18, అక్టోబర్ 2013, శుక్రవారం

రామ జగదభిరామ
  

రామ జగదభిరామ రవికులసోమ దాశరథీ
నా మనవి విని నా మనమునను స్వామి నిలువు మయామేర యెరుగని తీరుగను దయ  వారిజ నయన
కోరకనె తనివార గురిసెడు వారిధరమవుగ  
॥రామ॥


కామితములని  యేమి యడిగితి కోమలహృదయ
రామ యలిగితి  వేమి పెడమొగ మై మసలెదవు
॥రామ॥


నాదు దొసగుల  కేది పరిమితి  వాదన గలదె
మోద మలరగ చేదు కొను మిక వేదనలుడుగ
॥రామ॥