2, ఆగస్టు 2015, ఆదివారం

ఈ మహితసృష్టి యంతా రామనాటకము

ఈ మహితసృష్టి యంతా రామనాటకము
శ్యామసుందరదేవుని ఆరామనాటకముఅందరూ అందరితో ఆడే నాటకము
అందరూ దొంగాటలు ఆడే నాటకము
సుందరతర రంగస్థలి చొచ్చి ప్రతిజీవి
అందమంతా నాదే అనుకొనే నాటకము
ఈ మహిత

ఆడించేవాడి నెరుగ నట్లుండే నాటకము
ఆడే ఆట తనయిఛ్ఛ అనుకొనే నాటకము
అడే ఆట అతనిదే అని మరచి ప్రతిజీవి
గోడగించి ఆడిఆడి కూలబడే నాటకము
ఈ మహిత

ఆద్యంతములులేని అందమైన నాటకము
హృద్యమైన కథలతో ఎసగు మంచి నాటకము
చోద్యమైన ఆటలో చొక్కి ఆడి ప్రతిజీవి
విద్యలెన్నొ చూపించి వెడలిపోవు నాటకము
ఈ మహిత
2 కామెంట్‌లు:


  1. అద్యంతములులేని అందమైన నాటకము

    అది అంతములు లేని అందమైన నాటకమా? లేక ఆది అంతము లు లేని అందమైన నాటక మా ?

    అంతా విష్ణు మాయ అంటారు ?

    జిలేబి

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.