కృతేన సా నిసర్గతో
ద్రుతేన నిత్య మాననే
సితేన శీత శైలజా
స్మితేన శం తనోతు మే
ప్రతి క్షణం వినశ్వర
నయే విసృజ్య గోచరాన్
సమర్చ యేశ్వరీం మనో
వివిచ్య విశ్వ శాయినం
విశుద్ద దర్పనేన వా
విదారితే హృదాంబ మే
అయి ప్రయచ్చ సన్నిధిం
నిజే వాపు ష్యగాత్మజే
పురస్య మధ్య మాశ్రితం
సితం య దస్తి పంకజం
అజాండ మూల మస్తుతే
సురార్చితే తవాసనం
ఆఖండ ధారయా ద్రవన్
నవేందు శేఖర ప్రియే
మదీయ భక్తి జీవనం
దదాతు తేంబ పాద్యతాం
వివాస నౌఘ మానస
ప్రసాద తోయ మంబ మే
సమస్త రాజ్ఞి హస్తయో
రనర్ఘ మర్ఘ్య మస్తుతే
మహేంద్ర యోని చింతనా
ద్భవన్ భవస్య వల్లభే
మహారసో రసస్త్వయా
నిపీయతాం విశుద్ధయే
సహస్ర పాత్ర పంకజ
ద్రవ త్సుదా జలేన సా
సహస్ర పత్ర లోచనా
పినాకినో భిషిచ్యతే
మమార్జితం య దిన్ద్రియై
స్సుఖం సుగాత్రి పంచభిః
తదంబ తుభ్య మర్పితం
సుదాఖ్య పంచాకాయతమ్
వసిష్ట గోత్ర జన్మనా
ద్విజేన నిర్మితం శివే
ఇదం శరీర మేవ మే
తవాస్తు దివ్య మంశుకం
విచిత్ర సూక్ష్మ తంతు భ్రు
న్మమేయ మాత్మ నాడికా
సుఖ ప్రబోధ విగ్రహే
మఖోప వీత మస్తుతే
మహాద్విచిన్వతో మమ
స్వకీయ తత్వ విత్తిజం
ఇదం తు చిత్తసౌరభం
శివే తవాస్తు చందనం
మహేశ నారి !నిస్శ్వసన్
తధాయ ముచ్చ్వసన్ సదా
తవానిశం సమర్చకో
మమాస్తుజీవ మారుతః
విపాక కాల పావక
ప్రదీప్త పుణ్య గుగ్గులుః
సువాసనాఖ్య ధూప భ్రు
ద్భవ త్వయం మమాంబ తే
గుహావ తార మౌనినా
మయీశ్వరీ ప్రదీపితా
ఇయం ప్రబోధ దీపికా
ప్రమోద దాయికా స్తుతే
ఇమామయి ప్రియా త్ప్రియాం
మహా రసా మహాం కృతిం
నివేద యామి భుజ్యతా
మియం త్వయా నిరామయే
సరస్వతీ సుదాయతే
మనో దదాతి పూగతాం
హృదేవ పత్ర మంబికే
త్రయం సమేత్యతే ర్ప్యతే
వినీల తోయ దాంతరే
విరాజ మాన విగ్రహా
నిజా విభూతి రస్తుతే
తటిల్లతా ప్రకాశికా
స్వరోయ మంత రంబికే
ద్విరేఫ వత్స్వరన్ సదా
మమాభి మంత్ర్య దీసుమం
దదాతి దేవి తేన్ఘ్రయే
తవార్చనం నిరంతరం
యతో విధాతు మస్మ్యహం
న విశ్వనాధ పత్నితే
విసర్జనం విధీయతే
వియోగ మిందు దారిణా
న చేహ విశ్వ నాయకే
మదంబ సోత్ర రాజతే
తటిల్లతా శిఖాంతరే
అయం తవాగ్రిమః సుతః
శ్రితో మనుష్య విగ్రహం
తనూజ వేశ్మ సౌష్టవం
మృడాని !పశ్య కీద్రుశం
గణేశితు ర్మహాకవే
రసౌ ప్రమాణికావలీ
మనోంబుజే మహేశ్వరీ
ప్రపూజ నేషు శబ్ద్యతాం
అమ్మవారు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్మవారు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
15, ఆగస్టు 2020, శనివారం
కావ్యకంఠ గణపతిముని అధ్యాత్మికపూజా స్తోత్రం
3, నవంబర్ 2014, సోమవారం
సౌందర్యలహరి - 23 త్వయా హృత్వా వామం ...
మొదటి శ్లోకం | వెనుకటి భాగం | తదుపరి శ్లోకం |
23
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృత మభూత్
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటమ్
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృత మభూత్
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటమ్
లోకంలో శివసాయుజ్యం అన్న మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది.
ఈ శ్లోకంలో శ్రీశంకరులు శ్రీదేవీసాయుజ్యం అంతకంటే గొప్పదీ అని చెబుతున్నారు!
అమ్మవారు శివుడిలో అర్థభాగం అన్న సంగతి తెలిసిందే. అందుకే శివుడిని అర్థనారీశ్వరుడు అని కూడా అంటాం .
ఈ సంగతిని ఆచార్యులు కొంచెం గడుసుగా ప్రస్తావిస్తున్నారు త్వయా హృత్వా
వామం అని అంటూ. త్వయా అంటే నీ చేత హృత్వా అనగా సంగ్రహించబడినదమ్మా వామం అంటే శివుని ఎడమవైపు అర్థశరీరం అని చెబుతున్నారు.
అందులో ఏమి విశేషం ఉందీ అనవచ్చును. అక్కడి నుండే మొదలవుతున్నది అచార్యులవారి గడుసుదనం. చూడండి.
అలా అయ్యవారి ఎడమవైపు అర్థశరీరభాగాన్ని ఆక్రమించుకున్న అమ్మకు తృప్తి
కలగలేదుట. అందుకే ఆవిడను ఈ శ్లోకంలో అపరితృప్తేన మనసా
అన్నారు.అసంతృప్తిగానే ఉందిట ఆవిడ మనస్సుకు. అందుకని ఆవిడ ఒక పని చేసిందీ
అని శంకరులకు ఒక అనుమానం వచ్చిందట, ఏమిటండీ ఆపని అంటే చెబుతున్నారు.
శంభోః అపరమ్ అపి శరీరార్థం హృతమ్ అభూత్ శంకే అంటున్నారు చూడండి. అంటే
శంభుని యొక్క అపరం అంటే మిగిలిన రెండవవైపు శరీరార్థం అనగా అర్థశరీరాన్ని
కూడా హృతం అభూత్ అనగా అపహరించబడి ఉంది అని శంక కలిగిందీ అంటున్నారు!
అంటే అమ్మకు అయ్యవారి ఎడమశరీరాన్ని స్వంతం చేసుకున్నా తృప్తి కలగక ఆయన
కుడివైపు శరీరాన్ని కూడా స్వంతం చేసుకుందీ అన్న అనుమానం వస్తోందీ
అంటున్నారు ఆచార్యులవారు.
అలా ఎందు కనుకుంటున్నారూ అని మనకు సందేహం వస్తుంది కదా! దానికి వివరణ
ఇస్తున్నారు. యత్ అంటే, ఎందుకనగా అని మొదలు పెడుతున్నారు వివరణను.
ఏతత్ రూపం సకలం అరుణాభం అనగా అమ్మా ఏ రూపమైతే నాకు మనస్సులో గోచరం అవుతోందో అది అంతా అరుణంగా అంటే ఎఱ్ఱగా ఉంది.
సరే నీ రూపం ఎఱ్ఱగా ఉంటుంది, నాకు తెలుసును. అరుణాం కరుణాతరంగితాక్షీం అని నుతిస్తూ ఉంటాను కదా.
కానీ నాకు నీ రూపం త్రినయనమ్ అన్నట్లు అంటే మూడు కళ్ళతో ఉన్నట్లు
కనిపిస్తోంది! మరి మూడుకళ్ళవాడు శివయ్య కదా? సరే మీ ఇద్దరికీ కలిపి
అర్థనారీశ్వర రూపం అనుకుందాం.
మరి అమ్మా, కుచాభ్యామ్ ఆనమ్రమ్ అన్నట్లు కూడా నీ రూపం కనిపిస్తోందే.
అంటే నీ రూపం కుచములు రెండింటి బరువుతోనూ కొద్దిగా ముందుకు వంగినట్లు ఉంది.
మరి అర్థనారీశ్వర రూపంలో అలా ఎలా కనబడుతుందీ?
అదీ కాక, నాకు నీరూపం కుటిలశశి చూడాల మకుటమ్ అన్నట్లుగా కూడా కనబడుతోంది. కుటిలశశి
అంటే చంద్రవంక. చూడాలము అంటే శిరస్సు. మకుటం అంటే తెలిసినదే కిరీటం అని.
అంటే అమ్మా, నీ శిరస్సున చంద్రవంక అనేది కిరీటంలా ప్రకాశిస్తూ కనబడుతున్నది
అని అంటున్నారు. మరి చంద్రవంక ఉన్నవాడు శివుడు కదా.
నాకు నీ రూపం సకలం అరుణాభం అంటే అంతా ఎఱ్ఱగా కనిపిస్తోంది, అర్థనారీశ్వర
రూపం అనుకుందామంటే శివుడు తెలుపు గదా. పార్వతీ పతి తెల్పు పాలసంద్రము
తెల్పు అని అంటారు. శివుడి భాగం తెల్లగానూ నీ భాగం మాత్రమే ఎఱ్ఱగానూ
కనబడాలి కదా అలాగైతే.
అంతా ఎఱుపేను. నీ స్వనద్వయమూ కలిగిఉంది రూపం. శివుడి చంద్రవంకా మూడు కళ్ళు ఉన్నా కూడా మొత్తంగా ఎఱుప్పుతప్ప తెలుపు కనరాదు సుమా.
అందు చేత ఆ శివభాగమైన కుడి అర్థభాగాన్నీ కూడా అమ్మా నీవే ఆక్రమించుకున్నావన్న అనుమానం కలుగుతోంది.
ఇదీ శ్రీశంకరులు అమ్మను దర్శించిన విధం ఈ శ్లోకంలో.
కొన్ని కౌల సిధ్ధాంతాలలో అంతా శక్తితత్త్వమే. శివతత్త్వం అందులో అంతర్భూతం. అంతే కాని, విడిగా శివతత్త్వాన్ని చెప్పకూడదు.
ఆమ్మ యొక్క అరుణిమ ఆవిడ దివ్యశక్తికి ప్రతీక. కిరీటం సర్వసృష్టికీ ఆమె
సామ్రాజ్ఞిత్వానికి ప్రతీక. శిరస్సున చంద్రవంక ఆమె ఆనందస్వరూప మరియు అమృతస్వరూప
అన్నదానికి సంకేతం. త్రినేత్రాలూ త్రికాలాలకు ప్రతీకలు. స్తనమండలప్రశస్తి సకలజీవులకు ఆమెయే పోషకురాలన్న భావనకు ప్రతీక. సమిష్టిగా
శ్రీమాత విరాడ్రూపం ఇక్కడ చెప్పబడింది.
ప్రతిదినమూ మూడువేల సార్లు చొప్పున మప్పది రోజులు పారాయణం. నైవేద్యం
క్ష్రీరాన్నం. ఫలం అపదలనుండి నివృత్తి. ముముక్షువులకు జ్ఞానప్రాప్తి.
29, అక్టోబర్ 2014, బుధవారం
సౌందర్యలహరి - 22 భవాని త్వం ....
మొదటి శ్లోకం | వెనుకటి భాగం | తదుపరి శ్లోకం |
22
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంచన్ కథయతి భవాని త్వమితి యః
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుందబ్రహ్మేంద్రస్ఫుటముకుటనీరాజితపదామ్
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుందబ్రహ్మేంద్రస్ఫుటముకుటనీరాజితపదామ్
ఈ శ్లోకంలో శ్రీశంకరులు అమ్మను స్మరించటం అనేది ఎంత మహత్తరమైన ఫలితాన్నిస్తుందో తెలియ జేస్తున్నారు.
యః అంటే ఏ భక్తుడైతే భవాని త్వం దాసే, మయి సకరుణా దృష్టిం వితర అని అనగా అమ్మా భవానీ త్వం అనగా నీకు దాసే అనగా దాసుడను ఐన మయి అంటే నాయందు సకరుణా అనగా కరుణ కలిగి దృష్టిం అనగా కనుచూపును వితర అంటే ఇవ్వమ్మా అని ఇతి స్తోతుం వాంఛతి ఈ విధంగా ప్రార్థించాలని కోరుకుంటూన్నాడో అని అటువంటి వాడికి అమ్మ అనుగ్రహం ఎంత విశేషంగా లభిస్తోందో చెనబుతున్నారు.
ఇలా ఒక భక్తుడు అమ్మను ఉద్దేశించి ప్రార్థించటానికి పూనుకున్నాడు. కథయతి భవాని త్వం ఇతి అంటే భవానీ నీవు అని ఇలా తస్న్మై తదైవ అంటే ఆ మాటను అలా పలకటం మొదలు పెట్టగానే గొప్ప భాగ్యాన్ని ప్రసాదిస్తున్నావు అంటున్నారు. అది ఎటువంటి భాగ్యమో చూడండి శ్రీశంకరులు చెబుతున్నారు.
అమ్మ పాదాలు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజితములు. అంటే అమ్మ పాదాలకు నిత్యం విష్ణువూ, బ్రహ్మ గారూ, ఇంద్రుడూ నమస్కారాలు చేస్తూ ఉంటే వారి స్ఫుట ముకుటములు అంటే వారి నెత్తిన ఉన్న మణి ప్రభలతో వెలిగిపోయే కిరీటాలు కూడా అమ్మ పాదాలకు మణిహారతులు ఇస్తూ ఉంటాయి అని శ్రీ శంకరులు చెబుతున్నారు.
అటువంటి వైభవం కలిగిన అమ్మ పాదాల నిజ సాయుజ్య పదవీం అనగా తన యొక్క పాదాల సాయుజ్యాన్ని ఆ భక్తుడికి దిశతి అనగా అనుగ్రహిస్తున్నదట.
ఇక్కడ ఒక చమత్కారం గమనించండి నిత్యం నమస్కారాదులు చేస్తూ స్తోత్రపాఠాలు చేస్తున్నా బ్రహ్మాదులకు అమ్మ సాయుజ్యం ఇవ్వనే లేదు. కాని అమ్మా నువ్వు అంటూ ఒక భక్తుడు స్తోత్రం చేయబోగానే అతడికి ఏకంగా సాయుజ్యం అనుగ్రహించింది. అదీ అమ్మ యొక్క కరుణావిశేషం.
మరొక ముఖ్యమైన సంగతిని కూడా ఇక్కడ శ్రీశంకరులు తెలియజేసారు. భవాని త్వం అనగానే అమ్మ వేంఠనే సాయుజ్యం ఇచేస్తోంది అని. ఎందుకంటే ఇక్కద భవానిత్త్వం అన్నదానిలో శ్రీశంకరులు తత్త్వమసి అనే మహావాక్యం స్ఫురిస్తోంది అని చెబుతున్నారు. ఈ "తత్త్వం అసి" , " అనే మహా వ్యాక్యం యొక్క్ అర్థం నేను నీవే అవుచున్నాను అని అనటం. కాబట్టి భక్తుల కోరిక తీర్చే కరుణామూర్తి ఐన అమ్మ అలాగే నాయనా అని వెంటనే తనతో ఏకత్వాన్ని అనుగ్రహించేస్తోందిట, భక్తుడి ఇలా స్తోత్రం చేయాలని మొదలు పెట్టగనే,
ముక్తి ప్రథానంగా నాలుగు రకాలు, సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని. వీనిలో ఒకదానికంటే దానితరువాతది ఉత్తమం అన్నమాట. సాలోక్యం అంటే భగవంతుడు ఉండే లోకం చేరుకోవటం. సామీప్యం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి సేవచేయగలగటం, సారూప్యం అంటే ఇష్టదైవం రూపాన్ని పొందటం. సాయుజ్యం అంటే ఏకంగా ఇష్టదైవంలో లీనం ఐపోవటం. ద్వైతులకు ఇష్టమైనది సామీప్య ముక్తి. విశిష్టాద్వైతులకు ప్రీతికరమైనది సారూప్య ముక్తి, అద్వైతులకు సాయుజ్యమే కోరిక.
