శరన్నవరాత్రులు వస్తున్నాయి. లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది.
ఐతే, ఈ శ్లోకాల్లో, నామవిభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు.
అందుచేత తప్పులు దొర్లుతాయి పారాయణంలో.
ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి ఉంటాయి.
మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృతభాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాయి.
సాధారణంగా చాలా మందికి ఇటువంటి అనుష్టుప్ ఛందస్సులో ఉన్న శ్లోకాలు చదవటం గురించి మంచి అలవాటు ఉంటుంది. కాని, సాధారణధోరణికి చాలా భిన్నంగా లలితా సహస్రంలో నామాల ఆధ్యంతాలు కనబడుతాయి. అందువలనే చదవటంలో ఎక్కువ తప్పులు దొర్లేది.
ఈ క్రింద పట్టికలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలను నామవిభజనతో పొందుపరుస్తున్నాను.
ఈ పట్టికను అధ్యయనం చేస్తే, నామ పారాయణం చేసే సమయంలో దొర్లే తప్పులు సవరించుకో వచ్చును.
నామసంఖ్య | శ్లోకం. నామ విభాగంతో | శ్లోకసంఖ్య |
1 | శ్రీమాతా। శ్రీమహారాజ్ఞీ। శ్రీమత్సింహాసనేశ్వరీ। చిదగ్నికుండసంభూతా। దేవకార్యసముద్యతా। |
1 |
6 | ఉద్యద్భానుసహస్రాభా। చతుర్బాహుసమన్వితా। రాగస్వరూపపాశాఢ్యా। క్రోధాకారాంకుశోజ్జ్వలా। |
2 |
10 | మనోరూపేక్షుకోదండా। పంచతన్మాత్రసాయకా। నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా। |
3 |
13 | చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా। కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా। |
4 |
15 | అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా। ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। |
5 |
17 | వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా। వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా। |
6 |
19 | నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా। తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా। |
7 |
21 | కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా। తాటంకయుగళీభూతతపనోడుపమండలా। |
8 |
23 | పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః। నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। |
9 |
25 | శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా। కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। |
10 |
27 | నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ। మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా। |
11 |
29 | అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా। కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా। |
12 |
31 | కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా। రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా। |
13 |
33 | కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ। నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ। |
14 |
35 | లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా। స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా। |
15 |
37 | అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ। రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా। |
16 |
39 | కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా। మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా। |
17 |
41 | ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా। గూఢగుల్ఫా। కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా। |
18 |
44 | నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా। పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా। |
19 |
46 | శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా। మరాళీమందగమనా। మహాలావణ్యశేవధిః। |
20 |
49 | సర్వారుణా। అనవద్యాంగీ। సర్వాభరణభూషితా। శివకామేశ్వరాంకస్థా। శివా। స్వాధీనవల్లభా। |
21 |
55 | సుమేరుమధ్యశృంగస్థా। శ్రీమన్నగరనాయికా। చింతామణిగృహాంతస్థా। పంచబ్రహ్మాసనస్థితా। |
22 |
59 | మహాపద్మాటవీసంస్థా। కదంబవనవాసినీ। సుధాసాగరమధ్యస్థా। కామాక్షీ। కామదాయినీ। |
23 |
64 | దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా। భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా। |
24 |
66 | సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా। అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా। |
25 |
68 | చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా। గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా। |
26 |
70 | కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా। జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా। |
27 |
72 | భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా। నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా। |
28 |
74 | భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా। మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా। |
29 |
76 | విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా। కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా। |
30 |
78 | మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా। భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ। |
31 |
80 | కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః। మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా। |
32 |
82 | కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా। బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా। |
33 |
84 | హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః। శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా। |
34 |
86 | కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ। శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ। |
35 |
88 | మూలమంత్రాత్మికా। మూలకూటత్రయకళేబరా। కులామృతైకరసికా। కులసంకేతపాలినీ। |
36 |
92 | కులాంగనా। కులాంతస్థా। కౌళినీ। కులయోగినీ। అకులా। సమయాంతస్థా। సమయాచారతత్పరా। |
37 |
99 | మూలాధారైకనిలయా। బ్రహ్మగ్రంథివిభేదినీ। మణిపూరాంతరుదితా। విష్ణుగ్రంథివిభేదినీ। |
38 |
103 | ఆజ్ఞాచక్రాంతరాళస్థా। రుద్రగ్రంథివిభేదినీ। సహస్రారాంబుజారూఢా। సుధాసారాభివర్షిణీ। |
39 |
107 | తటిల్లతాసమరుచిః। షట్చక్రోపరిసంస్థితా। మహాశక్తిః। కుండలినీ। బిసతంతుతనీయసీ। |
40 |
112 | భవానీ। భావనాగమ్యా। భవారణ్యకుఠారికా। భద్రప్రియా। భద్రమూర్తి। భక్తసౌభాగ్యదాయినీ। |
41 |
118 | భక్తప్రియా। భక్తిగమ్యా। భక్తివశ్యా। భయాపహా। శాంభవీ। శారదారాధ్యా। శర్వాణీ। శర్మదాయినీ। |
