యునికి
నీ నామ

మనసున ప్రకృతిమాయ జొచ్చిన వేళ
గుణముల నెన్ని తాను తనువున జొచ్చు
తనను నీమ్రోల నుంచుకొని మురిసిన వేళ
గుణముల కేయునికి తనువున కేయునికి తనకేమి యునికి
నీ నామ

మనసు శ్రీరామతత్త్వ మందు లీనమైనది
మనోలయము తారకమంత్రముచే గలిగినది
మనసులేక లేదు జననమరణచక్ర మన్నది
యునికి యనగ పరబ్రహ్మమునకు మాత్రమున్నది
నీ నామ3, ఆగస్టు 2015, సోమవారం

భగవంతుడా నీకు పదివేల దండాలు


భగవంతుడా నీకు పదివేల దండాలు
తగని తంపులు నాకు తలగట్టకునీయందు మనసు తానై నిలచి యున్న వేళ
మాయలు పన్ని దాని మరలించకు
నా యందు పగ నీకేల నమ్మిన భక్తుడ గాన
హాయిగ ధ్యానమ్ము చేయించుకో
భగవంతుడా

ఒగి నీకు మ్రొక్కగ నుద్యమించెడు వేళ
తగని తలపులతోడ తలనింపకు
పగవాడనా నీకు పరమభక్తుడ గాన
జగదీశ మ్రొక్కులు జరిపించుకో
భగవంతుడా

బందాలన్నిటి ద్రెంచి బయటపడెడు వేళ
అందాలవలలతోడ అలరింపకు
ఎందుకు పగ నీకు ఎంతైన భక్తుడ గాన
అందుకోవయ్య సేవలందుకోవయ్య
భగవంతుడా

బృందారకాబృందవందితచరణార
వింద గోవింద ముకుంద సానంద
వందనములు రామచందురుడా నా
యందు నీ దయను చూపి అరసి రక్షించవె
భగవంతుడా


2, ఆగస్టు 2015, ఆదివారం

ఈ మహితసృష్టి యంతా రామనాటకము

ఈ మహితసృష్టి యంతా రామనాటకము
శ్యామసుందరదేవుని ఆరామనాటకముఅందరూ అందరితో ఆడే నాటకము
అందరూ దొంగాటలు ఆడే నాటకము
సుందరతర రంగస్థలి చొచ్చి ప్రతిజీవి
అందమంతా నాదే అనుకొనే నాటకము
ఈ మహిత

ఆడించేవాడి నెరుగ నట్లుండే నాటకము
ఆడే ఆట తనయిఛ్ఛ అనుకొనే నాటకము
అడే ఆట అతనిదే అని మరచి ప్రతిజీవి
గోడగించి ఆడిఆడి కూలబడే నాటకము
ఈ మహిత

ఆద్యంతములులేని అందమైన నాటకము
హృద్యమైన కథలతో ఎసగు మంచి నాటకము
చోద్యమైన ఆటలో చొక్కి ఆడి ప్రతిజీవి
విద్యలెన్నొ చూపించి వెడలిపోవు నాటకము
ఈ మహిత