భాగవతపురాణంలో కూడా అజామీళుడు కేవలం నారాయణా అని నామస్మరణం చేసినంత మాత్రానే ఆయన ముక్తిని అనుగ్రహించాడని కథనం ఉంది కదా. ఇంతకూ అజామీళుడు పిలచినది శ్రీమన్నారాయణమూర్తిని కాక కేవలం తన కుమారుణ్ణే. ఐనా సరే ఆ నామస్మరణమే అతడికి ముక్తిని ఇవ్వగలగింది. కలౌ స్మరణా న్ముక్తిః అని సూక్తి.
ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున నలభైఐదు రోజులు పారాయణం. నైవేద్యం తేనె, పాలు, త్రిమధురం, పాయసం. ఫలం ఇహలోకవాంఛాపరులకు సర్వవైభవాలతో జీవితం, ముముక్షువులకు అమ్మ అనుగ్రహంతో సాయుజ్యం.
25, అక్టోబర్ 2014, శనివారం
సౌందర్యలహరి - 21 తటిల్లేఖాతన్వీం.. (కొనసాగింపు)
మొదటి శ్లోకం | వెనుకటి భాగం | తదుపరి శ్లోకం |
ఈ తటిల్లేఖా తన్వీం... అనే శ్లోకంలో ఇంతవరకు మనం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ అన్న ప్రస్తావనను గూర్చి చర్చించుకున్నాం. ఆరు కమలాలకు పైనున్న దిగా వర్ణించారు కాబట్టి అది సహస్రారకమలం అన్న భావంలో తీసుకున్నాం.
ఆచార్యులవారు కూడా ఇది సహస్రారం అన్న విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగానే చెబుతున్నారు. మహాపద్మాటవ్యాం నిషణ్ణాం అని అక్కడ ఉన్నది అమ్మ అని. మహాపద్మం అనే అడవి. వేయి రేకుల పద్మం అనే అర్థంలోనే అచార్యులవారు ఇక్కడ సహస్రారం గురించి చీబుతున్నట్లుగా స్పష్టంగానే ఉందిగా. మనం ముందు చెప్పుకున్న సహస్రారపద్మంలోని చంద్రమండలస్థానం ఈ పద్మం యొక్క కర్ణిక అంటే మధ్యన ఉండే భాగం. అక్కడ ఆసీనురాలై ఉంటుంది భగవతి అని చెబుతున్నారు.
ఈ సహస్రారపద్మకర్ణికాంతర్గత చంద్రమండలంలో ఉండే సదాఖ్య అనబడే అమ్మయొక్క దివ్యమైన కళ ఎలాటిదంటే, అది తటిల్లేఖా తన్వీం అని చెప్పారు శ్రీశంకరులు. తటిత్ అంటె మెఱుపు. తట్టిల్లేఖ అంటే మెఱుపు తీగె. అటువంటి తనువు అనకా ఆకారం కలది అట. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి, మొదటిది మెఱుపుతీగలాగా అత్యంత దీర్ఘంగా సన్నగా ఉంటుందనేది. కాగా, రెండవది, మెఱుపు తీగ లాగా కేవలం క్షణకాల్తం మాత్రమే దర్శనభాగ్యం అనుగ్రహించేది అని.
ఈ మెఱుపుతీగ వెలే తృటికాలం దర్శనం ఇచ్చే అమ్మ తపనశశివైశ్వానర మయి అట. తపనుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. వైశ్వానరుడు అంటే అగ్ని. ఈ మూడు తేజస్సులూ కలగలసిన ప్రకాశం అని చెబుతున్నారు. ఇంతకు ముందే చక్రాలను గురించి వివరించుకున్న సందర్భంలో సూర్యచంద్ర అగ్ని ఖండాల ప్రసక్తి వచ్చినప్పుడు షట్చక్రాలనూ ఈ మూడు ఖండాలుగా విడమరచి తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం అన్వయించుకోవలసిన సంగతి ఏమిటి? అమ్మ ఇక్కడ ఆరుచక్రాలయొక్క తత్త్వాలనూ తానే కలిగి, వాటిని అధిగమించి ఏడవదైన సహస్రారంలోని చంద్రమండలంలో ఉన్నది అని.
ఆ భగవతి యొక్క దర్శనం ఎటువంటి వారికి మాత్రమే దొరకగలదో చెప్పటానికి ఆచార్యులవారు మహాంతః పశ్యంతః మృదితమలమాయేన మనసాః అన్నారు. ఇక్కడ మలములు అనగా కామము, క్రోధము,లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలూ, మాయ అని చెప్పబడినవి అస్మితా, అహంకారము, అవిద్యా అనేవి. వీటిని మృదితము చెసినవారు అనగా తొలగించుకున్న మహాంతః అంటే మహాత్ములైన వారు మాత్రం మనసాః తమతమ అంతఃకరణములలో భగవతి దర్శనం పొందగలరని అంటున్నారు.
ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడి భగవతీ స్వరూపం అమృతాన్ని ఇస్తుందని. చంద్రమండలం అమృతస్థానం అని కూడా చెప్పుకున్నాం కదా. ఇలా అమృతధారలు కురిపించే అమ్మ యొక్క దివ్యప్రకాశాన్ని సర్వాత్మనా అన్ని వికారాలనూ జయించిన మహాత్ములే పొంది ఆనందిస్తున్నారని శ్రీశంకరులు చెబుతున్నారు.
అందుకనే అమ్మయొక్క దర్శనాన్ని పరమాహ్లాదలహరీమ్ అని స్పష్టికరిస్తున్నారు. ఇంతకంటే ఉన్నతమైన ఆనందం లేదు అని చెప్పదగినది ఈ దర్శనం ఇచ్చే ఆనందం. అమ్మదర్శనం క్షణకాలం కలుగవచ్చును. కాని అంతులేని ఆనందం యొక్క ప్రవాహం మాత్రం ఆ మహాత్ముల మనస్సులలో స్థిరంగా ఉంటుందని చెప్పటానికి మహాంతః పశ్యంతో దధతి అని అన్నారు. దధతి అనగా స్థిరంగా ధరించి ఉంటున్నారు అని అర్థం.
ఈ శ్లోకానికి రోజూ వేయి సార్లు చొప్పున నలభైఐదురోజులు పారాయణం. నైవేద్యం తేనె, బెల్లం, అరటిపండ్లు ఫలసిధ్ధి సకల జనామోదము, శత్రుబాధానివారణం.
24, అక్టోబర్ 2014, శుక్రవారం
సౌందర్యలహరి - 21 తటిల్లేఖాతన్వీం ...
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
21
తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీమ్
ఈ శ్లోకంలో శ్రీశంకరులుసూక్ష్మధ్యానం అనే ధ్యానవిశేషానికి సంబంధించిన ప్రక్రియను గురించి చెబుతున్నారు.
అమ్మా భగవతీ, షణ్ణాం అపి ఉపరి కమలానాం అంటే ఆరుచక్రాలకూ పైనున్న సహస్రారకమలంలో ఉన్నటువంటి తవ కలామ్ నీయొక్క సదా అనే పేరుకల కళను మహాంతః అనగా మహానుభావులైన యోగీశ్వరులు పశ్యంతః అంటే చూస్తున్నారూ అని చెబుతూ శ్రీశంకరులు ఆ సాదాఖ్య కళావైభవాన్ని మహిమనూ ప్రస్తుతి చేస్తున్నారు.
ఇక్కడ చెప్పబడిన ఆరు చక్రాలగురించి మనం ఇప్పటికే గడచిన శ్లోకాలలో తెలుసుకున్నాం కదా. అవి మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుధ్ధము, ఆజ్ఞ అనేవి అని. అంతేకాదు అవి మానవశరీరంలో ఉండే ప్రదేశాలను గురించి కూడా ఇప్పటికే ముచ్చటించుకున్నాం. అలాగే ఆ ఆరు చక్రాలకు పైన శిరస్సులో పైభాగాన సహస్రారం అని ఒక కమలం ఉంటుందని కూడా చదువుకున్నాం.
ఇక్కడ ఆచార్యులవారు అపి ఉపరి అని అనటంలో ఈ చక్రాలలో ప్రతి రెండు చక్రాలకూ పైన ఒక గ్రంథిచొప్పున ఉండే రుద్ర, విష్ణు, బ్రహ్మగ్రంథులనూ కూడా స్మరించినట్లుగా మనం భావించాలి. ఎందుకంటే సహస్రారం అన్నింటికంటే పైన ఉండేదే కదా.
ఇక్కడ చెప్పబడిన అమ్మ యొక్క కళను సదా అని ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఇప్పటికే చెప్పటం జరిగింది. సహస్రారకమలంలో చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడు నిత్యం పూర్ణచంద్రుడు. కళాతు షోడశోభాగః అని చెబుతారు. ఒక కళ అంటే ప్రకాశమానమైన వెలుగులో పదహారవవంతు అని. ఎందుకో మొదట చూదాం. మనకి తెలిసి తిథులు పదిహేను. శుక్లపక్షంలో చంద్రుడు ప్రతిపత్ అంటే పాడ్యమి నుండి పదిహేను రోజులు రోజున కోక కళగా పెరుగుతూ పౌర్ణమాసీ అనగా పున్నమి నాటికి పూర్ణచంద్రుడు అవుతాడు. దానికి విలోమంగా కృష్ణప్రతిపత్ నుండి పదిహేను రోజులపాటు రోజున కొక కళ తరుగుతూ అమావాస్య నాటికి అదృశ్యుడౌతాడు. ఇలా రెండుపక్షాల్లోనూ కూడా పదిహేను కళలు చొప్పున కనిపిస్తున్నాయి. అంటే చంద్రకళలు పదిహేను అన్నమాట. అటువం టప్పుడు కళలు పదహారు అన్న సిధ్ధాంతం ఎలా వచ్చింది?
సరే, అమావాస్య నాడు చంద్రుడు కనబడకుండా పోతున్నాడు. లేకుండా పోతున్నాడా? ఉండే ఉండాలి కదా? లేకుండా పోతే, లేని చంద్రుడికి వృధ్ధిని ఎలా చెప్పటం కుదురుతుంది నాటి నుండి? కాబట్టి చంద్రుడు అన్నవాడు ఉన్నాడు. కాని చాలా హీనంగా కనబడేందుకు వీలు లేనంత శోభారహితంగా ఉన్నాడు. అంతే. అందుచేత కళలు పదహారు అన్నారు. మిగిలిన పదిహేను కళలూ వస్తూ పోతూ ఉంటాయి. చంద్రుడు పౌర్ణమి నాడు షోడశకళాప్రపూర్ణుడు. ఆ చంద్రుడే, అమావాస్య నాడు ఆ కనబడని కళ మాత్రమే మిగిలినవాడు. ఈ పదహారవదీ, నిత్యమూ చంద్రునికి ఉన్నదీ ఐన కళనే సదా అని నిత్య అనీ అంటారు. దీనినే సంప్రదయంలో షోడశీ అనీ ధృవకళ అని కూడా అంటారు.
అమ్మ సహస్రారకమలంలో ఉన్న చంద్రమండలంలో ఉంటుంది. లలితాసహస్రనామాల్లో చంద్రమండల మధ్యగా అని ఒక నామం ఉంది. ఈ చంద్రుడు పదహారు కళలూ ఉన్న పూర్ణచంద్రుడు. ఈ చంద్రుని యొక్క షోడశీ లేదా సదా కళ సాక్షాత్తూ అమ్మవారి యొక్క స్వరూపమే.
శ్రీ చక్రంలో మధ్యన ఉండేది బిందువు. ఈ బిందువుకు సహస్రారకమలంలో ఉన్న ఈ చంద్రమండలంతో సమన్వయం. ఈ శ్లోకలంలో షణ్ణాం అని ఆరుచక్రాలనూ స్మరించటం జరిగింది కాబట్టి మరికొంత వివరంగా చూదాం. అజ్ఞా చక్రానికి శ్రీచక్రంలో బిందువు మీది త్రికోణంతో సమన్వయం. విశుధ్ధి చక్రమే అష్టకోణచక్రం. అనాహతచక్రమే అంతర్దశారం. మణిపూరకం బహిర్దశారం. స్వాధిష్ఠానం చతుర్దశారం. మూలాధారమే శ్రీచక్రం యొక్క భూపురం. ఇలా మూలాధారాది కమలాలను శ్రీచక్రంతో సమన్వయం చేయటానికే స్థూలచక్రమేళనం అని పేరు.
సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క విషయం గుర్తు చేయవలసి ఉంది. అగ్ని సూర్య చంద్రాది నామాలు అన్నీ ఈ శ్రీవిద్యలో సాంకేతికపదాలు. శ్రీవిద్యలో బ్రహ్మాండ, పిండాండ, శ్రీచక్రాలకు అబేధం. అందుచేత ఈ పదాలు ఒక్కొక్క సారి నిజమైన బహిఃప్రపంచపు అర్థాల్లో అంటే సూర్యచంద్రులు మనకు ఆకాశంలో కనిపించే వారే కావచ్చును. కాని అన్నిసార్లూ అలాగే అనుకోకూడదు. ఉదాహరణకు సహస్రారం అమృతత్త్వానికి ప్రతీక. అది సాక్షాత్ పరబ్రహ్మస్థానం కాబట్టి దివ్యప్రకాశం కలది. ప్రకాశం అంటే వెలుగుచే అమృతాన్ని కురిపించే వాడన్న సామ్యంతో ఇందులో ఉండే తేజోమండలానికి చంద్రమండలం అని సంకేతం. పరమాత్మకు వృధ్ధిక్షయాలు ఉండవు కాబట్టి అక్కడ ఉండే చంద్రతత్త్వంలో సదాకళ చెప్పబడుతుంది. ఇలా గ్రహించాలి. ఈ విషయం గురించి మరికొన్ని సంగతులు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ముగింపులో ప్రస్తావించుకుందాం.
ఈ విధంగా మనం శ్రీశంకరులు ఈ శ్లోకంలో సహస్రార చంద్రమండల మధ్యగత ఐన అమ్మ శ్రీదేవి యొక్క నిత్యకళావైభవాన్ని గురించి చెబుతున్నారని అర్థం చేసుకున్నాక శ్లోకంలో ఏవిధంగా ఆ సదాఖ్యను గురించి వర్ణిస్తున్నారో తదుపరి టపాలో చూదాం.