42 |
126 | శాంకరీ। శ్రీకరీ। సాధ్వీ। శరచ్చంద్రనిభాననా। శాతోదరీ। శాంతిమతీ। నిరాధారా। నిరంజనా। |
43 |
134 | నిర్లేపా। నిర్మలా। నిత్యా। నిరాకారా। నిరాకులా। నిర్గుణా। నిష్కలా। శాంతా। నిష్కామా। నిరుపప్లవా। |
44 |
144 | నిత్యముక్తా। నిర్వికారా। నిష్ప్రపంచా। నిరాశ్రయా। నిత్యశుద్ధా। నిత్యబుద్ధా। నిరవద్యా। నిరంతరా। |
45 |
152 | నిష్కారణా। నిష్కళంకా। నిరుపాధిః। నిరీశ్వరా। నీరాగా। రాగమథనా। నిర్మదా। మదనాశినీ। |
46 |
160 | నిశ్చింతా। నిరహంకారా। నిర్మోహా। మోహనాశినీ। నిర్మమా। మమతాహంత్రీ। నిష్పాపా। పాపనాశినీ। |
47 |
168 | నిష్క్రోధా। క్రోధశమనీ। నిర్లోభా। లోభనాశినీ। నిస్సంశయా। సంశయఘ్నీ। నిర్భవా। భవనాశినీ। |
48 |
176 | నిర్వికల్పా। నిరాబాధా। నిర్భేదా। భేదనాశినీ। నిర్నాశా। మృత్యుమథనీ। నిష్క్రియా। నిష్పరిగ్రహా। |
49 |
184 | నిస్తులా। నీలచికురా। నిరపాయా। నిరత్యయా। దుర్లభా। దుర్గమా। దుర్గా। దుఃఖహంత్రీ। సుఖప్రదా। |
50 |
193 | దుష్టదూరా। దురాచారశమనీ। దోషవర్జితా। సర్వజ్ఞా। సాంద్రకరుణా। సమానాధికవర్జితా। |
51 |
199 | సర్వశక్తిమయీ। సర్వమంగళా। సద్గతిప్రదా। సర్వేశ్వరీ। సర్వమయీ। సర్వమంత్రస్వరూపిణీ। |
52 |
205 | సర్వయంత్రాత్మికా। సర్వతంత్రరూపా। మనోన్మనీ। మాహేశ్వరీ। మహాదేవీ। మహాలక్ష్మీ। మృడప్రియా। |
53 |
212 | మహారూపా। మహాపూజ్యా। మహాపాతకనాశినీ। మహామాయా। మహాసత్త్వా। మహాశక్తిః। మహారతిః। |
54 |
219 | మహాభోగా। మహైశ్వర్యా। మహావీర్యా। మహాబలా। మహాబుద్ధిః। మహాసిద్ధిః। మహాయోగీశ్వరేశ్వరీ। |
55 |
226 | మహాతంత్రా। మహామంత్రా। మహాయంత్రా। మహాసనా। మహాయాగక్రమారాధ్యా। మహాభైరవపూజితా। |
56 |
232 | మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ। మహాకామేశమహిషీ। మహాత్రిపురసుందరీ। |
57 |
235 | చతుష్షష్ట్యుపచారాఢ్యా। చతుష్షష్టికలామయీ। మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా। |
58 |
238 | మనువిద్యా। చంద్రవిద్యా। చంద్రమండలమధ్యగా। చారురూపా। చారుహాసా। చారుచంద్రకళాధరా। |
59 |
244 | చరాచరజగన్నాథా। చక్రరాజనికేతనా। పార్వతీ। పద్మనయనా। పద్మరాగసమప్రభా। |
60 |
249 | పంచప్రేతాసనాసీనా। పంచబ్రహ్మస్వరూపిణీ। చిన్మయీ। పరమానందా। విజ్ఞానఘనరూపిణీ। |
61 |
254 | ధ్యానధ్యాతృధ్యేయరూపా। ధర్మాధర్మవివర్జితా। విశ్వరూపా। జాగరిణీ। స్వపంతీ। తైజసాత్మికా। |
62 |
260 | సుప్తా। ప్రాజ్ఞాత్మికా। తుర్యా। సర్వావస్థావివర్జితా। సృష్టికర్త్రీ। బ్రహ్మరూపా। గోప్త్రీ। గోవిందరూపిణీ। |
63 |
268 | సంహారిణీ। రుద్రరూపా। తిరోధానకరీ। ఈశ్వరీ। సదాశివా। అనుగ్రహదా। పంచకృత్యపరాయణా। |
64 |
275 | భానుమండలమధ్యస్థా। భైరవీ। భగమాలినీ। పద్మాసనా। భగవతీ। పద్మనాభసహోదరీ। |
65 |
281 | ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః। సహస్రశీర్షవదనా। సహస్రాక్షీ। సహస్రపాత్। |
66 |
285 | ఆబ్రహ్మకీటజననీ। వర్ణాశ్రమవిధాయినీ। నిజాజ్ఞారూపనిగమా। పుణ్యాపుణ్యఫలప్రదా। |
67 |
289 | శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా। సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా। |
68 |
291 | పురుషార్థప్రదా। పూర్ణా। భోగినీ। భువనేశ్వరీ। అంబికా। అనాదినిధనా। హరిబ్రహ్మేంద్రసేవితా। |
69 |
298 | నారాయణీ। నాదరూపా। నామరూపవివర్జితా। హ్రీంకారీ। హ్రీమతీ। హృద్యా। హేయోపాదేయవర్జితా। |
70 |
305 | రాజరాజార్చితా। రాజ్ఞీ। రమ్యా। రాజీవలోచనా। రంజనీ। రమణీ। రస్యా। రణత్కింకిణిమేఖలా। |
71 |
313 | రమా। రాకేందువదనా। రతిరూపా। రతిప్రియా। రక్షాకరీ। రాక్షసఘ్నీ। రామా। రమణలంపటా। |
72 |
321 | కామ్యా। కామకళారూపా। కదంబకుసుమప్రియా। కళ్యాణీ। జగతీకందా। కరుణారససాగరా। |
73 |
327 | కళావతీ। కలాలాపా। కాంతా। కాదంబరీప్రియా। వరదా। వామనయనా। వారుణీమదవిహ్వలా। |
74 |
334 | విశ్వాధికా। వేదవేద్యా। వింధ్యాచలనివాసినీ। విధాత్రీ। వేదజననీ। విష్ణుమాయా। విలాసినీ। |
75 |
341 | క్షేత్రస్వరూపా। క్షేత్రేశీ। క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ। క్షయవృద్ధివినిర్ముక్తా। క్షేత్రపాలసమర్చితా। |
76 |
346 | విజయా। విమలా। వంద్యా। వందారుజనవత్సలా। వాగ్వాదినీ। వామకేశీ। వహ్నిమండలవాసినీ। |
77 |
353 | భక్తిమత్కల్పలతికా। పశుపాశవిమోచినీ। సంహృతాశేషపాషండా। సదాచారప్రవర్తికా। |
78 |
357 | తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా। తరుణీ। తాపసారాధ్యా। తనుమధ్యా। తమోఽపహా। |
79 |
362 | చితిః। తత్పదలక్ష్యార్థా। చిదేకరసరూపిణీ। స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః। |
80 |
366 | పరా। ప్రత్యక్చితీరూపా। పశ్యంతీ। పరదేవతా। మధ్యమా। వైఖరీరూపా। భక్తమానసహంసికా। |
81 |
373 | కామేశ్వరప్రాణనాడీ। కృతజ్ఞా। కామపూజితా। శృంగారరససంపూర్ణా। జయా। జాలంధరస్థితా। |
82 |
379 | ఓడ్యాణపీఠనిలయా। బిందుమండలవాసినీ। రహోయాగక్రమారాధ్యా। రహస్తర్పణతర్పితా। |
83 |
383 | సద్యఃప్రసాదినీ। విశ్వసాక్షిణీ। సాక్షివర్జితా। షడంగదేవతాయుక్తా। షాడ్గుణ్యపరిపూరితా। |
84 |
388 | నిత్యక్లిన్నా। నిరుపమా। నిర్వాణసుఖదాయినీ। నిత్యాషోడశికారూపా। శ్రీకంఠార్ధశరీరిణీ। |
85 |
393 | ప్రభావతీ। ప్రభారూపా। ప్రసిద్ధా। పరమేశ్వరీ। మూలప్రకృతిః। అవ్యక్తా। వ్యక్తావ్యక్తస్వరూపిణీ। |
86 |
400 | వ్యాపినీ। వివిధాకారా। విద్యావిద్యాస్వరూపిణీ। మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ। |
87 |
404 | భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః। శివదూతీ। శివారాధ్యా। శివమూర్తిః। శివంకరీ। |
88 |
409 | శివప్రియా। శివపరా। శిష్టేష్టా। శిష్టపూజితా। అప్రమేయా। స్వప్రకాశా। మనోవాచామగోచరా। |
89 |
416 | చిచ్ఛక్తిః। చేతనారూపా। జడశక్తిః। జడాత్మికా। గాయత్రీ। వ్యాహృతిః। సంధ్యా। ద్విజబృందనిషేవితా। |
90 |
424 | తత్త్వాసనా। తత్। త్వం। అయీ। పంచకోశాంతరస్థితా। నిస్సీమమహిమా। నిత్యయౌవనా। మదశాలినీ। |
91 |
432 | మదఘూర్ణితరక్తాక్షీ। మదపాటలగండభూః। చందనద్రవదిగ్ధాంగీ। చాంపేయకుసుమప్రియా। |
92 |
436 | కుశలా। కోమలాకారా। కురుకుళ్ళా। కుళేశ్వరీ। కులకుండాలయా। కౌళమార్గతత్పరసేవితా। |
93 |
442 | కుమారగణనాథాంబా। తుష్టిః। పుష్టిః। మతిః। ధృతిః। శాంతిః। స్వస్తిమతీ। కాంతిః। నందినీ। విఘ్ననాశినీ। |
94 |
452 | తేజోవతీ। త్రినయనా। లోలాక్షీ కామరూపిణీ। మాలినీ। హంసినీ। మాతా। మలయాచలవాసినీ। |
95 |
459 | సుముఖీ। నళినీ। సుభ్రూః। శోభనా। సురనాయికా। కాలకంఠీ। కాంతిమతీ। క్షోభిణీ। సూక్ష్మరూపిణీ। |
96 |
468 | వజ్రేశ్వరీ। వామదేవీ। వయోఽవస్థావివర్జితా। సిద్ధేశ్వరీ। సిద్ధవిద్యా। సిద్ధమాతా। యశస్వినీ। |
97 |
475 | విశుద్ధిచక్రనిలయా। ఆరక్తవర్ణా। త్రిలోచనా। ఖట్వాంగాదిప్రహరణా। వదనైకసమన్వితా। |
98 |
480 | పాయసాన్నప్రియా। త్వక్స్థా। పశులోకభయంకరీ। అమృతాదిమహాశక్తిసంవృతా। డాకినీశ్వరీ। |
99 |
485 | అనాహతాబ్జనిలయా। శ్యామాభా। వదనద్వయా। దంష్ట్రోజ్జ్వలా। అక్షమాలాదిధరా। రుధిరసంస్థితా। |
