10, అక్టోబర్ 2013, గురువారం

ఆర్తి తీర్చవమ్మా


  

ఆర్తి తీర్చవమ్మ అరుణమ్మా నీ
కీర్తి కూడ పెరిగేనోయమ్మాలెక్కకు మిక్కిలి లోకము లేలెడు
ముక్కంటి తనువున మురిసే తల్లీ
చక్కని తల్లీ చల్లని తల్లీ
తక్కువ లేని దయచూప వమ్మా
॥ఆర్తి ॥


పున్నమ చంద్రుని పోలెడు మోమున
సన్నని నగవుల వెన్నెల లొలయగ
అన్ని జగంబుల అతిదయ నేలుచు
మన్నించెదవే మా తల్లీ ఇక
॥ఆర్తి ॥


మంచుకొండకు మంచి కూతురవు
మంచివారకి మంచి తల్లివిగ
అంచితమగు నీ అభిమానము నా
కించుక దయతో నీ యవె తల్లీ 
॥ఆర్తి ॥