సరే, అమావాస్య నాడు చంద్రుడు కనబడకుండా పోతున్నాడు. లేకుండా పోతున్నాడా? ఉండే ఉండాలి కదా? లేకుండా పోతే, లేని చంద్రుడికి వృధ్ధిని ఎలా చెప్పటం కుదురుతుంది నాటి నుండి? కాబట్టి చంద్రుడు అన్నవాడు ఉన్నాడు. కాని చాలా హీనంగా కనబడేందుకు వీలు లేనంత శోభారహితంగా ఉన్నాడు. అంతే. అందుచేత కళలు పదహారు అన్నారు. మిగిలిన పదిహేను కళలూ వస్తూ పోతూ ఉంటాయి. చంద్రుడు పౌర్ణమి నాడు షోడశకళాప్రపూర్ణుడు. ఆ చంద్రుడే, అమావాస్య నాడు ఆ కనబడని కళ మాత్రమే మిగిలినవాడు. ఈ పదహారవదీ, నిత్యమూ చంద్రునికి ఉన్నదీ ఐన కళనే సదా అని నిత్య అనీ అంటారు. దీనినే సంప్రదయంలో షోడశీ అనీ ధృవకళ అని కూడా అంటారు.
అమ్మ సహస్రారకమలంలో ఉన్న చంద్రమండలంలో ఉంటుంది. లలితాసహస్రనామాల్లో చంద్రమండల మధ్యగా అని ఒక నామం ఉంది. ఈ చంద్రుడు పదహారు కళలూ ఉన్న పూర్ణచంద్రుడు. ఈ చంద్రుని యొక్క షోడశీ లేదా సదా కళ సాక్షాత్తూ అమ్మవారి యొక్క స్వరూపమే.
శ్రీ చక్రంలో మధ్యన ఉండేది బిందువు. ఈ బిందువుకు సహస్రారకమలంలో ఉన్న ఈ చంద్రమండలంతో సమన్వయం. ఈ శ్లోకలంలో షణ్ణాం అని ఆరుచక్రాలనూ స్మరించటం జరిగింది కాబట్టి మరికొంత వివరంగా చూదాం. అజ్ఞా చక్రానికి శ్రీచక్రంలో బిందువు మీది త్రికోణంతో సమన్వయం. విశుధ్ధి చక్రమే అష్టకోణచక్రం. అనాహతచక్రమే అంతర్దశారం. మణిపూరకం బహిర్దశారం. స్వాధిష్ఠానం చతుర్దశారం. మూలాధారమే శ్రీచక్రం యొక్క భూపురం. ఇలా మూలాధారాది కమలాలను శ్రీచక్రంతో సమన్వయం చేయటానికే స్థూలచక్రమేళనం అని పేరు.
సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క విషయం గుర్తు చేయవలసి ఉంది. అగ్ని సూర్య చంద్రాది నామాలు అన్నీ ఈ శ్రీవిద్యలో సాంకేతికపదాలు. శ్రీవిద్యలో బ్రహ్మాండ, పిండాండ, శ్రీచక్రాలకు అబేధం. అందుచేత ఈ పదాలు ఒక్కొక్క సారి నిజమైన బహిఃప్రపంచపు అర్థాల్లో అంటే సూర్యచంద్రులు మనకు ఆకాశంలో కనిపించే వారే కావచ్చును. కాని అన్నిసార్లూ అలాగే అనుకోకూడదు. ఉదాహరణకు సహస్రారం అమృతత్త్వానికి ప్రతీక. అది సాక్షాత్ పరబ్రహ్మస్థానం కాబట్టి దివ్యప్రకాశం కలది. ప్రకాశం అంటే వెలుగుచే అమృతాన్ని కురిపించే వాడన్న సామ్యంతో ఇందులో ఉండే తేజోమండలానికి చంద్రమండలం అని సంకేతం. పరమాత్మకు వృధ్ధిక్షయాలు ఉండవు కాబట్టి అక్కడ ఉండే చంద్రతత్త్వంలో సదాకళ చెప్పబడుతుంది. ఇలా గ్రహించాలి. ఈ విషయం గురించి మరికొన్ని సంగతులు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ముగింపులో ప్రస్తావించుకుందాం.
ఈ విధంగా మనం శ్రీశంకరులు ఈ శ్లోకంలో సహస్రార చంద్రమండల మధ్యగత ఐన అమ్మ శ్రీదేవి యొక్క నిత్యకళావైభవాన్ని గురించి చెబుతున్నారని అర్థం చేసుకున్నాక శ్లోకంలో ఏవిధంగా ఆ సదాఖ్యను గురించి వర్ణిస్తున్నారో తదుపరి టపాలో చూదాం.
21, అక్టోబర్ 2014, మంగళవారం
సౌందర్యలహరి - 20 కిరంతీ మంగేభ్యః
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
20
కిరంతీ మంగేభ్యః కిరణ నికురంబామృతరసం
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివ యః .
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాసారసిరయా
ఇది తృతీయ కూట ధ్యానం.
ఇది గారుడం అనే ప్రయోగం గురించిన ప్రస్తావన చేసే శ్లోకం.
ఈ శ్లోకంలో కూడా యః - సః అనే విధానం కనిపిస్తున్నది చూడండి. గత కొన్ని శ్లోకాల్లోనూ ఇది మనం గమనించవచ్చును.
ఇక్కడ శ్లోకంలో యః అంటే ఎవడు అనగా ఏ భక్తుడు అని ప్రస్తావన చేసి, అటువంటి భక్తుడు చేసి అటువంటి భక్తుడు చేసే ఆరాధనా విధానాన్ని ప్రస్తావిస్తారు. సః అంటే వాడు అని అర్థం. ఇలా వాడికి అంటూ ప్రస్తావిస్తూ అటువంటి ఆరాధనకు ఫలం ఏదో దానిని వివరిస్తారు శ్రీశంకరులు.
కిరణ నికురంబం అంటే కాంతికిరణాల పుంజం అని అర్థం. అది యెక్కడి నుండి వెలువడుతున్నదీ? కాంతి అన్నాక
దానికి ఒక మూలస్థానం ఉండాలికదా ఫలాని చోటనుండి కాంతిప్రసరిస్తున్నదీ అనటానికి. అదే, అంగేభ్యః అని చెబుతున్నారు. అంటే అమ్మ దివ్యమంగళవిగ్రహం నుండి అలా కాంతి కిరణాలు పుంజాలు పుంజాలుగా వెలువడుతున్నాయని చెబుతున్నారు. మరి ఆ కాంతిపుంజాలకు ఒక విశేషం కూడా జోడించి చెబుతున్నారు అమృతరసం అని. అంటే ఇప్పుడు ఈ మొత్తం మొదటిపాదం అంగేభ్యః కిరణనికురుంబామృతరసం కిరంతీ అని అవుతున్నది. భావం చూస్తే అమ్మయొక్క దివ్యమంగళస్వరూపం నుండి తేజఃపుంజాలు అమృతరసాన్ని వర్షిస్తున్నాయీ అని వచ్చింది. బాగుంది.
ఆ అమ్మ స్వరూపాన్ని కూడా తరువాతి పాదంలో హిమకరశిలామూర్తి మివ అని స్పష్టంగా అందంగా ఇలా చెబుతున్నారు. హిమకరుడు అంటే అందరికీ తెలుసుకదా చంద్రుడు అని. హిమకరశిల అంటే చంద్రకాంతశిల అన్న మాట. హిమకరశిలామూర్తి అంటే చంద్రకాంతశిలావిగ్రహం వలె అత్యంత స్వచ్చమైన తెలుపు రంగు కలది. ఇంకొక విశేషం కూడా ఇక్కడ కనబడుతోంది. చంద్రకాంతశిలలు వెన్నెలలో చెమర్చుతూ ఉంటాయని ప్రతీతి. అవి ఎంత తెల్లగా ఉంటాయీ అంటే ధవళవర్ణంలో ప్రకాశిస్తూ వెన్నెల కాదూ అవే కాంతిని వెదజల్లుతూ ఉన్నాయా అని పిస్తుంది. చంద్రుడి వెన్నెల అమృతసమానం అని ప్రతీతి కదా. అందుకే చంద్రుడికి సుధాకరుడు అని కూడా పేరు చాలా ప్రసిధ్దంగానే వినిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మ స్వరూపం చంద్రకాంత శిలా ప్రతిమ వలె స్వయంగా కాంతులతో అమృతాన్ని చిలకరిస్తోంది అని ఇక్కడ శ్రీశంకరుల చమత్కారం.
ఇప్పుడు ఆచార్యులవారుఅంటున్నారూ అమ్మా యః త్వాం హృది మాధత్తే అని అటువంటి చంద్రకాంతశిలాసదృశమూర్తివీ అమృతస్యందినివీ ఐన నిన్ను ఎవరైతే తన హృదయంలో చక్కగా నిలుపుకొని ధ్యానం చేస్తున్నాడో అటువంటి వాడికి గొప్ప మహిమ కలుగుతున్నదీ అని.
అది ఎటువంటి మహిమ అన్నదో చిత్తగించండి.
శకుంతాధిప ఇవ సః సర్పాణాం దర్పం శమయతి అని అంటున్నారు. శకుంతములు అంటే పక్షులు. అధిపుడు అంటే రాజు. పక్షులజాతికి రాజు ఎవరయ్యా అంటే ఇంకెవ్వరు గరుత్మంతుడే. ఈ భక్తుడు గరుత్మంతుడి అంతటి వాడు అవుతాడట! ఏ విషయంలో అంటే పాముల విషయంలో. అందరికీ తెలుసుకదా గరుడుడికీ సర్పాలకీ ఆగర్భశత్రుత్వం. దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేనంతగా ప్రసిధ్ధమైన కథ అది. ఆ గరుత్మంతుడి లాగా సః అంటే అతదు, ఆ భక్తుడు, సర్పాణాం అనగా పాముల యొక్క దర్పం అనగా పొగరును శమయతి అంటే అణగ్గొడతాడు అని.
అందుకే ఇది గారుడప్రయోగం అన్నారు. ఈ శ్లోకాన్ని శ్రధ్ధగా ఉపాసన చేస్తే పాములూ ఇంకా మిగిలిన సకల విషకీటకాల వలనా ఆ ఉపాసకుడికి ఎన్నడూ భయం ఉండదు.
ఇంకా మరొక విశేషాన్ని కూడా శ్రీశంకరులు చెబుతున్నారు. అటువంటి భక్తుడికి మరొక అద్భుతమైన శక్తీ అబ్బుతుంది అని. ఏమిటంటే దృష్ట్వా జ్వరప్లుష్టాన్ అనగా జ్వరపడ్ద వారిని అతగాడు ఒక చూపు చూస్తే అది, సుదాధారసిరయా సుఖయతి అంటే అమృతాన్ని పిచికారీచేసేదిలాగా ఆ దృష్టి జ్వరపీడితుడిమీద పనిచేసి సుఖయతి అంటే సుఖం కలిగిస్తుందట. అనగా, అటువంటి ఉపాసకుడి చూపు తగిలితే ఏ దైనా జ్వరంతో బాధపడుతున్నవాళ్ళకు ఆ చూపు అమృతపానం అవుతుందట జ్వరవిముక్తి చేసి సుఖం కలిగిస్తూ.
అదండీ శ్రీశంకరులు చంద్రకాంతశిలలాగా స్వఛ్చమైన తెలుపు చాయలో ఉన్న అమ్మను గుండెల్లో నిలుపుకొని ఉపాసన చేసినవాడికి కలిగే శక్తిగురించి చెప్పిన శ్లోకం.
చతుశ్శతిస్తుతిలో కూడా ఈ విధంగా అమ్మస్వరూపాన్ని అరునెలలు ధ్యానం చేసినవాడు గరుత్మంతుడిలాగా సకల విషాలూ సకలజ్వరాలూ తొలగించగల సమర్థుడు అవుతున్నాడని చెప్పబడింది.
పక్షాంతరంలో నలభైఐదు రోజులు రోజుకు రెండువేల పర్యాయాలు జపించాలని చెప్పబడింది.
20, అక్టోబర్ 2014, సోమవారం
సౌందర్యలహరి - 19 ముఖం బిందుం కృత్వా .... (కొనసాగింపు)
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
ఈ ముఖం బిందు కృత్వా అనే శ్లోకం కామరాజ ప్రయోగం అని కూడా అంటారు.
ఐహికార్థంలో చూస్తే ఈ శ్లోకం యొక్క ప్రయోగానికి ప్రయోజనం స్త్రీవశ్యం. ఐతే అటువంటివి సమయమతంలో ఉద్దిష్టప్రయోజనాలు కావనే తప్పకుండా చెప్పుకోవలసి ఉంది.
శ్రీవిద్యలో రకరకాల విధానాలు ఉన్నాయి కాని ముఖ్యంగా చెప్పుకోవలసినవి రెండు విధానాలు. ఒకటి దక్షిణామ్నాయము లేదా సమయమతం అని వేదసమ్మతమైన విధానం.
రెండవది వామము లేదా వామాచారము అని పిలువబడే విధానం.
ఈ రెండు విధానాల్లోనూ ఉన్న బేధాల్లో ముఖ్యమైనది దృక్కోణం. సమయమతం కేవలం ఆముష్మిక ప్రయోజనాన్ని ఉద్దేశించినది, వామాచారం హెచ్చుగా ఐహికప్రయోజనాలసిధ్ధి కొరకు ఆచరించబడేది.
దక్షిణామ్నాయం లేదా సమయమతం కేవల సాత్విక మైన ఆరాధనా విధానం.
వామాచారం భీభత్సమైనది. దానిలో మధ్యమాంసాదులతో పూజలు చెప్పబడుతాయి. ఈ విధానాన్ని అనుసరించే విద్యలు క్షుద్రవిద్యలు. రకరకాల ప్రయోగాలు ఇలాంటివి. ఇందులో మాదనాది ప్రయోగాలూ ఉన్నాయి. కొన్ని విద్యాసిధ్ధులకోసం బాలజిహ్వాఛ్ఛెదనాది దారుణమైన క్రియలూ, కొన్ని పూజావిధానాల్లో ప్రత్యక్షస్త్రీయోని పూజలూ వగైరా వ్యవహారాలతో ఈ వామాచారం ఘోరంగా ఉంటుంది. వైదికవ్యవహారప్రియులు వీటికి దూరంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వామాచారం వేదబాహ్యం.
ఈ శ్లోకంలోనూ మరికొన్ని శ్లోకాల్లోనూ ఐహికమైన ఇటువంటి తంత్రప్రయోగాలను శ్రీశంకరులు ప్రస్తావించటం గమనించవచ్చును.
ఐతే వీటిని ప్రస్తావించటంలో శ్రీ శంకరుల ఉద్దేశం సమయమతానుసారంగా వీటిని నిర్వచించటమే అని నా ఉద్దేశం.
క్లీం అనేది కామరాజబీజం. ఇది సర్వవశీకరణ సమర్థమైనది. దీనిని శ్రీశంకరులు ఈ శ్లోకంలో ప్రస్తుతి చేస్తున్నారు. స్థూలార్థంగా ఆయన చెప్పినది ఈ కామరాజబీజం యొక్క ప్రయోగాన్ని ప్రస్తవించి, ఈ విధంగా అమ్మ అరుణను ఆరాధించిన వారికి ఇష్టస్త్రీలు తక్షణం వశులైపోతారు అని చెప్పటం. ఐతే ఆయనకు ప్రత్యేకమైన శైలిలో ఆయన ఇక్కడ సమయమతాను సారంగా దీన్ని తీర్చిదిద్ధిన విధానం పరిశీలించండి.
మూడులోకాలు అనేదే త్రికోణం అని నిర్వచించారు. ఆ ముల్లోకత్రికోణానికి స్తనస్థానాలు సూర్యచంద్రులు అని చెప్పారు. అంటే ముల్లోకాల యొక్క స్వరూపం కూడ అమ్మ కామకళారూపం అని చెప్పటం తాత్పర్యం.