100 |
491 | కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృతా। స్నిగ్ధౌదనప్రియా। మహావీరేంద్రవరదా। రాకిణ్యంబాస్వరూపిణీ। |
101 |
495 | మణిపూరాబ్జనిలయా। వదనత్రయసంయుతా। వజ్రాదికాయుధోపేతా। డామర్యాదిభిరావృతా। |
102 |
499 | రక్తవర్ణా। మాంసనిష్ఠా। గుడాన్నప్రీతమానసా। సమస్తభక్తసుఖదా। లాకిన్యంబాస్వరూపిణీ। |
103 |
504 | స్వాధిష్ఠానాంబుజగతా। చతుర్వక్త్రమనోహరా। శూలాద్యాయుధసంపన్నా। పీతవర్ణా। అతిగర్వితా। |
104 |
509 | మేదోనిష్ఠా। మధుప్రీతా। బందిన్యాదిసమన్వితా। దధ్యన్నాసక్తహృదయా। కాకినీరూపధారిణీ। |
105 |
514 | మూలాధారాంబుజారూఢా। పంచవక్త్రా। అస్థిసంస్థితా। అంకుశాదిప్రహరణా। వరదాదినిషేవితా। |
106 |
519 | ముద్గౌదనాసక్తచిత్తా। సాకిన్యంబాస్వరూపిణీ। ఆజ్ఞాచక్రాబ్జనిలయా। శుక్లవర్ణా। షడాననా। |
107 |
524 | మజ్జాసంస్థా। హంసవతీముఖ్యశక్తిసమన్వితా। హరిద్రాన్నైకరసికా। హాకినీరూపధారిణీ। |
108 |
528 | సహస్రదళపద్మస్థా। సర్వవర్ణోపశోభితా। సర్వాయుధధరా। శుక్లసంస్థితా। సర్వతోముఖీ। |
109 |
533 | సర్వౌదనప్రీతచిత్తా। యాకిన్యంబాస్వరూపిణీ। స్వాహా। స్వధా। అమతిః। మేధా। శ్రుతిః। స్మృతిః। అనుత్తమా। |
110 |
542 | పుణ్యకీర్తిః। పుణ్యలభ్యా। పుణ్యశ్రవణకీర్తనా। పులోమజార్చితా। బంధమోచనీ। బంధురాలకా। |
111 |
548 | విమర్శరూపిణీ। విద్యా। వియదాదిజగత్ప్రసూః। సర్వవ్యాధిప్రశమనీ। సర్వమృత్యునివారిణీ। |
112 |
553 | అగ్రగణ్యా। అచింత్యరూపా। కలికల్మషనాశినీ। కాత్యాయనీ। కాలహంత్రీ। కమలాక్షనిషేవితా। |
113 |
559 | తాంబూలపూరితముఖీ। దాడిమీకుసుమప్రభా। మృగాక్షీ। మోహినీ। ముఖ్యా। మృడానీ। మిత్రరూపిణీ। |
114 |
566 | నిత్యతృప్తా। భక్తనిధిః। నియంత్రీ। నిఖిలేశ్వరీ। మైత్ర్యాదివాసనాలభ్యా। మహాప్రళయసాక్షిణీ। |
115 |
572 | పరాశక్తిః। పరానిష్ఠా। ప్రజ్ఞానఘనరూపిణీ। మాధ్వీపానాలసా। మత్తా। మాతృకావర్ణరూపిణీ। |
116 |
578 | మహాకైలాసనిలయా। మృణాలమృదుదోర్లతా। మహనీయా। దయామూర్తిః। మహాసామ్రాజ్యశాలినీ। |
117 |
583 | ఆత్మవిద్యా। మహావిద్యా। శ్రీవిద్యా। కామసేవితా। శ్రీషోడశాక్షరీవిద్యా। త్రికూటా। కామకోటికా। |
118 |
590 | కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా। శిరఃస్థితా। చంద్రనిభా। ఫాలస్థా। ఇంద్రధనుఃప్రభా। |
119 |
595 | హృదయస్థా। రవిప్రఖ్యా। త్రికోణాంతరదీపికా। దాక్షాయణీ। దైత్యహంత్రీ। దక్షయజ్ఞవినాశినీ। |
120 |
601 | దరాందోళితదీర్ఘాక్షీ। దరహాసోజ్జ్వలన్ముఖీ। గురుమూర్తిః। గుణనిధిః। గోమాతా। గుహజన్మభూః। |
121 |
607 | దేవేశీ। దండనీతిస్థా। దహరాకాశరూపిణీ। ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా। |
122 |
611 | కళాత్మికా। కళానాథా। కావ్యాలాపవినోదినీ। సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా। |
123 |
615 | ఆదిశక్తిః। అమేయా। ఆత్మా। పరమా। పావనాకృతిః। అనేకకోటిబ్రహ్మాండజననీ। దివ్యవిగ్రహా। |
124 |
622 | క్లీంకారీ। కేవలా। గుహ్యా। కైవల్యపదదాయినీ। త్రిపురా। త్రిజగద్వంద్యా। త్రిమూర్తిః। త్రిదశేశ్వరీ। |
125 |
630 | త్ర్యక్షరీ। దివ్యగంధాఢ్యా। సిందూరతిలకాంచితా। ఉమా। శైలేంద్రతనయా। గౌరీ। గంధర్వసేవితా। |
126 |
637 | విశ్వగర్భా। స్వర్ణగర్భా। అవరదా। వాగధీశ్వరీ। ధ్యానగమ్యా। అపరిచ్ఛేద్యా। జ్ఞానదా। జ్ఞానవిగ్రహా। |
127 |
645 | సర్వవేదాంతసంవేద్యా। సత్యానందస్వరూపిణీ। లోపాముద్రార్చితా। లీలాక్లప్తబ్రహ్మాండమండలా। |
128 |
649 | అదృశ్యా। దృశ్యరహితా। విజ్ఞాత్రీ। వేద్యవర్జితా। యోగినీ। యోగదా। యోగ్యా। యోగానందా। యుగంధరా। |
129 |
658 | ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ। సర్వాధారా। సుప్రతిష్ఠా। సదసద్రూపధారిణీ। |
130 |
662 | అష్టమూర్తిః। అజాజైత్రీ। లోకయాత్రావిధాయినీ। ఏకాకినీ। భూమరూపా। నిర్ద్వైతా। ద్వైతవర్జితా। |
131 |
669 | అన్నదా। వసుదా। వృద్ధా। బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ। బృహతీ। బ్రాహ్మణీ। బ్రాహ్మీ। బ్రహ్మానందా। బలిప్రియా। |
132 |
678 | భాషారూపా। బృహత్సేనా। భావాభావవివర్జితా। సుఖారాధ్యా। శుభకరీ। శోభనాసులభాగతిః। |
133 |
684 | రాజరాజేశ్వరీ। రాజ్యదాయినీ। రాజ్యవల్లభా। రాజత్కృపా। రాజపీఠనివేశితనిజాశ్రితా। |
134 |
689 | రాజ్యలక్ష్మీః। కోశనాథా। చతురంగబలేశ్వరీ। సామ్రాజ్యదాయినీ। సత్యసంధా। సాగరమేఖలా। |
135 |
695 | దీక్షితా। దైత్యశమనీ। సర్వలోకవశంకరీ। సర్వార్థదాత్రీ। సావిత్రీ। సచ్చిదానందరూపిణీ। |
136 |
701 | దేశకాలాపరిచ్ఛిన్నా। సర్వగా। సర్వమోహినీ। సరస్వతీ। శాస్త్రమయీ। గుహాంబా। గుహ్యరూపిణీ। |
137 |
708 | సర్వోపాధివినిర్ముక్తా। సదాశివపతివ్రతా। సంప్రదాయేశ్వరీ। సాధుః। ఈ। గురుమండలరూపిణీ। |
138 |
714 | కులోత్తీర్ణా। భగారాధ్యా। మాయా। మధుమతీ। మహీ। గణాంబా। గుహ్యకారాధ్యా। కోమలాంగీ। గురుప్రియా। |
139 |
723 | స్వతంత్రా। సర్వతంత్రేశీ। దక్షిణామూర్తిరూపిణీ। సనకాదిసమారాధ్యా। శివజ్ఞానప్రదాయినీ। |
140 |
728 | చిత్కళా। ఆనందకలికా। ప్రేమరూపా। ప్రియంకరీ। నామపారాయణప్రీతా। నందివిద్యా। నటేశ్వరీ। |
141 |
735 | మిథ్యాజగదధిష్ఠానా। ముక్తిదా। ముక్తిరూపిణీ। లాస్యప్రియా। లయకరీ। లజ్జా। రంభాదివందితా। |
142 |
742 | భవదావసుధావృష్టిః। పాపారణ్యదవానలా। దౌర్భాగ్యతూలవాతూలా। జరాధ్వాంతరవిప్రభా। |
143 |
746 | భాగ్యాబ్ధిచంద్రికా। భక్తచిత్తకేకిఘనాఘనా। రోగపర్వతదంభోళిః। మృత్యుదారుకుఠారికా। |
144 |
750 | మహేశ్వరీ। మహాకాళీ। మహాగ్రాసా। మహాశనా। అపర్ణా। చండికా। చండముండాసురనిషూదినీ। |
145 |
757 | క్షరాక్షరాత్మికా। సర్వలోకేశీ। విశ్వధారిణీ। త్రివర్గదాత్రీ। సుభగా। త్ర్యంబకా। త్రిగుణాత్మికా। |
146 |
764 | స్వర్గాపవర్గదా। శుద్ధా। జపాపుష్పనిభాకృతిః। ఓజోవతీ। ద్యుతిధరా। యజ్ఞరూపా। ప్రియవ్రతా। |
147 |
771 | దురారాధ్యా। దురాధర్షా। పాటలీకుసుమప్రియా। మహతీ। మేరునిలయా। మందారకుసుమప్రియా। |
148 |
777 | వీరారాధ్యా। విరాడ్రూపా। విరజా। విశ్వతోముఖీ। ప్రత్యగ్రూపా। పరాకాశా। ప్రాణదా। ప్రాణరూపిణీ। |
149 |
785 | మార్తాండభైరవారాధ్యా। మంత్రిణీన్యస్తరాజ్యధూః। త్రిపురేశీ। జయత్సేనా। నిస్త్రైగుణ్యా। పరాపరా। |
150 |
791 | సత్యజ్ఞానానందరూపా। సామరస్యపరాయణా। కపర్దినీ। కళామాలా। కామధుక్। కామరూపిణీ। |
151 |
797 | కళానిధిః। కావ్యకళా। రసజ్ఞా। రసశేవధిః। పుష్టా। పురాతనా। పూజ్యా। పుష్కరా। పుష్కరేక్షణా। |
152 |
806 | పరంజ్యోతిః। పరంధామ। పరమాణుః। పరాత్పరా। పాశహస్తా। పాశహంత్రీ। పరమంత్రవిభేదినీ। |
153 |
813 | మూర్తా। అమూర్తా। అనిత్యతృప్తా। మునిమానసహంసికా। సత్యవ్రతా। సత్యరూపా। సర్వాంతర్యామినీ। సతీ। |
154 |
821 | బ్రహ్మాణీ। బ్రహ్మ। జననీ। బహురూపా। బుధార్చితా। ప్రసవిత్రీ। ప్రచండా। ఆజ్ఞా। ప్రతిష్ఠా। ప్రకటాకృతిః। |
155 |
831 | ప్రాణేశ్వరీ। ప్రాణదాత్రీ। పంచాశత్పీఠరూపిణీ। విశృంఖలా। వివిక్తస్థా। వీరమాతా। వియత్ప్రసూః। |
156 |
