6, మే 2016, శుక్రవారం

ఈరోజు రాలేదా సూరీడు ఠీవిగా

ఈరోజు రాలేదా
సూరీడు ఠీవిగా
తూరుపుదిక్కంతా
ధారాధరాలేనా

జడివానా కురిసేనా
తడిసేనా ఈనేలా
ఉడికించే సూరీడు
విడిచేనా ఉగ్రతనుతగుమాత్రంగా ఎండ
తగుమాత్రంగా వాన
అగణితమా సౌభాగ్యం
జగమంతా సంతోషం


చల్లని తొలిసంజ
చల్లని మలిసంజ
చల్లని వెన్నెలలు
కొల్లలైతే చాలు