రుద్రయామళంలో "త్రిలోకీయం తవాంబికే కామరాజకళారూపా జాగర్తి స చరాచరా" అని ఉంది. శృతికూడా
య ఈగ్‍ం శ్రుణోత్యలకగ్‍ం శ్రుణోతి
నహి ప్రవేద సకృతస్య పంథా మితి
అని చెబుతున్నది. అందుచేత త్రిలోకాలలూ అమ్మ యొక్క సృష్టిరూపమైన కామకళగా భావించటం వేద విహితమే. దీని అర్థం త్రిలోకాలనూ అమ్మ సంకల్పమే సృష్టిస్తున్నదని చెప్పటం.
అదృశ్యరూపంగా ఉన్న అమ్మ ముఖ పద్మమూ వాటికి దిగువన సకలజగత్పోషణాదక్షమైన అమ్మస్తనద్వయంగా కనిపించే సూర్యచంద్రులూ అన్న భావనతో భగవతి అరుణను ఉపాసించే విధానం సమయమత సమ్మతం. ఇలా చేసే భక్తులకు మూడులోకాలనూ కూడా సమ్మోహనపరచగల శక్తి ఉంటుంది అని చెప్పటంలో అర్థం త్రిలోకాలలోనూ అమ్మ సంకల్పం సంచరించే విధానం వారికి ప్రసన్నంగా ఉంటుందని చెప్పటమే. అందుచేత వారికి త్రిలోకాలలోనూ అగోచరమైన తత్త్వం ఏదీ ఉండదు.
ఈ కామరాజబీజం యొక్క దివ్యశక్తిని తెలిపే కథ ఒకటి దేవీ భాగవతంలో ఉన్నది. అది సుదర్శనుడనే రాకుమారుని కథ,
ఈ కథను మనం సూక్ష్మంగా చెప్పుకుంధాం. రాజ్యంపోయి మున్యాశ్రమాల్లో నివసిస్తున్న ఒక రాణీ కొడుకు ఈ సుదర్శనుడు. ఎవరో ఏదో సందర్భంలో ఎవరిని గురించో క్లీబుడు అని సంబోధిస్తారు. అప్పటికి సరిగా ఊహ తెలియని ఈ పిల్లవాడు ఆ మాటను క్లీం అని గ్రహించి వినటానికి బాగుండటంతో నిత్యం క్లీం క్లీం అంటూ ఉండే వాడు. పెద్దైనా ఆ ఆలవాటు పోదు. ఆ అమాయకమైన వచో విన్యాసానికే అమ్మవారు ముచ్చటపడి అతడికి పెళ్ళికూతుర్ని చూడటమే కాదు, ఏకంగా పెళ్ళికి వచ్చిన విఘ్నాల్నీ తొలగిస్తుంది. ఆ అమ్మాయి పేరు శశికళ. ఆమెకు కలలో కనిపించి ఫలానా రాజకుమారుడు నా భక్తుడు యోగ్యుడు నీకోసం ఎంపిక చేసానూ అని చెప్పి ఆ పిల్లను ఆదేశిస్తుంది. ఆ శశికళ స్వయంవరాన్ని తిరస్కరించి తండ్రిని ఒప్పించి సుదర్శనుణ్ణి పెళ్ళాడితే మిగతా రాజులతో పెద్ద యుధ్ధం వస్తుంది. అందులో అమ్మవారే స్వయంగా సింహవాహనంతో విచ్చేసి మరీ సుదర్శనుణ్ణి గెలిపిస్తుంది.
చూసారా కామరాజబీజం యొక్క శక్తిని. దీనిని వామాచారులు స్త్రీవశ్యానికి వాడటం వేరే సంగతి. అటువంటి వారికి వచ్చే ఫలసిధ్ధి కేవలం ఐహికం కావటం వల్ల ఆధ్యాత్మిక పురోగతికి ఏమీ పనికి వచ్చేది కాదు కదా.
అమాయకమైన కామరాజబీజోపాసనకే అమ్మవారు వచ్చి అండగా ఉండి తల్లిలా రక్షించింది
అమ్మను జగత్రయత్రికోణ సంస్థితయైన అరుణగా సంభావించి ఉపసిస్తే అది సమయమతం ప్రకారం ఎంత సిధ్దిదమో ఆలోచించుకోండి.
ఈ శ్లోకానికి పారాయణం రోజుకు పన్నెండు వందలసార్లు చొప్పున నలభైఐదు రోజులు. నైవేద్యం పాలు, తేనె, అరటిపండ్లు. ఫలితం మనోవశీకరణం.
ఈ కథను మనం సూక్ష్మంగా చెప్పుకుంధాం. రాజ్యంపోయి మున్యాశ్రమాల్లో నివసిస్తున్న ఒక రాణీ కొడుకు ఈ సుదర్శనుడు. ఎవరో ఏదో సందర్భంలో ఎవరిని గురించో క్లీబుడు అని సంబోధిస్తారు. అప్పటికి సరిగా ఊహ తెలియని ఈ పిల్లవాడు ఆ మాటను క్లీం అని గ్రహించి వినటానికి బాగుండటంతో నిత్యం క్లీం క్లీం అంటూ ఉండే వాడు. పెద్దైనా ఆ ఆలవాటు పోదు. ఆ అమాయకమైన వచో విన్యాసానికే అమ్మవారు ముచ్చటపడి అతడికి పెళ్ళికూతుర్ని చూడటమే కాదు, ఏకంగా పెళ్ళికి వచ్చిన విఘ్నాల్నీ తొలగిస్తుంది. ఆ అమ్మాయి పేరు శశికళ. ఆమెకు కలలో కనిపించి ఫలానా రాజకుమారుడు నా భక్తుడు యోగ్యుడు నీకోసం ఎంపిక చేసానూ అని చెప్పి ఆ పిల్లను ఆదేశిస్తుంది. ఆ శశికళ స్వయంవరాన్ని తిరస్కరించి తండ్రిని ఒప్పించి సుదర్శనుణ్ణి పెళ్ళాడితే మిగతా రాజులతో పెద్ద యుధ్ధం వస్తుంది. అందులో అమ్మవారే స్వయంగా సింహవాహనంతో విచ్చేసి మరీ సుదర్శనుణ్ణి గెలిపిస్తుంది.
చూసారా కామరాజబీజం యొక్క శక్తిని. దీనిని వామాచారులు స్త్రీవశ్యానికి వాడటం వేరే సంగతి. అటువంటి వారికి వచ్చే ఫలసిధ్ధి కేవలం ఐహికం కావటం వల్ల ఆధ్యాత్మిక పురోగతికి ఏమీ పనికి వచ్చేది కాదు కదా.
అమాయకమైన కామరాజబీజోపాసనకే అమ్మవారు వచ్చి అండగా ఉండి తల్లిలా రక్షించింది
అమ్మను జగత్రయత్రికోణ సంస్థితయైన అరుణగా సంభావించి ఉపసిస్తే అది సమయమతం ప్రకారం ఎంత సిధ్దిదమో ఆలోచించుకోండి.
ఈ శ్లోకానికి పారాయణం రోజుకు పన్నెండు వందలసార్లు చొప్పున నలభైఐదు రోజులు. నైవేద్యం పాలు, తేనె, అరటిపండ్లు. ఫలితం మనోవశీకరణం.
17, అక్టోబర్ 2014, శుక్రవారం
సౌందర్యలహరి - 19 ముఖం బిందుం కృత్వా ....
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
19
ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయే ద్యో హరమహిషి తే మన్మథకలామ్
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందు స్తన యుగామ్
హరార్ధం ధ్యాయే ద్యో హరమహిషి తే మన్మథకలామ్
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందు స్తన యుగామ్
ఈ శ్లోకంలో శ్రీశంకరులు కామ కళా రూప ధ్యానం అనే ప్రక్రియను గురించి ప్రస్తావిస్తున్నారు.
అమ్మవారిని హే హరమహిషి అని సంబోధిస్తున్నారు. మహిషి శబ్ధం మనకు పరిచయం ఉన్నదే, రాణి అన్న అర్థంతో సహా. హరుడు అంటే శివుడు కాబట్టి హరమహిషి అంటే శివుని రాణీ అని అమ్మను సంబోధిస్తున్నారని సులభంగానే బోధపడుతున్నది.
ముఖం బిందుం కృత్వా అంటే శ్రీచక్రంలో మధ్యన బిందువు ఉంది కదా, దానినే స్త్రీయొక్క ముఖంగా భావించి అని అర్థం. ఎవరిముఖంగా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది కదా? ఇక్కడ రెండు సమాధానాలున్నాయి. మొదటిది ఇది కామరాజ పీఠ ధ్యానం. ఈ ధ్యానాన్ని ఐహిక మైన కామ్యసిధ్ది కోసం జపించే వారు ఇష్టస్త్రీ ముఖాన్ని బిందువుగా భావించాలి. రెండవది ఐహిక దృష్టిలేని ఆధ్యాత్మిక సాధకులు అమ్మవారి యొక్క ముఖంగా భావించాలని అర్థం. ఈ రెండవ తాత్పర్యం మనం తరువాత చర్చిద్దాము. మొదట ఈ శ్లోకం ఎలా మదనసంబధమైన ప్రయోగాన్ని చెబుతున్నదో చూదాం.
కృత్వా కుచయుగ మధస్తస్య అన్నదానికి అన్వయక్రమం అస్య అధః కుచయుగమ్ కృత్వా అని. అంటే ఆ బిందువుక్రిందుగా ఉద్దిష్ట స్త్రీమూర్తి యొక్క కుచయుగం అంటే స్తనాల జంటగా భావించాలి.
అదధో హరార్థం ధ్యాయేత్ అంటే దానికి క్రిందుగా హరార్థం అంటే శివుడిలో సగభాగం ఐన శక్తిని ధ్యానించాలి. శ్రీచక్రభాషలో ఇది త్రికోణం. ఈ త్రికోణాన్ని స్త్రీత్వచిహ్నంగా భావించాలని చెబుతున్నారు. ఈ విధంగా చేసి
తే మన్మథకలామ్ అనగా నీ యొక్క కామరాజబీజమును ఈ చెప్పబడిన స్థానములలో ఉపాసన చేయాలి. క్లీం అనేది కామరాజబీజం.
ఈ విధంగా కామరాజబీజాన్ని ఉపాసించే విధానం చెప్పి శ్రీశంకరులు ఈ ఉపాసనా ఫలం యొక్క మహిమను గురించి వర్ణిస్తున్నారు.
స సద్యస్సంక్షోభం నయతి వనితా అని అంటే వాడు ఉపాసన ఫలితంగా వెంటనే వనితాసంక్షోభం అనగా స్త్రీహృదయాలను సంక్షోభానికి గురిచేస్తాడు. అంటే ఉపాసన ఫలించిన వెంటనే సాధకుడికి స్రీలను మోహింపచేసే శక్తి యేర్పడుతుంది. లేదా అతడు ఎవరైనా స్త్రీని ఉద్దేశించి కనుక ఈ కామరాజ బీజాన్ని ఉపాసిస్తే ఆ వనిత ఇతడికి ప్రసన్నురాలవుతుంది.
ఐతే ఆచార్యులవారు ఇలా చెప్పి ఊరుకో లేదు. పైగా, నిజానికి ఇతి అంటే ఇలా చెప్పటం అతి లఘుః అంటే చాలా చప్పగా చెప్పటం అవుతుందట.
ఎందుకంటే అలాంటి కామరాజబీజాన్ని ఉపాసించిన వాడు
రవీందు స్తనయుగామ్ అనగా సూర్య చంద్రులే స్తనస్థానాల్లో ఉన్నట్టి త్రిలోకీ అంటే ఆ స్వర్గ, మర్త్య పాతాళాలతో ఏర్పడే ముల్లోక త్రికోణం ఉందే అపి అనగా దానిని కూడా ఆశుః భ్రమయతి అంటే అలవోకగా తక్షణమే మోహంలో ముంచెత్తగలడు.
అది విషయం.
ఈ శ్లోకానికి సంబంధించి ఇంకా మనం చెప్పుకోవలసింది ఉంది. అది వచ్చే టపాలో.
కృత్వా కుచయుగ మధస్తస్య అన్నదానికి అన్వయక్రమం అస్య అధః కుచయుగమ్ కృత్వా అని. అంటే ఆ బిందువుక్రిందుగా ఉద్దిష్ట స్త్రీమూర్తి యొక్క కుచయుగం అంటే స్తనాల జంటగా భావించాలి.
అదధో హరార్థం ధ్యాయేత్ అంటే దానికి క్రిందుగా హరార్థం అంటే శివుడిలో సగభాగం ఐన శక్తిని ధ్యానించాలి. శ్రీచక్రభాషలో ఇది త్రికోణం. ఈ త్రికోణాన్ని స్త్రీత్వచిహ్నంగా భావించాలని చెబుతున్నారు. ఈ విధంగా చేసి
తే మన్మథకలామ్ అనగా నీ యొక్క కామరాజబీజమును ఈ చెప్పబడిన స్థానములలో ఉపాసన చేయాలి. క్లీం అనేది కామరాజబీజం.
ఈ విధంగా కామరాజబీజాన్ని ఉపాసించే విధానం చెప్పి శ్రీశంకరులు ఈ ఉపాసనా ఫలం యొక్క మహిమను గురించి వర్ణిస్తున్నారు.
స సద్యస్సంక్షోభం నయతి వనితా అని అంటే వాడు ఉపాసన ఫలితంగా వెంటనే వనితాసంక్షోభం అనగా స్త్రీహృదయాలను సంక్షోభానికి గురిచేస్తాడు. అంటే ఉపాసన ఫలించిన వెంటనే సాధకుడికి స్రీలను మోహింపచేసే శక్తి యేర్పడుతుంది. లేదా అతడు ఎవరైనా స్త్రీని ఉద్దేశించి కనుక ఈ కామరాజ బీజాన్ని ఉపాసిస్తే ఆ వనిత ఇతడికి ప్రసన్నురాలవుతుంది.
ఐతే ఆచార్యులవారు ఇలా చెప్పి ఊరుకో లేదు. పైగా, నిజానికి ఇతి అంటే ఇలా చెప్పటం అతి లఘుః అంటే చాలా చప్పగా చెప్పటం అవుతుందట.
ఎందుకంటే అలాంటి కామరాజబీజాన్ని ఉపాసించిన వాడు
రవీందు స్తనయుగామ్ అనగా సూర్య చంద్రులే స్తనస్థానాల్లో ఉన్నట్టి త్రిలోకీ అంటే ఆ స్వర్గ, మర్త్య పాతాళాలతో ఏర్పడే ముల్లోక త్రికోణం ఉందే అపి అనగా దానిని కూడా ఆశుః భ్రమయతి అంటే అలవోకగా తక్షణమే మోహంలో ముంచెత్తగలడు.
అది విషయం.
ఈ శ్లోకానికి సంబంధించి ఇంకా మనం చెప్పుకోవలసింది ఉంది. అది వచ్చే టపాలో.
15, అక్టోబర్ 2014, బుధవారం
సౌందర్యలహరి - 18 తనుచ్చాయాభిః ...
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
18
తనుచ్చాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః
దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః
భవంత్యస్య త్రస్యద్వనహరిణశాలీననయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః
శ్రీశంకరులు ఇంతకు ముందు మూడు శ్లోకాల్లో ప్రథమకూటమైన వాగ్భవకూటం యొక్క ధ్యానాన్ని వర్ణించారు.
ఇప్పుడు రెండవది ఐన కామరాజ కూటాన్ని గురించి చెబుతున్నారు.