838 | ముకుందా। ముక్తినిలయా। మూలవిగ్రహరూపిణీ। భావజ్ఞా। భవరోగఘ్నీ। భవచక్రప్రవర్తినీ। |
157 |
844 | ఛందస్సారా। శాస్త్రసారా। మంత్రసారా। తలోదరీ। ఉదారకీర్తిః। ఉరద్దామవైభవా। వర్ణరూపిణీ। |
158 |
851 | జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ। సర్వోపనిషదుద్ఘుష్టా। శాంత్యతీతకళాత్మికా। |
159 |
854 | గంభీరా। గగనాంతస్థా। గర్వితా। గానలోలుపా। కల్పనారహితా। కాష్ఠా। అకాంతా। కాంతార్ధవిగ్రహా। |
160 |
862 | కార్యకారణనిర్ముక్తా। కామకేళితరంగితా। కనత్కనకతాటంకా। లీలావిగ్రహధారిణీ। |
161 |
866 | అజా। క్షయవినిర్ముక్తా। ముగ్ధా। క్షిప్రప్రసాదినీ। అంతర్ముఖసమారాధ్యా। బహిర్ముఖసుదుర్లభా। |
162 |
872 | త్రయీ। త్రివర్గనిలయా। త్రిస్థా। త్రిపురమాలినీ। నిరామయా। నిరాలంబా। స్వాత్మారామా। సుధాసృతిః। |
163 |
880 | సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా। యజ్ఞప్రియా। యజ్ఞకర్త్రీ। యజమానస్వరూపిణీ। |
164 |
884 | ధర్మాధారా। ధనాధ్యక్షా। ధనధాన్యవివర్ధినీ। విప్రప్రియా। విప్రరూపా। విశ్వభ్రమణకారిణీ। |
165 |
890 | విశ్వగ్రాసా। విద్రుమాభా। వైష్ణవీ। విష్ణురూపిణీ। అయోనిః। యోనినిలయా। కూటస్థా। కులరూపిణీ। |
166 |
898 | వీరగోష్ఠీప్రియా। వీరా। నైష్కర్మ్యా। నాదరూపిణీ। విజ్ఞానకలనా। కల్యా। విదగ్ధా। బైందవాసనా। |
167 |
906 | తత్త్వాధికా। తత్త్వమయీ। తత్త్వమర్థస్వరూపిణీ। సామగానప్రియా। సౌమ్యా। సదాశివకుటుంబినీ। |
168 |
912 | సవ్యాపసవ్యమార్గస్థా। సర్వాపద్వినివారిణీ। స్వస్థా। స్వభావమధురా। ధీరా। ధీరసమర్చితా। |
169 |
918 | చైతన్యార్ఘ్యసమారాధ్యా। చైతన్యకుసుమప్రియా। సదోదితా। సదాతుష్టా। తరుణాదిత్యపాటలా। |
170 |
923 | దక్షిణాదక్షిణారాధ్యా। దరస్మేరముఖాంబుజా। కౌళినీకేవలా। అనర్ఘ్యకైవల్యపదదాయినీ। |
171 |
927 | స్తోత్రప్రియా। స్తుతిమతీ। శ్రుతిసంస్తుతవైభవా। మనస్వినీ। మానవతీ। మహేశీ। మంగళాకృతిః। |
172 |
934 | విశ్వమాతా। జగద్ధాత్రీ। విశాలాక్షీ। విరాగిణీ। ప్రగల్భా। పరమోదారా। పరామోదా। మనోమయీ। |
173 |
942 | వ్యోమకేశీ। విమానస్థా। వజ్రిణీ। వామకేశ్వరీ। పంచయజ్ఞప్రియా। పంచప్రేతమంచాధిశాయినీ। |
174 |
948 | పంచమీ। పంచభూతేశీ। పంచసంఖ్యోపచారిణీ। శాశ్వతీ। శాశ్వతైశ్వర్యా। శర్మదా। శంభుమోహినీ। |
175 |
955 | ధరా। ధరసుతా। ధన్యా। ధర్మిణీ। ధర్మవర్ధినీ। లోకాతీతా। గుణాతీతా। సర్వాతీతా। శమాత్మికా। |
176 |
964 | బంధూకకుసుమప్రఖ్యా। బాలా। లీలావినోదినీ। సుమంగళీ। సుఖకరీ। సువేషాఢ్యా। సువాసినీ। |
177 |
971 | సువాసిన్యర్చనప్రీతా। ఆశోభనా। శుద్ధమానసా। బిందుతర్పణసంతుష్టా। పూర్వజా। త్రిపురాంబికా। |
178 |
977 | దశముద్రాసమారాధ్యా। త్రిపురా శ్రీవశంకరీ। జ్ఞానముద్రా। జ్ఞానగమ్యా। జ్ఞానజ్ఞేయస్వరూపిణీ। |
179 |
982 | యోనిముద్రా। త్రిఖండేశీ। త్రిగుణా। అంబా। త్రికోణగా। అనఘా। అద్భుతచారిత్రా। వాంఛితార్థప్రదాయినీ। |
180 |
990 | అభ్యాసాతిశయజ్ఞాతా। షడధ్వాతీతరూపిణీ। అవ్యాజకరుణామూర్తిః। అజ్ఞానధ్వాంతదీపికా। |
181 |
994 | ఆబాలగోపవిదితా। సర్వానుల్లంఘ్యశాసనా। శ్రీచక్రరాజనిలయా। శ్రీమత్త్రిపురసుందరీ। |
182 |
998 | శ్రీశివా। శివశక్త్యైక్యరూపిణీ। లలితాంబికా। ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః। |
183 |
కొన్ని ఉపయుక్తమైన లింకులు:
చాలామంది నామ విభజన తెలియక తప్పుచేస్తున్నారు,మంచి సహాయమందించారు.
రిప్లయితొలగించండిసంతోషం శర్మగారూ.
తొలగించండిఎవరైనా ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటే కృషి ఫలించినట్లే.
శ్రీలలితాసహస్రనామావళిలో నామాలకు విపులంగా అర్థం చెప్పటానికి ప్రయత్నించాలన్న ఉద్దేశం లేదు.
అది కూడా వివరంగా ఈ నవరాత్రుల్లో వ్రాస్తే మరింత మందికి చాల ఉపయోగంగా ఉంటుందేమో. కాని చదువరులకు అంత ఆసక్తి ఉంటుందని అనుకోను.
కనీసం నామవిభజన తెలిసి సరిగా స్తోత్రపారాయణం చేస్తే చాలు.
అయ్యో ఎంతమాట, అమృతం పంచుతామంటే వద్దంటామా.. నామాలకు విపులంగా అర్థం తెలియచేయాలని సవినయంగా వేడుకొంటున్నాను..
తొలగించండికళ్యాణిగారు,
తొలగించండిమీ ఒక్కరి కోసం ఐనా తప్పకుండా వ్రాస్తాను.
ఐతే వేయి నామాలనూ విడివిడిగా చర్చించటం కాక, కొన్ని కొన్ని వర్గీకరణలు చేసి వ్రాస్తాను రోజుకు ఒక టపా చొప్పున, రేపటినుండి దసరాపండగ వరకూ.
కీ.శే. సింహంభట్ల రామమూర్తిశాస్త్రులవారు నామావళికి రచించిన ‘పరిమళ’ ఆన్ధ్రతాత్పర్యము యిక్కడ - (మొదలు 144స్కాన్‍పేజీ )
తొలగించండిhttp://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0051/793&first=1&last=401&barcode=2990100051788
(Search for title "shrii lalitaa sahasranaama stootramu" at http://www.dli.ernet.in)
వ్యాఖ్యాత వివరాలు యిక్కడ
http://www.indiadivine.org/audarya/shakti-sadhana/121525-telugu-commentary-lalita-sahasranama.html
భాస్కర రాయల వారి సౌభాగ్య భాస్కరం చదవండి
తొలగించండినమస్కారం
రిప్లయితొలగించండివారం రోజులుగా మీ బ్లాగులో ఏమీ పోస్టులు కనపడట్లేదు అని పొద్దున్నా సాయంత్రం ఎదురు చూస్తున్నాను. చక్కని ఉపయుక్తమైన విషయం పొందుపరచారు. మీ ప్రయత్నాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.
నమస్కారం
రిప్లయితొలగించండి47 వ శ్లోకం ఒకసారి సరిచూడగలరు.
నిశ్చింతానిరహంకారానిర్మోహామోహనాశినీ।
నిర్మమామమతాహంత్రీనిష్పాపాపాపనాశినీ।
అని టైపు చేసారు
నిశ్చిన్తా- నిరహంకారా-నిర్మోహా-మోహనాశినీ
నిర్మమా-మమతాహన్త్రీ- నిష్పాపా-పాపనాశినీ
{... నిశ్చిన్తాయై నమః, నిరహంకారాయై నమః, నిర్మోహాయై నమః, మోహనాశిన్యై నమః, నిర్మమాయై నమః, మమతాహన్త్ర్యైనమః, నిష్పాపాయైనమః, పాపనాశిన్యైనమః}
నామాల సంఖ్య కూడా 998 సంఖ్యగా చూపారు.పై నామాలను కలుపుతే వెయ్యి దాటుతున్నాయి ఒక్కసారి సరి చూడగలరు అని మనవి.
క్షమించాలి నామాలు సరిపోయాయి కానీ 47 వ శ్లోకంలో విభజన చేస్తే సరిపోతుంది.
తొలగించండినాగేంద్రగారూ, 183వ శ్లోకం 998వ నామంతో మొదలై 3 నామాలు కలిగి ఉంది. మొత్తం 1000 నామాలు.
రిప్లయితొలగించండి47 వ శ్లోకంలో నామ విభజన చేయటం మరచాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
నమస్కారం
తొలగించండి22వ శ్లోకంలో సుమేరుమధ్యశృంగస్థా అని వ్రాసారు కాని సుమేరుశృంగమధ్యస్థా అని చదివినగుర్తు, ఏమి అనుకొకుండా ఏది correct కొంచెం తెలియచేయగలరు..
సుమేరుమధ్యశృంగస్థా అన్న పాఠమే ఎక్కువగ కనబడుతోంది. ఇదే గ్రాహ్యం.
తొలగించండిఒక వ్యాఖ్యాత సుమేరుశృంగమధ్యస్థా అన్న పాఠాన్ని చెప్పారని తుమ్మలపల్లివారి భాష్యం.
అయ్యా పెద్దవారు మీకు తెలీదని కాదు కానీ, చెప్పాలని అనిపించింది. లలితా సహస్రనామాలనే లలితా రహస్య నామాలుగా పేర్కొంటారు. ఇవి మిగతా సహస్రనామాల లాగా వ్యాసమహర్షులవారు వ్రాసినవి కావు. వాగ్దేవతలు వ్రాసినవి. వీటిని రహస్యనామాలని అనటంలో కూడా ఓ విశేషముందని చెబుతారు. అదేమిటంటే, ఒక్కో శ్లోకంలోనూ రహస్యమంత్రాలున్నాయని చెబుతారు. ఏ నామానికా నామాన్ని నమ: అని పారాయణం చేస్తే కన్నా కూడా స్తోత్రరూపంలోనే పారాయణం చేస్తే ఫలితం బాగుంటుందని చెబుతారు.
