7, అక్టోబర్ 2013, సోమవారం

కలుషవిదారిణి నారాయణీ
కలుషవిదారిణి నారాయణీ నను
కరుణించితివా నారాయణీ

బాలా లీలావినోదినీ పరిపాలితకింకరి నారాయణీ
లీలాపాంగాకృతభువనాళీ కాలస్వరూపిణి నారాయణీ ॥కలుషవిదారిణి॥

సర్వాంతర్యామిని బ్రహ్మజ్ఞానప్రదాయిని నారాయణీ
గర్వితభండాద్యసురవినాశిని కాలస్వరూపిణి నారాయణీ  ॥కలుషవిదారిణి॥

బంధురాలకా నిగమవినోదిని పావనమూర్తీ నారాయణీ
గంధసింధురగమనా గౌరీ కాలస్వరూపిణి నారాయణీ   ॥కలుషవిదారిణి॥

సమయాచారప్రమోదిని రాకాచంద్రనిభానన నారాయణీ
విమలా వంద్యా వింధ్యవాసినీ విజయస్వరూపిణి నారాయణీ   ॥కలుషవిదారిణి॥