తరుణతరణి అన్నమాటకు అర్థం ఉదయసూర్యబింబం అని. తరుణం అంటే యౌవనము అనీ లేతది అనీ అర్థాలు రెండూ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి అర్థనిర్ణయం చేసుకోవాలి. ఈ శ్లోకంలో అరుణిమ అనే కాంతి వర్ణం గురించి ప్రస్తావిస్తున్నారు చూడండి. అరుణిమం అంటే ఎర్రదనం. సూర్యుడు ఎర్రగా ఉండే సమయాలు రెండే రెండు. ఐతే అటువంటి సూర్యుడు ఉదయభానుడు కావాలి లేదా సాయంకాలం సూర్యుడు కావాలి. సాయంకాలం సూర్యుడు వయస్సు ఉడిగినవాడుగా వర్ణించటానికి బాగుంటుంది కాని వయస్సులో ఉన్న సూర్యుడిగా చెప్పకూడదు కదా? ఇక రెండవది ఐన ఉదయసూర్యబింబాన్ని స్వీకరించాలి మనం. అది అరుణిమం కలిగి ఉంటుంది కదా నిస్సందేహంగా. అందుచేత ఇక్కడ తరుణతరణి అంటే బాలసూర్యబింబం అన్న మాట.
ఈ తరుణతరణి అంటే బాలసూర్యుడి యొక్క శ్రీసరణిభిః అని చెబుతున్నారు కదా. శ్రీ అంటే సౌభాగ్యమూ సంపదా అన్న అర్థాలు సరిపోలుతాయి. అవికలిగిన సరణిభిః అంటే వరుసలు లేదా వెల్లువలు ఏవి కాంతిపుంజాలే కదా.
దీనిని బట్టి తరుణతరణి శ్రీసరనిభిః అన్నదానికి భావం బాలసూర్యుడి ఎర్రని కాంతులవెల్లువ అనే సంపద అని తెల్లమౌతున్నది. మరి శ్రీశంకరులు దీనిని ఎలా పోల్చుతున్నారూ? అమ్మా తేః తనుఛ్ఛాయాభిః అనగా నీ యొక్క శరీరకాంతి అలా బాలసూర్యకాంతిశ్రీలాగా ఉందీ అని చెబుతున్నారు. అంటే బాలసూర్యుడు ప్రసరించే అందమైన ఎర్రని కాంతిపుంజాల సంపద భూలోకం అంతా పరచుకొని ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది కదా. ఈ సంగతి అందరికీ ప్రత్యేకించి వివరించనక్కర లేదు కదా. శ్రీశంకరులు ఈ పోలికను మరికొంచెం దూరం తీసుకొనె వెళుతున్నారు చూడండి. ఆయన ఏమంటున్నా రంటే, అమ్మ యొక్క ఎర్రని శరీర కాంతి ఏమి చేస్తోందీ అంటే దివం సర్వామ్ ఉర్వీమ్ అరుణిమ నిమగ్నామ్ అంటే దివం అనగా ఆకాశమూ (లేదా స్వర్గలోకమూ) ఉర్వీం అనగా భూలోకమూ అంతా కూడా అరుణిమ అనగా ఎర్రదనంలో నిమగ్నామ్ అంటే సముద్రంలో ములిగిపోయినట్లు ములిగిపోయేలా చేస్తోంది అంటున్నారు. ఈ నీ మనోహరమైన తనుఛ్ఛాయను, ఇలా బాలసూర్యకాంతిలాగా ఎర్రగా లోకాలన్నింటినీ ఒక ఎరుపుసముద్రంలో ముంచేస్తోందే దానిని యః స్మరతి అనగా ఏ సాధకుడు స్మరిస్తున్నాడో వాడు ఎలాంటి ఫలితం పొందుతున్నాడొ చెబుతున్నారు. గీర్వాణగణికా అని అప్సరసలను ప్రస్తావిస్తున్నారు. గీర్వాణులంటే దేవతలు. గణిక అంటే వేశ్య. దేవవేశ్యలు అప్సరసలే కదా. వాళ్ళు ఎటువంటి వారట? త్రస్యత్ వనహరిణ అంటే భయడ్డ లేడిపిల్లల వలె శాలీన నయనా అనగా సిగ్గుతో టపటపా కొట్టుకుంటున్న కళ్ళున్న వాళ్ళట. వాళ్ళంతా కూడా అందులోనూ సహోర్వశ్యాః అని నిష్కర్ష చేసేసారు. ఎవరినీ వదలకుండా. చివరికి ఊర్వశితో సహా అందర్నీ కలేసి సంబోధిస్తూ, కతికతి అంటే అబ్బో వీళ్ళల్లో ఎందరెందరు న వశ్యాః భవతి అటువంటి సాధకుడికి లొంగకుండా ఉంటారూ అంటున్నారు. అంటే ఇలాంటి సాధకుడికి ఊర్వశి వంటి అప్సరసలైనా లొంగి దాసోహం అంటారూ అని ఆచార్యులవారు చెబుతున్నారు. ఇక్కడ ఊర్వశిని పనిగట్టుకొని తీసుకొని రావటంలో ఒక గడుసుదనం ఉంది. అప్సరస లందరిలోనూ అందగత్తె ఊర్వశియే. ఎందుకంటే తపస్సుచేస్తున్న నరనారాయణులను పరీక్షించటానికి అప్సరసలు వస్తుంటే కినిసి నారాయణుడి ఊర్వశిని సృష్టించాడట వాళ్ళందరి కంటే అందగత్తెగా - ఈ అప్సరసల దండు గర్వం అణచటానికి. అమ్మ అరుణిమను ధ్యానించే వాడికి ఊర్వశి కూడా ఊడిగం చేస్తుందీ అని ఆచార్యులవారి చమత్కారం. అసలు ఈ అప్సరసలంతా దేవతాస్త్రీలు కదా, వాళ్ళకు కనురెప్పపాటే ఉండదు కదా మరేమిటీ వీళ్ళ కళ్ళు టపటపలాడుతాయి బెదరిన లేడి కళ్ళలాగా అన్నారూ అని అనుమానం రావచ్చును. అమ్మ అనుగ్రహం ఉన్నవాడి ముందు ఈ వీరి దేవతాగర్వం అణిగి ఈ సిగ్గూ ఆందోళనా వచ్చేస్తాయీ అని శ్రీశంకరులు సూచిస్తున్నారన్న మాట. ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున నలభైరోజులు పారాయణం. నైవేద్యం పాలపాయసము. తాంబూలం. ఫలితం సర్వమనో మోహనతా సిధ్ది. |
14, అక్టోబర్ 2014, మంగళవారం
సౌందర్యలహరి - 17 (ముగింపు)
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
మొదటి భాగం రెండవ భాగం
ఈ శ్లోకంలో వశిన్యాది అని చెప్పటం వలన ఎనిమిది మంది వశినీదేవతలనూ వారితో పాటుగా యోగినులనూ కర్షిణులనూ కూడా స్మరించారని చెప్పుకున్నాం కదా. తదుపరి విషయం చూదాం.
అమ్మ మాతృకావర్ణరూపిణి అని చెబుతూ ఉంటారు కదా. అంటే పంచాశత్ వర్ణాలే స్వరూపంగా ఉన్నది అని అర్థం. ఈ వర్ణాలు అంటే అక్షరాలు సంస్కృతంలో ఏభై ఉన్నాయి. వీటినే ఎనిమిది వర్గాలుగా విభజించి చెబుతారు.
ఆ విభజన అంతా ఒక పట్టిక రూపంలో చూదాం.
ఈ పై పట్టికలో చూపినట్లుగా సంస్కృతంలోని ఏభై వర్ణాలకూ ఇలా వశిన్యాదులు అధిష్ఠానదేవతలుగా ఉన్నారు. అందుచేత ఇక్కడ వశిన్యాద్యాభ్యాః అని వశిన్యాదులు ఎనిమిది మంది పరంగాను కూడా అన్వయం చేసుకుంటే అన్ని వర్ణమాతృకలూ ఈ వశిన్యాదులే అన్నది కూడా అన్వయంలోనికి తెచ్చుకున్నట్లు అవుతున్నది కదా.
ఈ ఏబదివర్ణాలలో అ కారం మొదలు ఠ కారం వరకూ ఉన్న వర్ణాల యొక్క రంగు ధూమ్ర వర్ణం. అంటే వెలిబూడిద రంగు.
డ నుండి ఫ వరకు ఉన్న వర్ణాలు శుక్లవర్ణాలు అంటే తెల్లని రంగు కలవి.
బ నుండి ల వరకు అరుణ ఛ్చాయ కలవి అంటే ఎర్రగా ఉండేవి. ళ కారం కూడా ల కారం గానే ఎర్రనిది.
న నుండి స వరకు ఉన్న వర్ణాలు స్వర్ణఛ్ఛాయ కలవి అంటే బంగారు వన్నె కలవి.
హ కారమూ మెఱుపు వంటి రంగు కలది. క్ష కారం కూడా అలాంటి వన్నె కలదే.
మూడవ ఆవరణం అష్టకోణం. అంటే మధ్యస్థ త్రికోణాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది
త్రికోణాల వలయం. దీనికి సర్వరోగహరచక్రం అని పేరు. ఇక్కడ ఉండే దేవతలు
ఎనిమందీ ఈ వశిన్యాదులని చదువుకున్నాం కదా. సుధాబిందువును కలిగి ఉన్న త్రికోణాన్ని ఆనుకుని ఈ అష్టకోణ చక్రం ఉందని మనకి ఇప్పటికే తెలుసు కదా. అలాగే ఈ అష్టకోణ చక్రం శివ-శక్తి త్రికోణాల మేళనం వలన యేర్పడుతోందనీ మనకు తెలుసును కదా. దీని వలన సిధ్ధిస్తున్నది ఏమిటంటే ఏబది వర్ణమాతృకలూ శివశక్తి సమ్మేళనం ఆధారంగా కలవి అని.
అలాగే ఈ అష్టకోణ చక్రం ఏ త్రికోణాన్ని ఆనుకుని ఉందో దానిలో ఉన్న వాగ్భవ, పూర్ణగిరి, జాలంధరపీఠాలను గురించికూడా చదువుకున్నాం సూక్షంగా. ఇందులోనివాగ్భవకూటాన్నే ఇక్కడ వర్ణించారన్న మాట. ఈ మూడు కూటాలను అనుకుని కదా వర్ణమాతృకలు ఉన్నదీ?
అందుచేత ఈ వాగ్భవకూటాన్ని వర్ణమాతృకలకు మూలంగా సారస్వత ధ్యానం ఉందని చెబుతున్నారన్న మాట శ్రీశంకరులు.
|
13, అక్టోబర్ 2014, సోమవారం
సౌందర్యలహరి - 17 (కొనసాగింపు)
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
ఈ 17వ శ్లోకంలో ఉన్న వశిన్యాద్యాభిః అన్నది చాలా కీలకమైన పదప్రయోగం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాని గురించి వివరించేందుకు ప్రయత్నిస్తాను. ఇది సాంకేతికమైన వ్యవహారం కాబట్టి పాఠకులు కొంచెం ఓపికతో, మరికొంచెం గమనికతో చదువుకోవాలని మనవి.
శ్రీచక్రం శివ-శక్తుల ఐక్యస్వరూపం. శ్రీచక్రంలో శక్తికోణాలు శివకోణాలు అంటు కొన్ని త్రికోణాలను గురించి గత శ్లోకాల్లో ప్రస్తావించిన సంగతి గుర్తు చేసుకోండి. శ్రీచక్రం పిండాండం అని చెప్పబడే మానవశరీరానికి ప్రతీక. ఈ విషయం గత శ్లోకాల్లో కొన్నింటికి వ్యాఖ్యానం చేస్తూ ప్రస్తావించిన సంగతి గుర్తు చేసుకోండి.
అలాగే, శ్రీచక్రం శ్రీవిద్యామంత్రాలకు చిహ్నం. మనం శ్రీవిద్యయొక్క లోతుల్లోకి వెళ్ళి సౌందర్యలహరీ వ్యాఖ్యానం చదువుకోవటం లేదు కాబట్టి, అత్యవసరం ఐనప్పుడు తప్ప దీనిని గురించి చర్చించుకొన బోవటం లేదు.
శ్రీచక్రం బ్రహ్మాండానికి ప్రతీక. సాంకేతికంగా పిండాండం అనేది బ్రహ్మాండం యొక్క సూక్ష్మరూపం అన్నమాట ఇంతకు ముందే చెప్పుకొన్నాం. సందర్భం వచ్చినప్పుడు శ్రీచక్రం బ్రహ్మాండసంబంధమైన ప్రతీక ఎలాగో తెలుసుకోవచ్చును.