రిప్లయితొలగించండికేవలం నామబుద్ధిస్తే న కార్యా తేషు కుంభజ
మంత్రాత్మకత్వమే తేషాం నామాత్మ తామపిచ - ఇది హయగ్రీవ వచనం.
ఉదాహరణకు "విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ" అనే వాక్యంలో నాలుగు నామాలు కనబడతాయి.
విధాత్రి = ఓం, వేదజననీ = ఐం, విష్ణుమాయా = క్రీం, విలాసినీ = స్త్రీం అనే మంత్రబీజాలు ఈ నామాలకు సూచించబడుతున్నాయి. కాబట్టి, వాటిని వేటికది విడిగా నాలుగు నామాలుగా ఉచ్చరిస్తే మంత్ర విచ్ఛిత్తి కలుగుతుందని మా గురువుగారి అభిప్రాయం.
బైదవే, శ్యామలీయంగారు మీ ఈ మెయిల్ అడ్రసు నాకు పంపగలరా. నా మెయిల్ అడ్రసు : kskk@rediffmail.com
W/Regards - Saikiran Kumar
అయ్యా కొండముదివారు, మీ స్పందనకు సంతోషం.
రిప్లయితొలగించండిమీరు వ్రాసిన దంతా సత్యమే.
కాని మీరు ఎత్తి చూపదలచుకున్న నా పొరపాటు ఏమిటో బోధపడటం లేదు.
అందుకు మీరు క్షమించాలి.
మీకు మెయిల్ పంపుతున్నాను.
కొండముది వారు,
రిప్లయితొలగించండిశ్రీలలితా సహస్ర నామ స్తోత్రం అనే పేరు కదా? ఈ స్తోత్రం కూడా, "ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః" అని సంపన్నం అవుతున్నది. అందుచేత స్తోత్రంలో వేయినామాలు చెప్పబడ్డవి అన్న సంప్రదాయం గౌరవించదగినది, ఆచరించదగినది అని నా నమ్మకం. మీ గురువుగారు పూజ్యులు. వారన్నట్లుగా ఈ "విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ" మొదలైన అనేక శ్లోకపాదాలు బహునామ సంపుటీకరణలు అయినప్పటికీ మంత్రగర్భములుగా ఉండటం అవశ్యం అంగీకరించదగిన సూచనయే. ఐతే, నామలుగా విడదీసి చదువరాదని అనటం మాత్రం అంత సబబుగా తోచదు. అలా విడదీయరాదని స్తోత్రం యొక్క ఉద్దేశం ఐతే అమ్మ ఆదేశం ప్రకారం ఈ దివ్యస్తోత్రాన్ని ప్రకాశింప జేసిన వశిన్యాదులు స్తోత్రాన్ని "ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః" అని ముగించేవారే కాదు కదా? ఆలోచించండి. సహస్రమైన నామాలు పొందుపదచామనే స్తోత్రకర్తల అభిప్రాయం కూడా అని స్పష్టపడుతున్నప్పుడు అ నామాలను విడివిడిగా చక్కగా తెలుసుకుని స్తోత్ర పారాయణం చేయటం మరింత సౌకర్యంగా ఉంటుంది. ముందే చెప్పినట్లు చాలా మంది ఘోరంగా విరిచి చదువుతున్నారు ఈ స్తోత్రంలో శ్లోకాల్ని. నా పాత టపా ఈ విషయంలో ఒకటి చదవండి ఈ రోజున మనస్సు ఏమీ బాగోలేదు. . స్వస్తిరస్తు.
శ్యామలీయం గారు - విడివిడి నామాలుగా చేయొద్దని నేను ఎక్కడా చెప్పలేదు. నా కామెంటులో కూడా "ఏ నామానికా నామాన్ని నమ: అని పారాయణం చేస్తే కన్నా కూడా స్తోత్రరూపంలోనే పారాయణం చేస్తే ఫలితం బాగుంటుందని చెబుతారు” అని మాత్రమే అన్నాను. బహుశా మీరు గమనించలేదనుకుంటాను.
రిప్లయితొలగించండిపైన లింకుగా ఇచ్చిన మీ పోస్టులో ఆవేదన అర్ధమయ్యింది. మీరన్నట్లు నామ విశేషాలు తెలిసి పారాయణ చేయటం చాలా అవసరం. లలితా రహస్య నామాల విషయానికి వచ్చేసరికి పైన నేను ఉదహరించిన హయగ్రీవ వచనం దృష్టిలో ఉంచుకొని, ప్రతి నామమూ మంత్రాత్మకమైనదిగా గ్రహించి, జాగ్రత్తగా పారాయణ చేయాల్సి ఉంటుంది.
Any ways, thank you very much.
W/R
శ్యామల రావు గారు.. నమస్కారములు..
రిప్లయితొలగించండి"అవరదా" అనే నామానికి అర్ధం చెప్పగలరు.
శ్రీలలితాసహస్రనామాల్లో అవరదా అనేది 639వ నామం. ఈ అవరదా అనే నామానికి అర్థం:
రిప్లయితొలగించండిభాస్కరరాయలవారి వ్యాఖ్య సౌభాగ్యభాస్కరం ప్రకారం: వరులు అంటే శ్రేష్ఠులు అంటే ఆర్యులు, పూజించ దగినవారు. అవరులు అంటే అనార్యులు. అనగా అసురులు. ద్యతి అంటే శిక్షించునది, చంపునది. అమ్మ అవరులైన అనార్యులను చంపునది కాబట్టి అవరద.
ఈ అవరదా అన్న నామానికి కాంతివంతమైన దంతాలు లేదా జ్ఞానదంతము కలది అన్న అర్థం కూడా కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు.
వైద్యనాథదీక్షితులు వంటి కొందరు వ్యాఖ్యాతలు వరదా అనే పాఠాన్ని స్వీకరించి భక్తులకు వరములను ఇచ్చునది అని చెప్పారు. భాస్కరరాయలవారి అవరదా అన్న పాఠం కృతకం అని వైద్యనాథుల ఆక్షేపణ. కాని సమయమతంలో అవరదా అన్న పాఠమే చెప్పబడుతున్నది.
ధన్యవాదములు.
రిప్లయితొలగించండికార్య కారణ నిర్ముక్తా అని సృష్టికి పూర్వ స్థితి, కామ కేళి తరంగితా అని సృష్టి చేయాలనే సంకల్పము చెప్పారు వాగ్దేవతలు. 'కనత్కనక తాటంకా' అని బంగారు చేవిపోగులను ఇక్కవ వర్నించవలసిన అవసరం ఈ నామాల తరువాత ఎందుకు వచ్చింది? తరువాత నామం 'లీలా విగ్రహ దారిణీ' అని సంకల్ప మాత్రం చేత సృష్టి చేయగలది కూడా ముందు నామాలకి అనుబంధం గా ఉన్నది.
వివరించగలరు.
శాస్త్రిగారూ,
తొలగించండిఈ కనత్కనకతాటంకా అనే నామానికి ముందు వెనుక నామాలు దేవీతత్త్వప్రతిపాదకాలుగా ఉండి మధ్యలో ఇది దేవీవిగ్రహవర్ణనాత్మకమైన నామం ఎందుకు వాగ్దేవతలు చెప్పారో అన్నది మీ సందేహం. మంచి ప్రశ్నయే.
సౌభాగ్యభాస్కరది వ్యాఖ్యానాల్లో ఈ నామానికి ప్రకాశమానమైన బంగారు చెవిపోగులు కలది అన్న అర్థమే ఇవ్వటం కనిపిస్తున్నది.
ఆధునికులైన వడ్లమాని వేంకటేశ్వరరావుగారు తాటంక మనగా దీర్ఘాక్షరం; బ్రహ్మమును నిర్దేశించే దీర్ఘాక్షరం ఐన ఓంకారం. కనకతాటకం అనగా హిరణ్యబ్రహ్మ = హిరణ్యగర్భుడనబడే బ్రహ్మము. అందుచేత ఈ నామానికి సృష్టికి ముందుగా హిరణ్యగర్భరూపంలో భాసించునది అని అర్థం చెప్పారు.
వడ్లమానివారి వ్యాఖ్యాన వైఖరిలో అనుష్టుప్పు పాదం అంతే ఒక unit గా తీసుకుని చెప్తారు. అందుచేత హిరణ్యగర్భరూపము అమ్మ యొక్క లీలా విగ్రహం అని వారి వ్యాఖ్య.
ఐతే, తాటంకశభ్దాన్ని ప్రణవస్వరూపంగా దర్శించటానికి తగిన ఉపపత్తి వారు చూపలేదని నా అభిప్రాయం. బహుశః, నా చిట్టిబుఱ్ఱకు అందలేదేమో వారి వ్యాఖ్యారహస్యం!
జంబుకేశ్వరం లో అమ్మ వారి చెవి పోగులపై శ్రీ చక్రం ఉన్నట్టుగా ఒక చోట, చెవి పొగల ద్వారానే అమ్మ కొన్ని లోకములు సృష్టి చేసినదని మరొక చోట చదివాను. ఇక్కడి నామానికి ప్రమాణం చూపేవి మాత్రం నాకు ఎక్కడా దొరకలేదు నాకు.
రిప్లయితొలగించండిమీ వివరణకు ధన్యవాదములు సర్.
శ్యామల రావు గారు...
రిప్లయితొలగించండిఅన్యాయం సర్...మీతో కలిసి సుమారు ఆరు సంవత్సరాలు పని చేశాను నేను. చాల విషయాలు మాట్లాడుకున్నాం. కనీసం ఒక్క సారి కూడా లలిత సహస్రనామం గురించి మాట్లాడుకోలేదు. నా దురదృష్టం సర్. ఏమైనా ఇప్పుడు చిక్కరుగాదా. గట్టిగా పట్టుకుంటాం మిమ్మల్ని.