శ్రీచక్రంలో అనేకమంది దేవీమూర్తులను గుర్తిస్తారు. వీరే వశిన్యాదులు. వీరిని గురించి ప్రస్తుతం అవగతం చేసుకోవలసి ఉంది. ఇది ఈ శ్లోకానికి సంబంధించినది కాబట్టి, తప్పక పరిశీలించాలి. మొదటి ఆవరణము. శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందువు. దీనికే సర్వానందమయ చక్రం అని సంకేతం. అదిష్ఠాన దేవత శ్రీత్రిపురసుందరీ దేవి. అయ్యవారు కామేశ్వరుడు. ఇద్దరినీ కలిపి కామేశ్వరీకామేశ్వరులని పిలుస్తారు. సుధాసింధోర్మధ్యే అనే శ్లోకంలో ప్రస్తుతించబడిన తల్లి ఈమెయే. దీనికే ఓఢ్యాణపీఠం అని పేరు. ఇక్కడ యోగినీదేవి పేరు పరాపరరహస్యయోగిని. రెండవ ఆవరణము త్రికోణం. ఇది మొదటి ఆవరణం ఐన బిందువును చుట్టి ఉంటుంది. బిందువే సత్వరజస్తమోగుణాలనే మూడు గుణాలని స్వీకరించి త్రికోణం అయ్యింది. ఇది సర్వసిధ్ధిప్రద చక్రం అని పేరుకలది. స్థూలంగా, కొంత సాంకేతికాంశాలు విడిచి చెప్పితే ఈ త్రికోణంలోని బిందువులు త్రిమూర్తులకూ వారిదేవేరులకూ అధిష్ఠాన స్థానాలు. వీటినే వాగ్భవ, పూర్ణగిరి, జాలంధరపీఠాలని చెబుతారు. ఈ చక్రంలో ఉన్న యోగినికి అతిరహస్యయోగిని అని పేరు. మూడవ ఆవరణం అష్టకోణం. అంటే మధ్యస్థ త్రికోణాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది త్రికోణాల వలయం. దీనికి సర్వరోగహరచక్రం అని పేరు. ఇక్కడ ఉండే దేవతలు ఎనిమంది పేర్లూ వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలా, అరుణా, జయినీ, కౌళినీ, సర్వేశ్వరీ అనేవి. వీళ్ళనే స్థూలంగా కలేసి వశిన్యాదులు అని చెబుతూ ఉంటారు. ఈ ఎనిమిది త్రికోణాలూ ఎనిమిది ప్రకృతులకు సంకేతస్థావరాలు. పంచభూతాలు, మనస్సు, బుధ్ధీ, అహంకారమూ అనే ఎనిమిది ప్రకృతులే ఈ ఆవరణంలో ఉన్న ఎనిమిది మూల ప్రకృతులూ. "భూమిరాపోనలోవాయుః ఖంమనో బుధ్ధిరేవ చ అహంకార ఇతీహ్యం మే భిన్నాః ప్రకృతి రష్టధాః" అని ప్రసిధ్ధంగా భగవద్గీతల్లోనూ ఉంది కదా. అవన్న మాట. ఐతే, శ్రీశంకరులు ఇక్కడ వశిన్యాద్యాభిః అని చెప్పినది ఈ ఎనిమిదిమంది దేవతలను గురించి మాత్రమే కాదు. మరికొంత విషయం ఉంది. ఇక్కడ ఉన్న యోగినులు రహస్యయోగినులు చక్రేశ్వరి, త్రిపురసిధ్ధాంబ అనే వారు. నాలుగవ ఆవరణం అంతర్దశారం అని పిలువబడే పది త్రికోణాల వలయం. ఇది అష్టత్రికోణ వలయానికి ఆనుకుని ఉన్న మొదటి త్రికోణ వలయం. దీనికి సర్వరక్షాకర చక్రం అని పేరు. ఇక్కడ పదిమంది దేవతలు అధిష్ఠించి ఉన్నారు. వారి పేర్లు సర్వజ్ఞా, సర్వశక్తీ, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశీనీ, సర్వాధారస్వరూపా, సర్వపాపహరీ, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదా. మూలప్రకృతి యొక్క విషయములూ, వృత్తులే ఈ సర్వజ్ఞాది దేవతాస్వరూపాలు. ఇక్కడ యోగినులు దేవతాగర్భములు. ఐదవ ఆవరణం అంతర్దశారానికి పైన ఉన్న బహిర్దశారం. దీనికి సర్వార్థసాధక చక్రం అని పేరు. ఇక్కడ ఉన్న దేవతల పేర్లు సర్వసిధ్ధిప్రదా, సర్వసంపత్ప్రదా, సర్వప్రియంకరి, సర్వమంగళకరీ, సర్వకామప్రదా, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్నవారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ. ఇక్కడ యోగినులు కులోత్తీర్ణ యోగినులు. ఆరవ ఆవరణం చతుర్దశారం. ఇది అన్ని త్రికోణాల వలయాల్లోనూ పైది. ఇక్కడ పదునాలుగు త్రికోణాలున్నాయి. సర్వసౌభాగ్యచక్రం అని దీనికి పేరు. దీని పద్నాలుగు త్రికోణాలు పద్నాలుగు లోకాలకు ప్రతీకలు. ఇక్కడ ఉండే దేవతలు పదునాలుగు మంది పేర్లూ సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వాహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వవిజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధినీ, సర్వసంపత్పూరణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ అని. ఇక్కడ వీరే యోగినులు -వీరినే సంప్రదాయ యోగినులు అంటారు. ఏడవ ఆవరణం అష్టదళపద్మం. దీనికి సర్వసంక్షోభిణీ చక్రం అని పేరు. ఇక్కడ ఎనిమిది మంది దేవతలున్నారు. వీళ్ళ పేర్లు అనంగకుసుమా, అనంగమేఖలా, అనంగమదనా, అనంగమదానాతురా, అనంగరేఖా, అనంగవేగినీ, అనంగాంకుశా, అనంగమాలినీ అని. ఎనిమిదవ ఆవరణం షోడశదళ పద్మం అంటే పదహారురేకుల పద్మం. దీనికి సర్వాశా పరిపూరక చక్రం అని పేరు. ఇక్కడ పదహారుమంది దేవతలున్నారు. వీళ్ళ పేర్లు కామాకర్షిణీ, బుధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ అని. వీళ్ళనే కర్షిణ్యాదులు అంటారు. ఇక్కడ వీరికే గుప్తయోగినులనే వ్యవహారం. తొమ్మిదవ ఆవరణం లోపలి వెలుపలి భూపురాలు. ఇందులో లోపలి భూపురానికి మూడు భాగాలు. మొదటిది శుక్ల (తెల్లని) వర్ణం. ఇక్కడి శక్తిదేవతలైన వామా, జ్యేష్ఠా, రౌద్రీ, అంబికా, పశ్యంతీ, ఇఛ్ఛా, జ్ఞానా, క్రియా, శాంతా అనే వారూ, వీరితో పాటు సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశా, సర్వఖేచరీ, సర్వబీజా, సర్వయోనీ అనే నవముద్రాదేవతలూ ఉన్నారు. మధ్యభూపురం రక్త(ఎర్రని) వర్ణం కలది. ఇక్కడ బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండా మహాలక్ష్మీ అనే మాతృకాదేవతలు ఉన్నారు. తృతీయభూపురం పీత (పసుపు) వర్ణం కలది. ఇక్కడ సప్తకోటి మంత్రాధిష్టానదేవతలు ఉన్నారు. సమిష్ఠి భూపురం చతురస్రాకారంలో ఉంది కదా అన్నింటికన్నా పైన. దీనికి త్రైలోక్యమోహన చక్రం అని పేరు. ఇక్కడ దేవతల అష్టసిధ్ధిప్రదాయికలు అంటే అణిమాసిధ్ధి, లఘిమాసిధ్ధి, మహిమాసిధ్ధి, ఈశత్వసిధ్ధి, వశిత్వసిధ్ది, ప్రాకామ్యసిధ్ది, గరిమాసిధ్ధి, ప్రాప్తిసిధ్ది అనే వారు. వీరినే ప్రకటయోగినులు అని కూడా అంటారు. ఇలా శ్రీచక్రం యొక్క ఆవరణలన్నీ దేవీ మూర్తులకు నిలయాలు.శ్రీ శంకరులు ఈశ్లోకంలో వశిన్యాద్యాభిః అన్నది అందరినీ కలిపి స్మరించటం కోసం అన్నమాట. ఐతే ఆచార్యులవారు వశినీ మొదలైన దేవతామూర్తులనే స్మరించారా, వివిధయోగినులనూ స్మరించారా అన్నది సందిగ్ధంగా అనిపించవచ్చును. అన్నిరకాల శక్తిమూర్తులనూ స్మరించారని చెప్పుకోవటమే సమంజసం. ఈ విధంగా మనం వశిన్యాద్యాభిః అంటే ఏమి తెలియజేస్తోందో తెలుసుకున్నాం కదా. కాని, కొద్దిగా విస్తారమైనట్లు అనిపిస్తోంది. మన్నించాలి. నిజానికి విషయం అంతా బాగా క్లుప్తీకరిస్తేనే పరిస్థితి ఇది. ఐతే సారస్వత ధ్యానంలో ఇదంతా దేనికి అన్న అనుమానం రావచ్చును. దానికి సంబంధించిన వివరాలు మనం వచ్చే టపాలో చదువుకుందాం. |
12, అక్టోబర్ 2014, ఆదివారం
సౌందర్యలహరి - 17 సవిత్రీభిర్వాచాం .....
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
17
సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః
శ్రీశంకరులు చేస్తున్న వాగ్భవకూట ప్రశస్తికి సంబంధించిన శ్లోకాలు చదువుతున్నాం కదా. వాటిలో ఇది మూడవదీ చివరిదీ ఐన శ్లోకం.
జనని అన్న మాటకు అర్థం మనకు తెలుసు కదా, శంకరాచార్యులు అమ్మని జనని అని సంబోధిస్తూ ఇలా చెబుతున్నారు..
సవిత్రీభిః వాచామ్ అంటే వాక్కు అనేదానికి నీవే తల్లివి. సవిత్రి అంటే స్రవించేది అని వాచ్యార్థం. జన్మింపజేసేది అనే అర్థంలో ప్రసిధ్ధంగా వాడతారు. కాబట్టి తల్లి అని అర్థం. ఈ స్రవణము అనే ధాతువు నుండే ప్రసవము అనే పదమూ వచ్చింది. అంటే ఇక్కడ శ్రీశంకరులు అమ్మ శ్రీదేవియే వాక్కు అనే దానికి మూల కారణం ఐన తల్లి అని చెబుతున్నారు మనకి.
అలాగే అమ్మను శశిమణిశిలాభంగరుచిభిః అని కూడా సంబోధిస్తున్నారు. శశిమణి అంటే చంద్రకాంత శిల. ఈ చంద్రకాంత శిలల గురించి రెండు విశేషాలు. మొదటిది ఈ శిలలు వెన్నెలకాంతికి చెమ్మగిల్లుతాయి. రెండవది ఈ శిలలు అతి నిర్మలంగా మిక్కిలి తెల్లగా ఉంటాయి. ఇక్కడ రుచి అంటే వాటి కాంతిని గురించి చెబుతున్నారు కాబట్టి శ్రీశంకరులు అమ్మయొక్క శరీరవర్ణం ఎంత ధవళంగా ఉందీ అంటే చంద్రకాంత శిలల యొక్క ప్రకాశంలా ఉందీ అని చెబుతూ అభంగ రుచి అన్నారు కాబట్టి ఎక్కడా వంక బెట్టటానికి వీల్లేని స్వచ్చమైన తెలుపు అంటున్నారు. అర్థమైనది కదా.
వశిన్యాదాభ్యాః త్వాం సంచింతయతి యః అని చెబుతున్నారు రెండవపాదంలో. ఈ పాదానికి చాలా విస్తృతమైన వ్యాఖ్య అవసరం అవుతుంది. వివరాల్లోనికి తరువాత వెడదాం. ప్రస్తుతాని అర్థం చూదాం. వశిన్యాదులు అంటే వశిని మొదలైన దేవతలు. వీళ్ళు శ్రీచక్రదేవతలు. ఈ దేవతలతో సహా యః అంటే ఎవడైతే త్వాం అంటే నిన్ను సంచింతయతి అనగా చక్కగా ధ్యానిస్తున్నాడో, అని ప్రస్తావించి అటువంటి వాడికి కలిగే ఫలాన్ని చెప్పబోతున్నారు. శ్రీచక్రంలో అమ్మవారి పరివారదేవతలు వశినీ మొదలైనవారు. ఈ దేవతలు అమ్మవారిని పరివేష్టించి అంటే చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటారు. అలా వారితో కూడిన అమ్మను ధ్యానం చేయాలటం. వట్టి ధ్యానం కాదని చెప్పటానికే సంచింతనం అని చెప్పారు. ఇక్కడ సం అనే ఉపసర్గ ద్వారా చక్కగా చింతనం అనగా ధ్యానం సూచించారు. సరే చివరి రెండు పాదాల్లోనూ అటువంటి వాడికి సంబంధించిన అదృష్టాన్ని వర్ణిస్తున్నారు చూడండి.
వాగ్దేవి అంటే మనకు తెలుసు కదా. సరస్వతి అని. వాగ్దేవీ వదనకమలం అంటే పద్మం వలె ఉన్న సరస్వతీదేవి యొక్క ముఖము అని అర్థం. అముఖం యొక్క అమోదమధురైః అంటే అటువంటి తల్లి చిరునవ్వులు, దయాదృష్టి అనే వాటి యొక్క మధురమైన అనుభూతిని పొందటం జరిగి అదృష్టవంతుడవుతాడట. ఆ అదృష్టం కారణంగా అతడు ఏమి చేస్తున్నాడయ్యా అంటే
వచోభిః మహతాం భంగిరుచిభిః అంటే గొప్పగొప్ప కాళిదాసాది కవులవలే అనేకరకాల వైభవం కల వాక్కులు కలిగినవాడు అవుతున్నాడట. కాడా మరి? సరస్వతియే కదా చదువులన్నింటికీ తల్లి!
సరిసరి. అంత గొప్ప అదృష్టం పట్టిన వాడు ఊరికే ఉంటాడా? ఉండడు కదా! అందుచేత అటువంటి వాడు ఏం చేస్తాడయ్యా అంటే సః కావ్యానాం కర్తా భవతి అంటే వాడు కావ్యాలకు కర్త అవుతాడు. కావ్యకర్త అంటే కావ్యాలు వ్రాసిన వాడు అని వేరే చెప్పాలా. ఈ శ్లోకంలో వశిన్యాద్యాభిః అన్నది చాలా కీలకమైన పదప్రయోగం. దీన్ని గురించి వచ్చే టపాలో వ్రాస్తాను. |
11, అక్టోబర్ 2014, శనివారం
సౌందర్యలహరి - 16 కవీంద్రాణాం చేతః .....
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
16
కవీంద్రాణాం చేతఃకమలవనబాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్
విరించిప్రేయస్యా స్తరుణతర శృంగారలహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీ
గత శ్లోకం శరజ్యోత్సా శుధ్ధాం అనే దానిలో సరస్వతీప్రార్థనం చేసారు ఆచార్యుల వారు. అది శుక్లవర్ణాత్మిక మైన సాత్వికధ్యానం. ఇప్పుడు అరుణవర్ణాత్మిక మైన రాజసధ్యానంతో మరొక సరస్వతీ సంబంధమైన ధ్యానశ్లోకాన్ని చెబుతున్నారు.
అమ్మా శ్రీదేవీ నీవే సరస్వతివి. నీవు కవీంద్రాణాం అనగా గొప్పగొప్ప కవుల యొక్క చేతః కమలవనః అనగా మనస్సులనే తామరపూల తోటలకు బాల + ఆతపః అంటే లేత ఎండ అనగా ఉదయపు టెండ వంటి రుచిమ్ అంటే ప్రకాశానివి. ఉదయిస్తున్న సూర్యుడికి అరుణుడు అని పేరు. ఎందుకంటే ఉదయించే సూర్యబింబం ఎర్రగా ఉంటుంది కదా అందుకని. ఏ విధంగా లేత సూర్యుడి ఎర్రని అందమైన కిరణాలు తామరపూలతోట లన్నింటినీ వికసించేటట్లుగా చేస్తుంటాయో అదే విధంగా బాలసూర్యుడి తేజస్సు వలె అరుణామేవ అంటేఎర్రగానే ఉన్న నీ తనుకాంతి దయతో కవీశ్వరుల మనః పద్మాలని వికసింపజేస్తున్నది అని చెప్పటం అన్నమాట. అంత గొప్ప విశేషమైన అరుణ వర్ణం కలిగిన నిన్ను యే కతిచిత్ అంటే కొందరు మాత్రమే ఐన సంతః అంటే ఉత్తములు భజంతే అంటే శ్రధ్ధతో సేవిస్తున్నారో అని ప్రస్తావించి, అటువంటి మహాత్ములకు పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు శ్లోకం ఉత్తరార్థంలో (అంటే రెండవ సగంలో) విరించిః ప్రేయస్యాః అన్న దానికి అర్థం సులభమే ఈ రెండు మాటలూ జనం వాడుకలో ఉన్నవే. విరించి అంటే బ్రహ్మగారు. ఆయన ప్రేయసి అనగా భార్య సరస్వతి. సరస్వతిని శ్మరిస్తున్నారు శ్రీశంకరులు. తరుణం అంటే యౌవనప్రాయం. తరుణతరం అని చెప్పారు కాబట్టి అది మిక్కిలి యౌవనం అనగా నవయౌవనం అన్నమాట. శృంగారలహరీ అన్నదానిలో లహరి అంటే ప్రవాహం. కాబట్టి తరుణతరశృంగారలహరీ అంటే నవయౌవన వికాసం యొక్క శృంగారభావ ప్రవాహం అని అర్థం, ఈ సమాసాన్ని తీసుకొని వెళ్ళి విరించి ప్రేయస్యా అని సరస్వతిని సంభావించి చెప్పారు. సరస్వతి యొక్కస్వరూపం యేమిటీ అది వాక్కు కదా. ఇక్కడ దానినే గ్రహిస్తే అర్థం ఎలా వస్తున్నదీ? ఎంతో కోమలమూ మహావిలాసవంతమైన నానాలంకారవిశేష సమన్వితమూ అత్యంత మనోహరమూ ఐన వాక్కు అని అర్థం వస్తుంది కదా? దానిని మనబోటి వారిని దృష్టిలో ఉంచుకొని కాబోలు స్పష్టీకరిస్తున్నారు. ఏమని గభీరాభిః వాగ్భిః అని అంటె అత్యంత గంభీరము ఐన వాక్కు అని. వాక్కు యొక్క గాంభీర్యం దానికి గల విశిష్టమైన గుణాలను బట్టి వస్తుంది కదా. ఇక్కడ మరలా తరుణతర శృంగారలహరీ అని అనగా రసరాట్టు ఐన శృంగారంతో కూడిన సెలయేటిప్రవాహం వంటి వాక్కు అని అర్థం చేసుకోవాలి మనం. అటువంటి వాక్కు ఎవరికి సంక్రమిస్తున్నదీ అంటే అలా ఏ సంతః భజంతే అని చెప్పారు కదా వారికి అన్నమాట. ఎత్తుగడలోనే ఈ శ్లోకంలో కవీంద్రులని ప్రస్తావించారు కాబట్టి ఈ సతాం అనగా సత్పురుషులు అంతా కవీంద్రులు అవుతున్నారన్న మాట చెబుతున్నారు. అటువంటి వాగ్భిః అనగా వాక్కులని ఈ సతాం అనగా సత్పురుషులు విధదతి అనగా వెలువరిస్తున్నారు అని చెప్పటం బట్టి వీళ్ళంతా గొప్పగొప్ప కావ్యాలు చేస్తున్నారని ప్రశంసిస్తున్నారన్న మాట.