శాస్త్రిగారూ,
తొలగించండినేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉన్నానండీ. నేను IBM నుండి బయటకు వచ్చినప్పుడు నా వ్యక్తిగతమైన సెల్‌నంబరూ, నా జీ-మెయిల్ ఐడీ కూడా అందరికీ నా తుది మెయిల్‌లో పంపాను గదా?
మీకు విడిగా మెయిల్ పంపాను మరిన్ని వివరాలతో.
మీ సీటు దగ్గరలోనే శ్రీపిల్లూట్ల శ్రీహరిగారు ఉన్నారు గదా! ఆయన శ్రీవిద్యలో దీక్షపుచ్చుకున్నారని అనుకుంటాను. ఆయన మీ సందేహాలకు చక్కగా సమాధానాలు చెప్పగలరు. వీలు చూసుకుని ఆయనతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను.
కొద్దిసేపటి క్రితమే ఈ టపాను చదివాను.
రిప్లయితొలగించండిఎన్నో అద్భుతమైన విషయములను అందించినందుకు మీకు ధన్యవాదములండి.
శ్యామలరావు గారూ....ఆలస్యంగా చూశాను. మంచి ఉపయుక్తమైన పని చేశారు. కొన్ని విరుపుల దగ్గర సందేహాలు కలిగాయి.
రిప్లయితొలగించండి1.(66) సంపత్కరీ సమారూఢసింధూరవ్రజాసేవితా...ఇక్కడ సంపత్కరీ దగ్గర విరుపు ఉండక్కర్లేదా? లేకుండా అర్థం ఏమిటి?
2. (524) హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా...ఇక్కడ హంసవతీ దగ్గర విరుపు ఉండాలా? లేకుండా అర్థం ఏమిటి?
3. (813) 'నిత్యతృప్తా' నా? 'అనిత్యతృప్తా'నా? అనిత్యతృప్తా కు అర్థం ఏమని చెబుతాం?
4. (821) ప్రచండ/ఆజ్ఞా అని విడదీశారు. ప్రచండాజ్ఞా కాదా?
5. (923) కౌళినీకేవలా --అన్నారు. కౌళినీ/కేవలా --కాదా?
భాస్కరంగారూ, శ్యామలీయం బ్లాగుకు సాదరస్వాగతం. నామావళినుండి మీరు ఉదహరించిన పై నామాలు సరిగానే విభజించి చూపటం జరిగింది. ఈ ఒక్క ముక్క అనేసి మీ సందేహం నివృత్తి చేసానని అనటం భావ్యం కాదు. అలాగని ఒక ప్రతివ్యాఖ్యలో వివరంగా వ్రాయటమూ సాధ్యం కాదు. అందుకని వివరంగా ఈ విషయం మీద ఒక టపా వ్రాస్తాను. బహుశః కొద్ది సేపటి తరువాత. నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు.
తొలగించండిమాస్టారూ,ఇక్కడ నామసంఖ్య 55తో మొదలయ్యే శ్లోక సంఖ్య 22లో "సుమేరుమధ్యశృంగస్థా" అన్నారు మీరు,కానీ మిగతా అన్ని చోట్లా "సుమేరుశృంగమధ్యస్థా" అని వస్తున్నది,యేది సరయినది?
రిప్లయితొలగించండిహరిబాబుగారు,
తొలగించండివావిళ్ళవారి పాఠంలో "సుమేరుశృంగమధ్యస్థా" అని ఉన్నది.
తుమ్మలపల్లివారిభాష్య పాఠంలో "సుమేరుమధ్యశృంగస్థా" అని నేను ఇచ్చిన పాఠం ఉన్నది.
మధ్యశృంగమన్నదే సరైనపాఠం.
అర్ధంలో తేడా యేమయిన ఔంటుందా,రెండూ ఒకే అర్ధాన్నిస్తాయా?సుమేరుశృంగమధ్యస్తా అంటే సుమేరుశృంగానికి మధ్యలో ఉందేది అని కదా!నాకు సంకృత పదవిభజన అంతగా తెలియదు కానీ రెండో మాట సుమరుమధ్యశృంగస్థా అంటే కొంచెం గంద్రగోళంగా వుంది - వివరిస్తారా?
తొలగించండిమంచి ప్రశ్న వేశారు హరిబాబుగారు. సుమేరుశృంగమధ్యస్తా లేదా సుమరుమధ్యశృంగస్థా అన్నప్పుడు. అర్ధంలో తేడా ఉంటుందా అని.
తొలగించండిక్లుప్తంగా చెప్పాలంటే అర్థంలో తేదా తప్పకుండా ఉంది. సుమేరుశృంగమధ్యస్థా అన్నప్పుడు సుమేరుపర్వతం యొక్క శృంగమునకు మధ్యభాగంలో ఉన్నది అని అర్థం వస్తుంది. సుమేరుమధ్యశృంగస్థా అన్నప్పుడు సుమేరుమర్వతంయొక్క శృంగములలో మధ్య శృంగమునందు ఉన్నది అని అర్థం వస్తుంది. వ్యావహారికంగా కూడా మధ్య ఇల్లు అన్నప్పుడు మరికొన్ని ఇళ్ళూ చుట్టుపక్కల ఉన్నాయని తాత్పర్యం వస్తుంది కాని ఇంటిమధ్య అన్నపుడు అలా అర్థం రాదు కదా.
సంప్రదాయికమైన వివరణ కూడా క్లుప్తంగా మనవి చేస్తాను. లలితాస్తవరత్నం (ఇదే లలితాద్విశతి)లో దుర్వాసమహర్షి వాక్యం ఇలా ఉంది. నాను త్రితయం విధిహరిగౌరీశవిష్టపాధారమ్ మధ్యే పునర్మనోహర రత్నరుచిస్తబకరంజిత దిగంతమ్ ఉపరిచతుశ్శతయోజనమత్తుంగ శృంగ పుంగవ ముపాసే.. మేరుపర్వతశిఖరాలు కూడూ త్రిమూర్తుల లోకాలకు ఆధారమైనవి.వాటి మధ్యలో నాలుగువందల యోజనాల ఎత్తుగల శ్రేష్ఠమైన నాల్గవ శిఖరం (అదే అమ్మవారి ఆవాసం).
శ్రీచక్రంలో త్రికోణమునే మేరువుగా చెప్పటం సంప్రదాయం. మధ్యగత బిందుస్థానం అమ్మవారి అవాసంగా చెబుతారు. శ్రీచక్రమూ బ్రహ్మాండపిండాండములూ ఒకటే అని సంప్రదాయం.
మీ సందేహం తీరిందని ఆశిస్తున్నాను.
నమస్కారం శ్యామలరావు గారూ...కొన్ని రకాల ప్రాణులు తము కన్న సంతానాన్ని తమే తినేస్తాయంటారు. దీనిని సూచించే మాట ఏదో ఉన్నట్టుంది. గుర్తు రావడం లేదు. మీ దృష్టికి వచ్చి ఉంటే దయచేసి చెప్పగలరా?
రిప్లయితొలగించండిఆ తెలుగు పదమేమిటో తెలుసుకోవాలని నాకూ కుతూహలంగా ఉండింది. భాస్కరం గారి మనవికి శ్యామలీయం గారు జవాబిస్తే తెలుసుకుందామని వేచి చూసాను.
రిప్లయితొలగించండితమ సంతానాన్ని తామే తినడాన్ని ఆంగ్లంలో filial cannibalism అంటారు. దీనికి సమానార్ధకమయిన పదం ఏదో తెలుగులో ఉంటుంది కదా. తెలుగుభాష మీద పట్టున్న శ్యామలీయం గారో, Zoology MSc "హరికాలం" బ్లాగ్ హరిబాబు గారో ఆ పదమేవిటో చెప్తే బాగుంటుంది.
( సరదాకి నేనే సాహసిస్తున్నాను :- అటువంటి ప్రాణుల్ని తెలుగులో "స్వసంతాన భక్షకులు" అనచ్చా? మరీ మక్కికిమక్కీగా ఉందంటారా :) )
భాస్కరంగారూ,
రిప్లయితొలగించండిఈ మధ్య వ్రాయటం తగ్గింది. బ్లాగులోకి రావటమూ తగ్గింది. మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూసాను మన్నించాలి.
తెలుగులో మీరడిన అర్థంలో మాట ఏదీ నాకూ స్ఫురణకు రావటం లేదు. అపత్యశత్రువు అన్న మాట ఒకటి సంస్కృతసమాసం మాత్రం మీరన్న అర్థం కలది తెలుసును. సమానార్థకాలతో ఈ మాటకు రూపాంతరాలు సిధ్ధింపజేసుకోవచ్చును. ఉదాహరణకు అపత్యారి, అపత్యనాశిని. నాకైతే స్వాపత్యఖాది అన్నమాట మరింత ఉచితంగా అనిపిస్తోంది.
మేము "Zoology MSc"కి వెళ్ళేసరికల్లా తెలుగు మీడియం మర్చిపోయి ఇంగ్లీషులోకి దూకేసాం మాస్టారూ!
రిప్లయితొలగించండిఅయినా ఒక చిన్న వూహ చేశాను."సుత" అనే మాటని లింగభేదం లేకుండా వాడతారు గాబట్టి "సుత హంత/సుతహంతి" అని వాడవచ్చునా!
సంస్కృతంలో 'సుత' అన్నమాటకు లింగబేధం లేదనటం సరికాదనుకుంటాను.
తొలగించండినమస్కారం నేను ఈ రోజే మీబ్లాగ్ చూడడం జరిగింది..మా సిస్టర్ ద్వారా... చాలా బాగుంది.. నేను కూడా ఇలాగె నా పుస్తకం లో విభజన కి నంబర్స్ రాసుకున్నాను.. చాల మంచి బ్లాగ్
తొలగించండిస్వాగతం రాణి శర్మగారూ, శ్యామలీయం బ్లాగును మీకు సూచించిన మీ సోదరికి నా కృతఙ్ఞతలు. ఈ బ్లాగును చదివేవారే తక్కువ అనుకుంటే చదవమని మరొకరికి చెప్పేవారెంత తక్కువో కదా. శ్యామలీయం బ్లాగు మీకు నచ్చిందని వ్రాసారు. మీకు నా ధన్యవాదాలు.
తొలగించండిశ్యామలీయం గారూ నమస్కారములు. లలిత భక్తులకు అత్యంత ఉపయుక్తమైన టపా యిది. టపాకు వచ్చిన వ్యాఖ్యల ద్వారా మరింత ఆసక్తికరమైన విషయాలు తెలియజేసారు.
రిప్లయితొలగించండిలలితాసహస్రనామ స్తోత్రానికి సౌభాగ్యభాస్కరం సాధికారికమైన వ్యాఖ్యానం అని పెద్దలంటారు. దానికి తెలుగుసేత ఉన్నదా? ఉంటే ఎక్కడ దొరుకుతుంది? దయచేసి చెప్పండి.
నిస్సందేహంగా సౌభాగ్యభాస్కరం ఒక సాధికారికమైన వ్యాఖ్యయేనండీ. నాదగ్గర తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు వ్రాసిన లలితామోదినీ భాష్యం గ్రంథం ఉన్నది. ఇది సౌభాగ్యభాస్కరంతోపాటుగా మరి కొన్ని గ్రంథాలనూ ఆధారంగా స్వీకరించి వారు సమయమతానుసారిగా వెలువరించిన భాష్యం. సౌభాగ్యభాస్కరం పూర్తిగా సమయమతానుసారి అని చెప్పలేము. సౌభాగ్యభాస్కరం ఎక్కడ లభిస్తున్నదన్న విషయం తెలియదు. లలితామోదినీభాష్యాన్ని నేను విద్యానగర్ లోని శంకరమఠంలో కొన్నాను. దాని ప్రతికోసం ఆ గ్రంథంలో 040-2756-3236 అన్న నెంబరు ఇచ్చారు.
తొలగించండిధన్యవాదాలు శ్యామలీయం గారూ
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్యామలీయం గారు..
రిప్లయితొలగించండిశ్రీ లలితా సహస్రనామలు రోజు కి ఎన్ని మార్లు, ఎన్ని రోజులు చదివితే సరస్వతీ కటాక్షం కలుగుతుంది దయచేసి తెలుపగలరు.
భగవత్కటాక్షానికి తూనికలూ కొలతలతో ఏమీ పనిలేదండీ. మనస్సు భగవదభిముఖమై నిష్కళంకమై ఉండటం ఒక్కటే అర్హత. అది అనేకసార్లు మంత్రపునశ్చరణలు చేసినవారిలో అనేకులకు కూడా లభించకపోవచ్చును. సకృత్తుగా ఒక్కసారి విశుధ్దచిత్తంతో పఠించటంతోనే అనుగ్రహప్రాప్తి ఎవరన్నా మహాత్ములకు కలుగవచ్చును. శ్రీశంకరుల నోట ఒక్కసారి కనకధారాస్తవం వెలువడగానే అమ్మ కనకవర్షం కురిపించింది. అనేకులు ఆశతో (కేవలం ఐహికమైన ఆశతోనే!) నిత్యపారాయణం చేస్తున్నా ఒక్క కాసుకూడా ఆతల్లి రాల్చటం లేదుగా! భాగవతం ప్రథమస్కందంలోనే ఒక్కఘడియ భగవధ్యానం చేసి మోక్షం పొందిన మహాత్ముని గురించి ఉంది. సరస్వతీ కటాక్షం కావాలంటే అది ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుందని నమ్మి శరణాగతి చేయాలి త్రికరణశుధ్ధిగా. అంతకంటే వేరే దారి లేదు. ఇన్నిసార్లు చదివితే ఇంతఫలం అంటూ చెప్పేవి పామరులకు కొంతలో కొంత శ్రధ్ధ కుదర్చటానికి ఉద్దేశించినవి మాత్రమే. అలా ఆశపడ్డ వారిలో నిజంగా చిత్తశుధ్ది ఉన్నవారికి శీఘ్రంగానే తల్లి అనుగ్రహం లభిస్తుంది.
తొలగించండిధన్యవాదాలు గురువుగారు. నేనో గృహిణి ని. చంటి పిల్లలు ఉన్న నాకు పారాయణ చెయ్య వీలు పడడం లేదు
రిప్లయితొలగించండిపిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పని చూసుకుంటూ, బాధ్యతలు చూసుకుంటూ నేను చదువుతున్నాను. చిత్తశుద్ధి గా ఆచరిస్తున్నానా లేదా అనే సందేహం అనేక అనేక సార్లు కలిగింది. నేను అలా చదవడం సరి అగునా కాదా
రిప్లయితొలగించండిఅమ్మా,
తొలగించండిసమస్త శాస్త్రములూ, ఆమాటకు వస్తే శ్రుతిస్మృతిపురాణేతిహాసాదికమైన వాంగ్మయం అంతా కూడా జీవుడికి మనశ్శుధ్ధిని కలిగించటం కొఱకై ఉద్దేశించినదే.
ఏ స్తోత్రం చివరన ఐనా దాన్ని చిత్తశుధ్ధితో పఠిస్తే కలిగే మహత్తరఫలితాలను ఏకరువు పెడతారు. లలితాసహస్రనామస్తోత్రంలో మీకు అది కనిపించదు కాని, దానికి పూర్వం వచ్చిన అధ్యాయంలో అలాంటి ఫలితవివరణ సవిస్త్రరంగా ఉంది. విష్ణుపురాణం నారాయణపారమ్యాన్నీ, శివపురాణం శివపారమ్యాన్నీ, దేవీపురాణం అమ్మవారి పారమ్యాన్నీ ఉగ్గడిస్తాయి. గందరగోళం అనిపించవచ్చును కానీ అన్నీ నిజమే. ఎందుకంటే ఉన్నది ఒక్క పరతత్త్వమే. విష్ణుసహస్రనామ భాష్యంలో శ్రీశంకరులు ఒక మహేశ్వరవచనం ఒకటి ఉద్దరించి చెబుతారు. ఆయనే నారాయణుడు, శివుడు, బ్రహ్మ కూడ అని. విష్ణుసహస్రంలోని నామాలలో శివపరంగా అన్వయం కానిది ఏదీ ఉండదు అలాగే శివనామాలూ విష్ణుపరమైనవే అన్నీ అని. అంటే ఎలా మన మనస్సుకు అవి హత్తుకుంటాయే అలాంటి శాస్త్రస్తోత్రాదులను సేవించి మనం మనశ్శుధ్ధిని పొందగలగటమే లక్ష్యం వాటికి అని అర్ధం చేసుకోవాలి.
అందుచేత మన మనస్సు భగవత్తత్త్వాన్ని లక్ష్యంచేసుకొని ఉన్నపక్షంలో లౌకికమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నందువలన వచ్చే విరామాల కారణంగా ఏంఈ దోషాలు రావు. కాని మనస్సు భగవంతుని పైన లేకుండా మొక్కుబడిగా చేసే స్తోత్రపారాయణాలూ, పూజలూ వగైరాలు కేవలం నిష్ఫలం అని గ్రహించాలి మనం.
అందరికీ తెలిసినదే ఐన మహాభారతంలోని ఒక కథలో ఒక పతివ్రత, పతిసేవలో నిమగ్నం అయియున్న కారణంగా అతిథిపూజ అనగా భిక్షకోసం వచ్చిన మునికి భిక్ష ఇవ్వటానికి ఆలస్యం చేస్తుంది. అందువలన ఆవిడ మాహాత్మ్యానికి లోపం ఏమీ రాలేదు. పైగా కోపించిన మునికి తాను చేసినది సరైన పనే అనీ అతడే వృధ్ధపితరులను విడచి వచ్చి తప్పుచేసాడనీ ఆక్షేపిస్తుంది. దీనిని బట్టి స్వధర్మనిర్వహణలో ఉన్నపక్షంలో భగవత్తత్త్వం పట్ల నిరతి ఉన్నవారు మఠం వేసుకొని కూర్చుని పూజలూ పారాయణాలూ చేయకపోయినా వారికి నిష్ఠాలోపం ఏమీ రాదు.
మీరు వీలైనంత శ్రధ్ధగా చేయండి. అనుగ్రహం కలుగుతుంది తప్పక.
టిబెట్టుకు చెందిన 15వ శతాబ్దపు ఉత్తరార్ధానికి చెందిన ఒక సిధ్ధుడు 'Books are useful until you find the way' అన్నాడు. మార్గదర్శనం కోసమే సమస్త వాంగ్మయమూ. చిత్తశుధ్ధితో సాధన చేస్తున్నప్పుడు ఆటంకాలూ సాధనాక్రమంలో భాగమే అని గుర్తించండి. సాధన పరిపక్వం ఐన స్థితిలో ప్రయత్నపూర్వకంగా ఏదీ చేయనవసరం ఉండదు. అప్పుడు పుస్తకాలూ లేవు పారాయణాలూ లేవు. నిత్యం మనస్సు పరబ్రహ్మానుసంధానం కలిగి ఉంటుంది. ఆస్థితిలో ప్రయత్నపూర్వకంగా ఏమన్నా పూజాపారాయణాదులు చేయటమూ వారికి విఘ్నంగానే ఉంటుంది. ఐనా అట్టిస్థితి ఒక పట్టాన దొరుకదు కానీ ఆశించటంలో తప్పులేదు.
తొలగించండిమీ blog ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. కానీ నాకే బాధ్యతలతో ఒక్క సారైనా చదవ వీలు కలగనందుకు బాధ గా ఉంది. నేను మొదట్లో చదివేటప్పుడు ఎన్నో తప్పులు దొర్లేవి.. ఇలా ఎవరైనా చెప్పినా బాగుణ్ణు అనుకునే దానిని. చాలా ఆలస్యం గా మీ blog చూసేను. అదే బాధ.