కొంతమంది అమ్మవారిని అరుణ అనే రూపంలో ధ్యానిస్తారు.
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్
అని కదా శ్రీలలితాంబికా సహస్రనామస్తోత్రంలో ధ్యానశ్లోకం.
ఈ శ్లోకం కూడా దేవీ వాగ్భవకూటాన్ని గురించి చెప్పిన శ్లోకమే.
ఈ శ్లోకానికి నలభై ఒక్క రోజులు రోజూ వేయిసార్లు చొప్పున పారాయణం. నైవేద్యం తేనె. ఫలం విద్యాగరిమ, వాక్పటిమ, కవిత్వశక్తులు.
|
10, అక్టోబర్ 2014, శుక్రవారం
సౌందర్యలహరి - 15 (కొనసాగింపు)
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
ఈ 15వ శ్లోకం గురించి ఇప్పటికి దాని వాచ్యార్థాన్ని వివరించటం జరిగింది. కొన్ని కొన్ని అవసరమైన సాంకేతికమైన అంశాలను గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం.
ఈ శ్లోకంలో ప్రస్తావించినదాన్ని సారస్వత ప్రయోగం అని అంటారు. అమ్మవారి పంచదశాక్షరీ మంత్రంలో మొదటి ఖండాన్ని వాగ్భవ కూటం అంటారు. ఈ వాగ్భవ కూట స్వరూపిణిగా అమ్మవారిని ధ్యానించటానికే సారస్వతం అని పేరు. ఈ సారస్వతస్వరూపాన్ని ధ్యానించి మ్రొక్కిన వారికి, వారి సమర్థతతో సంబంధం లేకుండా, అత్యంత మధురమైన కవిత్వాన్ని చెప్పగలిగే సామర్థ్యాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది. దానికి విలోమంగా కూడా చెప్పవచ్చు. అది ఎలాగంటే, ఎంత సమర్థుడైనా సరే, అమ్మ యొక్క సారస్వతస్వరూపాన్ని అనుసంధానం చేయని వారికి -అంటే ముఖ్యంగా దాని పట్ల చులకన భావమో, నిరసన భావమో ఉన్నవారికి - ఎంత చదివినా, ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కించిత్తుగా నైనా కవిత్వం చెప్పగల భాగ్యం అన్నది కలగనే కలగదు అని. వేదత్రయి యొక్క ప్రథమాక్షర సంపుటీకరణమే ఐం బీజం. ఇదే వాగ్బీజం అని చెప్పబడుతుంది. ముందుగా త్రయీ అన్న పదం యొక్క నిర్వచనం చూదాం. వేదములకు త్రయీ అని పేరు. ఈ త్రయీ అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనేవి. ఇంకొక రకంగా కూడా వేదానికి త్రయీ అన్న పేరు ఉంది. వేదం అనేది సంహితలు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులూ అని మూడు విభాగాలు కాబట్టి వేదానికి త్రయీ అని పేరు అని. ప్రధానం సంహితలు, సంహితల నుండి బ్రాహ్మణములు, వాటి నుండి ఉపనిషత్తులు ఇలాగు వాటి క్రమం. మొదట వేదసారస్వతం అంతా సంహితలే. అంటే ఇవన్నీ మంత్రభాగాలు. ఋషులు భగవంతుని సంకల్పం చేత దర్శించి ద్రష్టలై వీటిని గ్రహించి కూర్చినవి. బ్రాహ్మణములు సంహితలకు వ్యాఖ్యాన రూపమైనవి. యజ్ఞయాగాదుల స్వరూపాలూ అనేక కర్మలయొక్క నిర్వహణా విధులూ వీటిలో ఉంటాయి. ఉపనిషత్తులు కేవలం జ్ఞానసంబంధమైన విషయాలను వివరిస్తాయి. ప్రసిధ్ధమైన వేదవిభాగాలే ఐన ఆరణ్యకాలు బ్రాహ్మణాలతో పాటే గణించబడతాయి అవి కూడా కర్మలకు సంబంధించినవే కాబట్టి. ఇలా వేదసంపుటికి త్రయీ అన్న సార్థకనామం ఉన్నది. ఇక్కడ వాగ్భవబీజం విషయంలో మూడువేదాల ప్రథమాక్షరాలు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల ప్రథమాక్షరాలని సులభంగానే పోల్చుకోవచ్చును. ఈ ప్రథమాక్షరాల సంపుటి ఐ. అక్షరానికి బిందువు చేరితేనే అది బీజాక్షరం అవుతుంది, కాబట్టి ఐం అనేది బీజాక్షరం. వేదాలు విజ్ఞానం యొక్క పారమ్యం కాబట్తి ఈ ఐం అనేది వాక్-భవ అంటే వాగ్భవ బీజం. ఈ బీజాన్ని ఉపాసన చేసిన దానికి ఫలితాలు సర్వవిద్యలలోనూ పాండిత్యమూ, అతిమధురమైన కవిత్వం చెప్పే శక్తీ అన్నవి. ఈ ఐం బీజమే మహాకాళీ బీజంగా దుర్గా నవాక్షరిలో ఉంది. కాళిదాసు ఈ ఐం బీజాన్ని సేవించటం వలననే అతని పూర్వసామర్థ్యంతో సంబంధం లేకుందా తక్షణమే దివ్యమైన విద్యావైభవాన్ని అతి మహత్తరమూ అత్యంత మధురమూ ఐన కవిత్వం చెప్పే శక్తినీ సంపాదించ గలిగాడు. కవికులానికే ఆయన గురువు అనిపించుకున్నాడు కూడా. ఇక్కడ అమ్మవారికి నాలుగు హస్తాలలోనూ ఉన్నవి పురుషార్థ ప్రదాయకాలు. వరముద్ర వాంఛితార్థం ఇచ్చేందుకూ, అభయముద్ర జననమరణాలనే నిత్యభయాలను తొలగించేందుకూ, జపమాల అన్నది తపస్సుకు తానే ఫలితార్థం అన్నది సూచించటానికీ, పుస్తకం సర్వవిద్యలకు తానే ఆలవాలం అని చెప్పటానికీ గుర్తులు. ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున 41రోజులు పారాయణ. నైవేద్యంగా తేనె, అరటిపండ్లు, చక్కెర. పారాయణఫలం విజ్ఞానప్రాప్తి, కవిత్వశక్తి. |
సౌందర్యలహరి - 15 శరజ్జ్యోత్స్నాశుద్ధాం ....
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
15
శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటముకుటాం
వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరామ్ సకృన్నత్వాం నత్వా కథమివ సతాం సంన్నిదధతే మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః కణితయః
ఇంతదాకా శ్రీశంకరులు అమ్మ శ్రీదేవి యొక్క చరణారవిందాల మహిమను కీర్తించారు. మూడవశ్లోకమైన త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః అనే దాని నుండి గత పదునాల్గవ శ్లోకం ఐన క్షితౌ షట్పంచాశద్ .... ... .... తవ పాదాంబుజయుగమ్ అనే దాని వరకూ. ఒక్క సారి ఆ శ్లోకాలను సింహావలోకనం చేసుకోండి.
ఇప్పుడు కూటత్రయ ధ్యానం గురించి శ్లోకాలను అందిస్తున్నారు మనకి.
ప్రప్రథమంగా సరస్వతీ ధ్యానం చేస్తున్నారు.
శరజ్జ్యోత్స్నాశుధ్ధామ్ అన్న సమాసంలో శరత్తు, జ్యోత్స, శుధ్ధ అనే పదాలున్నాయి. శరత్తు అంటే శరదృతువు. ఇక్కడ జ్యోత్స్న అని చెప్పబడుతున్న వెలుగు వెన్నెల. శరత్కాలంలో, ఆకాశంలో మబ్బులన్నీ తొలగిపోయి, అ వెన్నెల పరమ శోభాయమానంగా ఉంటుంది. అందుకే ఆ అవెలుగును శుధ్ధా అనగా ఏ కొరతా లేక పరమాహ్లాదకరంగా తెల్లగా ఉన్నది అని చెప్పుతున్నారు. తెలుగులో ఒక నానుడి ఉంది కదా పిండి ఆరబోసినట్లుగా ఉంది వెన్నెల అని. అసలు ఎప్పుడైనా వెన్నల అన్న పదాన్ని విడదీసి చూసారా? వెల + నెల -> వెన్నెల. వెల అనగా తెల్లని నెల అనగా కాంతి. ఈ వెన్నెల అన్నదే తెల్లనిది ఐనప్పుడు అది శుధ్ధంగా ఉన్నదీ అనటంలో అభిప్రాయం దానికి ఏ మబ్బుల మరకల అడ్డూ మసకబార్చటమూ లేదు, చంద్రుడికి ఏ కొంచెమో కళలు తక్కువై వెన్నెల కాంతి అసంపూర్ణంగా ఉండటమూ లేదు అని వెప్పటం. అంటే, పిండితార్థం శరత్పూర్ణిమ నాటి మిక్కిలి మనోహరమైన వెన్నల కాంతిని ప్రస్తావించటం చేస్తున్నారన్న మాట. ఇదిగో ఈ శరజ్జ్యోత్స్నాశుధ్ధా అని అమ్మవారిని సంబోధిస్తున్నారు ఈ శ్లోకంలో. ఇలా శ్రీశంకరులు సరస్వతీ స్వరూపం వర్ణిస్తున్నారు అన్నమాట గ్రహించాలి మనం.
ఆ పైన శశియుత జటాజూట మకుటాం అన్నారు. శశి అంటే చంద్రుడు. శశియుత అంటే చంద్రుడిని కలిగియున్నది. ఏది? జటాజూటం అంటే శోరోజాల ముడి అన్న మాట. అదే మకుటం అంటే కిరీటంగా ఉందీ అని చెబుతున్నారు. అమ్మవారి తలకట్టుమీద చంద్రవంక ఉన్నది అని గ్రహింపు కావాలి మనకు.
ఇక వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరామ్. మధ్యలో విరామాలు ఇచ్చి వ్రాసాను కానీ అలా వ్రాయటం సంప్రదాయమే కాదు. ఇదంతా ఒకే సమాసం! త్రాసము అంటే భయము. త్రాణము అంటే రక్షణ. వరము అంటే తెలిసిందే కదా. వరత్రాసత్రాణ అన్నదానికి వరముద్రా అభయముద్రా అన్నవి సూచించటం ప్రయోజనం. ఇలా అమ్మవారు ఈ వర, అభయ ముద్రల్ని దాల్చి ఉంది అని చెబుతున్నారు. స్ఫటిక శబ్దం చేత అమ్మవారి ఒక చేతిలో స్ఫటికమాల ఉన్నది అని సూచిస్తున్నారు. ఇక మిగిలిన పదం పుస్తకం అన్నది సులభగ్రాహ్యమైన అర్థం కలదే. ఇలా అమ్మవారు రెండు చేతులతో వరముద్రా, అభయముద్రా పట్టి ఉంటారనీ, మరొక రెండు చేతుల్లో అక్షమాలా, పుస్తకాలు ఉన్నాయనీ ఈ పాదంలో అమ్మవారి నాలుగు చేతులనూ వర్ణించారు శ్రీశంకరులు.
ఈ అమ్మవారి మహిమను వర్ణనం చేస్తున్నారు మిగిలిన రెండు శ్లోకపాదాల్లోనూ. ఏలాగో చూదాం.
అమ్మా అటువంటి దివ్యస్వరూపం కలిగిన త్వామ్ అనగా నిన్ను , సకృత్ నత్వా అంటే ఏదో రకంగా కష్టపడి ప్రార్థన చేసిన సతాం అనగా కవులకి ఎంత గొప్ప అదృష్టం పడుతుందో కదా అని అంటున్నారు. ఏమిటట ఆ అదృష్టం?
చివరిపాదంలో చెబుతున్నారు ఆ అదృష్టం ఏమిటో, మధు క్షీర ద్రాక్షా అంటే తేనె, పాలు, ద్రాక్షరసం వంటి అమృతసమానం ఐన తీయదనం కలిగిన ఫణితయః అంటే మాటల తీరులలో (కవిత్వం అని అర్థం) ధురీణ అనగా పాండిత్యం కధమివ అనగా ఏవిధంగా న సన్నిదధతే అబ్బకుండా పోతుందీ అని అంటున్నారు శ్రీశంకరులు.
ఈశ్లోకంలో శ్రీశంకరులు నిష్కర్ష చేస్తున్నది ఏమిటంటే శరత్పౌర్ణిమ నాటి అందమైన తెల్లని శరీరఛ్ఛాయకలిగి, వరద అభయ ముద్రలూ, స్ఫటికమాలా, పుస్తకాలూ ధరించిన సరస్వతీ అమ్మవారిని ఎలాగో అలా చచ్చీ చెడీ కష్టపడి ఒక్కసారి అయినా సరే ప్రార్థించిన కవులకు అద్భుతమైన కవిత్వ శక్తి వస్తుంది అని. ఆ కవిత్వంఎంత మధురం అంటే ద్రాక్షరసం, తేనె, పాల వలే మిక్కిలి రుచికరమైనదీ మధురమైనదై ఉంటుందీ అని.
అమ్మవారు మిక్కిలి దయామయి కాబట్టి అలా ఒక్కసారి మనస్ఫూర్తిగా మ్రొక్కినా సరే అటువంటి దివ్యకవిత్వశక్తి రాకుండా ఎలా ఉంటుందీ అని శ్రీశంకరుల తాత్పర్యం
ఈ శ్లోక వ్యాఖ్యను కూడా ఇంకా కొంచెం కొనసాగించ వలసి ఉంది. అది తదుపరి టపాలో చూదాం. ఈ 15వ శ్లోకం కొనసాగింపును ఇక్కడ చదవండి |
9, అక్టోబర్ 2014, గురువారం
సౌందర్యలహరి - 14 (కొనసాగింపు)
(కొనసాగింపు)
పాఠకులు గమనించే ఉంటారు. శ్రీశంకరులు విరచించిన సౌందర్యలహరీ స్తోత్రాన్ని గురించి శ్రీవిద్యా సంబంధమైన సాంకేతిక విషయాల ప్రసక్తి లేకుండా వ్యాఖ్యానించటమూ అవన్నీ పరిహరించి అతిసూక్ష్మంగా చెప్పినా శ్లోకాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవటమూ అసాధ్యం ఐన విషయాలు. అందు చేత సాంకేతిక విషయాలను వీలైనంత సరళంగా లఘువుగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. అవసరం పడిన చోట్ల అదనపు వివరాలు జోడించటం తప్పని సరి కాబట్టి ఇక్కడ కొంచెం లఘువుగా కొన్ని కొన్ని సాంకేతిక విషయాలను ముచ్చటిస్తాను.