రిప్లయితొలగించండిమీ blog ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. కానీ నాకే బాధ్యతలతో ఒక్క సారైనా చదవ వీలు కలగనందుకు బాధ గా ఉంది. నేను మొదట్లో చదివేటప్పుడు ఎన్నో తప్పులు దొర్లేవి.. ఇలా ఎవరైనా చెప్పినా బాగుణ్ణు అనుకునే దానిని. చాలా ఆలస్యం గా మీ blog చూసేను. అదే బాధ.
రిప్లయితొలగించండిఏదైతేనేమి గురువుగారు.. ఆ తల్లి అనుగ్రహం తో మీరు మా అందరికీ (నా లాంటి వాళ్లందరికీ) గా విభజన చేశారు. అది చాలు మాకు. నేను చదవడం మాత్రమే ఇంకా కుదరలేదు.
రిప్లయితొలగించండిగురువు గారు మీరు నా సందేహానికి సమాధానం ఇంకా ఇవ్వలేదు.. నా సందేహా నివృత్తి చెయ్య దలచినది అని మనవి చేసుకుంటున్నాను
రిప్లయితొలగించండికొద్ది నిముషాలు వేచియుండ మనవి.
తొలగించండిగురువు గారు, ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని నాకు నేను అడిగిన దానికి జవాబు చెప్పి. నా మనసుని ఎంతో తృప్తి పరిచారు. నిజం గా మీకు పాదభివందనాలు.
రిప్లయితొలగించండినాకోసం ఆ తల్లే మీ చేత చెప్పించిందేమో అన్నంత సమ్పతృప్తిని కలిగించేరు. నిజం గా మీకు ధన్యవాదాలు.
అందరూ ఆ తల్లి యొక్క మహత్యం చెప్పగా నాకు ఆవిడ మీద భక్తి కంటే ఇష్టమే ఎక్కువ ఏర్పడింది. అలా అని భక్తి లేదా అంటే లేదని కాదు ఇష్టమే ఎక్కువ.
ధన్యవాదాలు గురువుగారు.
అమ్మా, మీకు సమాధానం లభించినందుకు సంతోషం. నారదమహర్షి భగవంతునిపై పరమప్రేమయే పరాభక్తి అని సూత్రీకరించారు. మీరు దానినే ఇష్టం అన్నారు. ఆ యిష్టమే ముఖ్యం. అది వాచ్యంగా ఉండనవసరం లేదు. గుండెల్లో ఉండే నిత్యం భ్గగవంతునికి అనుకూలంగా వర్తించేటట్లు చేస్తుంది. అంతకంటే కావలసినది లేదు. శ్రీశంకరులు శివానందలహరిలో భక్తిలక్షణాన్ని నిర్వచిస్తూ
తొలగించండిఅంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా
సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్
చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే
ఇందులో ఏవిధంగా ఇనుపసూది అయస్కాంతం వల్ల ఆకర్షితం ఐ ఉంటుందో ఇత్యాదులు చెబుతూ సాద్వీమణీ యొక్క చిత్తవృత్తి నిత్యము నిజపతియందు అనురక్తితో ఉంటుందో అటువంటిదే భక్తి అని చెప్పారు కదా. అంటే భక్తి అన్నది అపరిమితమైన ఇష్టం అని చెబుతున్నారన్నమాట. మీకు భగవత్తత్త్వం పట్ల నిశ్చలమైన ఇష్టం కలిగి ఉండటం చాలా అభినందనీయం.
Guruvu Garu nenoka student Ni.Hostel lo untanu entiki vachinapaudu Lalitha Sahasranamam parayana start chesanu.anganyasa karbhyasalu chadvaakudadh ani.naku Lalitha Sahasranamam nerpinchina guruvu Garu chepparu.sare kada start chesanu 21 days ayye sariki nenu padukuntunna roomlo sudden ga fire accident ayindi.naku oka China injury kuda avvaledu.ma vallu nannu thittadam start chesaru.nenenyteaa Talli daya Valle Ami jaragakunda bayata padda anukunnanu.parayana chesetappudu Adhi kuda adyna korukoni parayana chesetappudu anganyasa karbhyasalu chadvaala.chadavkudada.mire cheppandi .
రిప్లయితొలగించండిపై అజ్ఞాత గారి వ్యాఖ్య తెలుగు లిపిలో ఇలా ఉంది:
తొలగించండిగురువు గారు నెనొక studentని. Hostelలో ఉంటాను. ఇంటికి వచ్చినప్పుడు లలితా సహస్రనామం పారాయణ start చేసాను.అంగన్యాస కరన్యాసాలు చదవకూదదు అని నాకు లలితా సహస్రనామం నేర్పించిన గురువు గారు చెప్పారు. సరే కదా start చేసాను 21 days అయ్యే సరికి నేను పడుకుంటున్న రూంలో suddenగా fire accident అయింది. నాకు ఒక చిన్న injury కూడా అవలేదు. మా వాళ్ళు నన్ను తిట్టడం start చేసారు. నేనైతే తల్లి దయ వల్లే ఏమీ జరగకుండా బయటపడ్డా అనుకున్నాను. పారాయణ చేసేటప్పుడు, అది కూడా ఏదైనా కోరుకొని పారాయణ చేసేటప్పుడు, అంగన్యాస కరన్యాసాలు చదవాలా? చదవకూడదా? మీరే చెప్పండి.
Na name Divya Anusha Andi.asalu uhinchaledu miru Ela spandistarani.bloglo Ela msg pettadam ede modati sari.Naku entlo sambandam chuse mundu ammavari anugraham untundi ani ma entlo oka Rajarajeshwari Devi peetamlo Naku Lalitha Sahasranamam nerpincharu.nerchukune roju poojari Garu theerdam estundaga ammavari nundi oka flower padindi.ma guruvu Garu Syamalamba garu.aavida ammavari anugraham undi anduke ala padindi annaru.chala santhoshinchanu.Ante Brahmins matrame Anganyasa karbhyasalu chadavali ani chepparu.memu brahBrah kadu.kani monna oka upanyasamlo vinnanu.adyna korikato Lalitha Sahasranamam ayina,vishn V Sahasranamam ayina sare parayana cheyalante water chettho pattukoni anganysa karbhyasalu cheyali ani.ela chadavala koncham cheppandi guruvu Garu
తొలగించండిపై అజ్ఞాత గారి వ్యాఖ్య తెలుగులో:
తొలగించండినా name దివ్య అనూష అండి. అసలు ఉహించలెదు మీరు ఇలా స్పందిస్తారని. బ్లాగ్లో ఇలా msg పెట్టడం ఇదే మొదటి సారి. నాకు ఇంట్లో సంబంధం చూసే ముందు, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని మా ఇంట్లో, ఒక రాజరాజెస్వరి దేవి పీఠంలో నాకు లలితా సహస్రనామం నేర్పించారు. నేర్చుకునె రోజు, పూజారి గారు తీర్ధం ఇస్తుండగా, అమ్మవారి నుండి ఒక flower పడింది. మా గురువు గారు శ్యామలాంబ గారు. ఆవిడ అమ్మవారి అనుగ్రహం ఉంది అందుకే అలా పడింది అన్నారు. చాలా సంతోషించాను. ఐతే, బ్రాహ్మిన్స్ మాత్రమే అంగన్యాస కరన్యాసాలు చదవాలి అని చెప్పారు. మేము బ్రాహ్మిన్స్ కాదు. కాని మొన్న ఒక ఉపన్యాసంలో విన్నాను; ఏదైనా కోరికతో లలితా సహస్రనామం ఐనా, విష్ణు సహస్రనామం ఐనా సరే, పారాయణ చేయలంటే water చేత్తో పట్టుకొని అంగన్యా కరన్యాసాలు చెయ్యాలి అని. ఎలా చదవాలో కొంచం చెప్పండి గురువు గారు.
దివ్య అనూష గారు, ఈ విషయంపై అంగన్యాస కరన్యాసాలతోనే సహస్రనామస్తోత్రం చదవాలా? అన్న టపా వచ్చింది. చదువ కోరుతాను.
తొలగించండిదివ్య అనూష గారు, మీరు తెలుగులో వ్రాయటానికి ప్రయత్నించండి. మీకు లేఖిని అనే సైట్ సహాయపడుతుంది. దాని చిరునామా https://lekhini.org/ . తప్పక ప్రయత్నించండి.
తొలగించండిNamaskaaram Shyamaleeyam gaaru
రిప్లయితొలగించండిim looking for particular naamaarthaalu for Sri Lalitha Sahasram, someone shared few namaas but could not share all, can you please help me find the source andi. You mentioned about Sri Simhambhatla gaari vyaakhyaanam I couldnt find it on the web
can I have your email please so I can send the pictures of the vyakhyaanam of few namaas. I searched the web but could not find the source may be you can help me thank you sir
శ్రీమాత్రే నమః
రిప్లయితొలగించండి🙏🙏🙏🙏🙏
నమస్తే. మీ వద్ద తెలుగు లో లలితా సహస్ర నామావళి (ఒక్కొక్క నామం విడివిడిగా)pdf ఉంటె అందించగలరా ప్లీజ్ ! emailsujata@yahoo.com
రిప్లయితొలగించండిఈటపాలో నామాలన్నీ విడివిడిగా వచ్చేలాగు చూపాను కదండీ.
తొలగించండిచతుఃషష్టికలామయీ .. సరిదిద్దాల్సి వుందేమో.. చూడగలరు
రిప్లయితొలగించండిఈపాఠంగా కొన్నిచోట్ల ఉంది. కాని సరిదిద్దటమే మంచిది. సరిచేసానండీ.ధన్యవాదాలు
తొలగించండి