తరచుగా షట్చక్రాలని (ఆరు చక్రాలు) ప్రస్తావిస్తున్నాము. వీటిని గురించి మరికొంచెం తెలుసుకోవటం ప్రయోజనకారిగా ఉంటుంది చదువరులకు.
చక్రం అనేది ఒక పారిభాషికపదం అంటే ఆంగ్లలో టెక్నికల్ టర్మ్ అన్నమాట. ఇలా చక్రం అని చెప్పినంత మాత్రన ఏ చక్రమైనా నిజంగా గుండ్రటి బిళ్ళ ఆకారంలో అంచున వాడియైన పళ్ళతో ఉంటుంది అనుకోకూడదు. ఉదాహరణకు ఆజ్ఞాచక్రం రెండు ఆకుల రెమ్మ వంటిది. అన్నట్లు శ్రీచక్రం అనేది బయటికి ఒక నాలుగు గుమ్మాల ప్రహారీ గోడతో కూడిన దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉన్న కట్టడంలా కనిపిస్తున్నది కదా. ఇలా చక్రం అనేది ఆకార సూచకం కాదు అన్నది మొదట గ్రహించవలసిన విషయం.
మరొక ముఖ్య విషయం ఉంది. ఈ చక్రాలుగా చెప్పబడ్డవి ఏవీ కూడా శరీరంలో నిజంగా కళ్ళకి కనబడే వస్తువులు కావు. ఇవి కేవలం శక్తి కేంద్రాలు అన్నమాట. వాస్తవజగత్తులో కూడా అనేక శక్తిస్వరూపాలను చూస్తున్నాం. వాటిని అవి చూపే ప్రభావాల ఆధారంగానే గుర్తిస్తున్నాం కాని అవేవీ కళ్ళకు కనబడే రూపాలతో ఉండవు కదా. పూర్వం సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు ఇలా షట్చక్రాలను గురించి చెబుతుంటే విన్న ఒక వ్యక్తి ఇంటికి పోయి భార్యను ముక్కముక్కలుగా నరికి వెదికి ఆ చక్రాలేవీ కనబడకపోయే సరికి ఘొల్లుమన్నాడట.
మానవశరీరంలో ఈ ఆరు చక్రాల స్థానాలను గురించి ఇలా చెబుతారు. ఈ శ్లోకం ప్రకారం చక్రాల స్థానాలను చెబుతూ వాటి తత్త్వాలనూ, మరికొన్ని విశేషాంశాలనూ జోడించి చెబుతాను.
మూలాధారం గుదస్థానం స్వాధిష్ఠానంతు మేహనం
నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాబ్జ మనాహతం
తాలుమూలం విశుధ్ధాఖ్యం ఆజ్ఞాంచ నిటలాంబుజం
సహస్రారం బహ్మరంధ్రం ఇత్యాగమ విదో విదుః
మూలాధారచక్రం యొక్క స్థానం అసనం. మనిషి కూర్చుంటే శరీరం నేలకు ఆనే ప్రదేశం. పంచభూతాల్లో ఒకటైన భూమి దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు సాకిని.
స్వాధిష్ఠానచక్రం యొక్క స్థానం మర్మావయవాలు ఉండే చోటు. పంచభూతాల్లో ఒకటైన అగ్ని దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు కాకిని.
మణిపూరక చక్రం యొక్క స్థానం నాభి. అంటే బొడ్డు. పంచభూతాల్లో ఒకటైన జలం దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు లాకిని.
అనాహత చక్రం యొక్క స్థానం హృదయం. పంచభూతాల్లో ఒకటైన వాయువు దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు కాకిని.
విశుధ్ధ చక్రం ఉండే చోటు కంఠం. పంచభూతాల్లో ఒకటైన ఆకాశం దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు డాకిని.
ఆజ్ఞా చక్రం ఉండే చోటు నుదురు. అక్కడ ఉండే కనుబొమ్మలు రెండింటి మధ్యస్థానం. పంచభూతాల సమాహారంగా ఏర్పడే మనస్సు దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు హాకిని.
ఈ ఆరు చక్రాలకే షట్-చక్రాలు అని పేరు. ఈ ఆరు చక్రాలలో ఉండే తత్త్వాలు పంచభూతాలూ, మనస్సూ అనేవి మొత్తం ఆరు.
ఈ ఆరు చక్రాల కన్నా ఉన్నతమైనది సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రం యొక్క స్థానం బ్రహ్మరంధ్రం. ఇది నడినెత్తి ప్రాంతం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు యాకిని.
సాకిని మొదలైన అమ్మవారి మూర్తులన్నీ అక్కడ ఉండే శక్తులకు సాంకేతిక నామాలన్నమాట గ్రహించాలి.
ముందు ముందు సౌందర్యలహరీ శ్లోకాల్లో ఈ చక్రాల ప్రసక్తులు వాటిపైన శ్లోకాలు వచ్చినప్పుడు మరిన్ని వివరాల జోలికి పోవచ్చును. ప్రస్తుతానికి ఇంత చాలు.
ప్రస్తుతం మనం చదువుకుంటున్న పదునాల్గవ శ్లోకంలో ఈ చక్రాలలో ప్రకాశించే కిరణా లను గురించి వివరించారు. అన్ని చక్రాలలోని కిరణాల మొత్తం సంఖ్య 360 అవుతోందనీ గమనించాం మనం. ఈ 360 అనేది సంవత్సరంలో ఉన్న తిథుల సంఖ్య. అమ్మవారు తిథి మండల రూపిణి కదా.
ఈ అమ్మవారి కిరణాల ప్రకాశం సాధకుడి దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది. అదీ అగ్ని, సూర్య, చంధ్ర ప్రభలతో. ఇది పిండాండం అనబడే శరీరానికి సంబంధించిన విశేషం.
అలాగే అమ్మవారి కిరణాల ప్రకాశమే కనబడే బ్రహాండాన్ని ప్రకాశింపజేస్తున్నది. పగలు సూర్యుడు, సంధ్యావేళల అగ్ని, రాత్రులలో చంద్రుడు ఈ ప్రకాశాన్ని అందిస్తున్నారు. తమేవ భాంత మనుభాతి సర్వం తస్యభాసా సర్వ మిదం విభాతి అని శ్రుతి ప్రమాణం (కఠవల్లి)
ఈ కిరణాల పంపకంలో ఒక తమాషా కనిపిస్తుంది. గత టపాలోని పట్టిక చూడండి. సూర్యఖండమూ అగ్నిఖండమూ కలగలసి ఉన్నాయి కదా. సూర్యకిరణాలు మణిపూరాన్ని వదలి స్వాధిష్ఠానాన్ని ప్రవేశించాయి. సంప్రదాయంలో సూర్యునిలో అగ్నికి అంతర్భావం అని చెబుతారు. కాబట్టి ఇక్కడ సమజసంగానే ఉందని గ్రహించాలి.
ఈ కిరణాలప్రస్తారంలో ప్రతికిరణానికీ సంప్రదాయంలో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ శ్రీవిద్యా ఉపాసకులకు తప్ప మనకి అవసరం లేదు. అలాగే ఆ కిరణాలు అసలు ఏమిటి అన్న వివరాలూ ఉన్నాయి. అవీ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు.
కాని ఒక్క విషయం మాత్రం చెబుతాను. గమనించారా? అన్ని చక్రాలకూ కిరణాలు సరిసంఖ్యలో ఉన్నాయి. దీనికి కారణం మాత్రం ప్రస్తావించుకుందాం. అందులో సగం అమ్మవారి తరపున, మరొక సగం అయ్యవారు సదాశివుడి తరపున చెప్పటం సంప్రదాయం. శక్తి పురస్సంగా పూర్వతంత్రం అనీ శివ పురస్సరంగా ఉత్తర తంత్రం అనీ చెబుతారు. ఇవన్నీ విద్యా రహస్యాలు. వాటిజోలికి మనం పోవటం లేదు.
ఇలా కిరణాలన్నీ శివశక్తి సమ్మేళనాలు. నిజానికి వారి కిరణాలు అనంతం, కాని కేవలం 360 మాత్రమే బ్రహ్మాండం అంతా ఏర్పరచి నడిపిస్తున్నాయి. పిండాండం అనేది బ్రహ్మాండం యొక్క ఒక నమూనా మాత్రమే అనీ సంప్రదాయం.
పస్తుతానికి ఈ శ్లోకానికి లఘువ్యాఖ్యను ముగించుకుందాం. ఇలా ఇంకా ఎంతైనా చెప్పవచ్చును కాని గ్రంథ విస్తృతి మంచిది కాదు కదా.
ఈ శ్లోకవ్యాఖ్యను మొత్తంగా అవసరమైతే మరొక కొన్ని సార్లు పఠించి అవగతం చేసుకోండి.
|
8, అక్టోబర్ 2014, బుధవారం
సౌందర్యలహరి - 14 క్షితౌ షట్పంచాశత్ ....
మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
14
క్షితౌ షట్పంచాశత్ ద్విసమధికపంచాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధికపంచాశదనిలే దివి ద్విష్షట్త్రింశ న్మనసి చ చతుష్షష్టిరితి యే మయూఖాస్తేషా మప్యుపరి తవ పాదాంబుజయుగమ్
ఈ శ్లోకంలో శ్రీశంకరులు అమ్మపాదయుగ్మం యొక్క దివ్యప్రభలను వర్ణిస్తున్నారు.
ఇది శ్రీవిద్యా సాంకేతికపరమైన శ్లోకం.
ఇప్పటికే మనం మానవ శరీరంలో క్రిందినుండి పైకి మూలాధారం, మణిపూరకం, స్వాధిష్ఠానం, అనాహతం, విశుధ్ధం, ఆజ్ఞ అనే ఆరుచక్రాలను గురించి గత శ్లోకాల్లో చదివి ఉన్నాం.
అలాగే ఈ చక్రాలకు భూమిరాపోనలోవాయురాది పంచభూతాలు, వాటి సమాహారమైన మనస్సూ అనేవి తత్త్వాలనీ తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో ఈ ఆరు దివ్యచక్రాలకూ వాటివాటి తత్త్వాలు ఎట్లా కలుగుతున్నాయీ అన్న విషయం తెలియ జేస్తున్నారు.
వీటిలో మూలాధారమూ స్వాధిష్ఠానమూ అనే రెండు చక్రాలనూ ఒక జంటగా ఒక ఖండం. ఈ మొదటి ఖండం పైభాగం అగ్నిస్థానం. దీన్నే రుద్రగ్రంథి అంటారు. ఇక్కడ ఉన్న అగ్ని తన జ్వాలల చేత ప్రధమఖండాన్ని వ్యాపించి ఉంటాడు.
మణిపూరక, అనాహత చక్రాల జంట రెండవఖండం. దీని పైభాగం సూర్యస్థానం. దీనినే విష్ణుగ్రంథి అంటారు. సూర్యుని వెలుగులు రెండవఖండాన్ని వ్యాపించి ఉంటాయి.
విశుధ్ధ, అజ్ఞా చక్రాల జంట చివరి ఖండం. దీని పైభాగం చంద్రస్థానం. దీనినే బ్రహ్మగ్రంథి అంటారు. ఈ చంద్రుని కిరణప్రసారం ఈ ఖండాన్ని వెలుగులతో నింపుతూ ఉంటుంది.
ఈ సూర్యచంద్రాగ్నుల జ్వాలలను గురించి భైరవాష్టకంలో
అష్టోత్తర శతం వహ్నేః షోడశోత్తర శతం రవేః
షట్త్రింశదుత్తర శతం చంద్రస్య చ వినిర్ణయః
అని చెప్పబడింది. అంటే అగ్నిజ్వాలల సంఖ్య 108. సూర్యకిరణాలసంఖ్య 116. చంద్రుడి కిరణాల సంఖ్య 136 అని అర్థం.
ఈ శ్లోకంలో ఆఖరుపాదంలో మయూఖాః అన్న పదం ఉంది చూడండి. మయూఖములు అంటే కిరణాలు.
ఈ కిరణాలు ఏ చక్రంలో ఎన్ని చొప్పున ఉన్నాయో చెబుతున్నారు ఈ సౌందర్యలహరీ శ్లోకంలో శ్రీశంకరులు.
క్షితౌ అంటే పృధివీ తత్త్వాత్మకం ఐన మూలాధారం చక్రంలో షట్ పంచాశత్ అంటే 56.
ఉదకే అంటే జలతత్త్వాత్మకం ఐన మణిపూరక చక్రంలో ద్విసమధిక పంచాశత్ అంటే 52.
ఈ 56 + 52 = 108 అగ్నికి సంబంధించిన కిరణాలు.
హుతాశే అనగా అగ్ని తత్త్వాత్మకం ఐన స్వాధిష్టాన చక్రంలో ద్వాషష్టి అంటే 62.
అనిలే అనగా వాయు తత్త్వాత్మకం ఐన అనాహత చక్రంలో చతురధిక పంచాశత్ అంటే 54.
ఈ 62 + 54 = 116 సూర్యకిరణాలు .
దివి అనగా ఆకాశతత్త్వాత్మకమైన విశుధ్ధ చక్రంలో ద్వి షట్-త్రింశత్ అంటే 2 x 36 = 72
మనసి అనగా మనస్తత్త్వాత్మక మైన ఆజ్ఞా చక్రంలో చతుష్షష్ష్టి అంటే 64
ఈ 72 + 64 = 136 చంద్రకిరణాలు.
ఒక్క సారి ఈ కిరణాల సంఖ్యను అన్ని చక్రాలలో ఉన్నవాటినీ సమాహారం చేసి చూదాం.
ఈ కిరణాల సమూహం అంతా కలిపి 56 + 62 + 52 + 54 + 72 + 64 = 360,
మరొక విధంగా అగ్ని+ సూర్య + చంద్ర కిరణాలు = 108 + 116 + 136 = 360.
ఈ శ్లోకం చివర, తేషాం అపి ఉపరి అనగా ఈ కిరణాలేవైతే ఆరు చక్రాలలోనూ ప్రకాశిస్తూ ఉన్నాయో, వాటి ఆ కిరణాలు అన్నింటికీ పైన అని అర్థం. ఈ ఆరు చక్రాలకూ పైన ఉన్నది సహస్రారకమలం కదా. దనిని స్మరిస్తున్నారన్న మాట. అక్కడ ఉన్నదమ్మా తవ పాదాంబుజ యుగమ్ అని ప్రస్తుతి చేస్తున్నారు. అంటే శ్రీశంకరులు, అమ్మా, ఈ 360 కిరణాల సముదయానికి పైన, ఆ ఆరుచక్రాలకూ పైన, సహస్రారకమలంలో ఉండే బిందు స్థానంలోనీవు ఆసీనురాలవై ఉన్నావూ, అక్కడే మాకు నీ చరణారవిందాలు దివ్యతేజస్సుతో దర్శనం ఇస్తూ ఉన్నాయీ అని కీర్తిస్తున్నారన్న మాట.
అందుచేత, తదుపరి టపాలో ఇదే శ్లోకానికి వ్యాఖ్యను కొనసాగించటం జరుగుతుంది. ఈ 14వ శ్లోకవ్యాఖ్య కొనసాగింపును ఇక్కడ చదవండి. |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)