12, ఆగస్టు 2016, శుక్రవారం

కష్టేఫలీ శర్మ గారిని వేధించే ప్రయత్నం తప్పు.

          ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక !
అంటూ.

ఈ ప్రయత్నం  పొరపాటు.

అందుకే, దానిపై నావ్యాఖ్యను ఈ ఉదయమే ఇలా వ్రాసాను. (వ్యాఖ్య time stamp Fri, 12 Aug 2016 04:24:19 GMT. అంటే మనసమయంలో ఉ. గం9:59ని)


ఈ ప్రయత్నం సరికాదు.
కష్టేఫలీశర్మగారు కావాలనుకుంటే తమటపాలను బ్లాగులో ఉంచలేరా? వారు ఇకచాలు వద్దు అనుకున్నారు. మధ్యలో జిలేబీగారు దూరి వారి బ్లాగుటపాలను నేను ప్రకటిస్తాను అనటం అక్రమం, అనైతికం. ఇది ఆయన్ను క్షోభపెట్టాలన్న దురుద్దేశం తప్ప మరేమీ కాదు. చాలించండి దుండగాలు.

ఇది ఇంకా మాలికలో దర్శనం ఇస్తోంది. 

 వరూధిని బ్లాగువారు నా వ్యాఖ్యను ఎందుకు తొలగించారో మరి.

ఈ విధంగా బ్లాగర్లను వేధించే ప్రయత్నాలను అందరూ త్రిప్పికొట్టాలి.

ఇలాంటి చేష్టలకు తెగబడేవాళ్ళదే పైచేయి అయ్యేపక్షంలో బ్లాగర్లు తమ బ్లాగుల్ని తొలగించటమే ఉత్తమం అనుకొనే పరిస్థితి ఏర్పడుతుంది.


21 కామెంట్‌లు:

  1. జిలేబీగారూ ! మీరు ఈ పని చేయ సంకల్పించడం తెలుగు బ్లాగర్లకు ఎవరికీ సంతృప్తి కాదు, ఆమోదం కాదు . మీరేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు ఫీల్ అవకండి .
    ఇది నిజంగా ఎదుటివారి బెడ్ రూమ్ లో దొంగతనంగా చూసి వేరేవారికి చెప్పడం అంత మహా పాపం.
    ఈ శుభదినాల్లో ఇటువంటి చెడుకార్యం చేయతలపెట్టడం మహా పాపం అని నా అభిప్రాయం ..
    వెంటనే క్షమాపణలు వేడుకుంటే మేలు !

    రిప్లయితొలగించండి
  2. అందరు ఖండించాలి ఇలాంటి అనైతిక పనులు.

    రిప్లయితొలగించండి
  3. శ్యామలీయం గారూ, మీరు వ్యాఖ్య వ్రాసిన కొద్దిసేపటికే నేను ఈ క్రింది వ్యాఖ్య వ్రాశాను "వరుధిని" బ్లాగులో.
    ----------------
    నా వ్యాఖ్య :-
    "దీనినే ఆంగ్లమున sabotage అందురు. శ్యామలీయం గారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నాను."
    ----------------
    పోస్ట్ అయినట్లుగా "వరూధిని" బ్లాగులో చూపించింది. తర్వాత కాసేపటికే కనిపించడంలేదు. "మాలిక" లో మాత్రం కనిపిస్తోంది. మీ వ్యాఖ్య, Srinivas rjy గారి వ్యాఖ్య, నా వ్యాఖ్య మూడింటి పరిస్ధితీ అదే. ఏవిటో మాయ వింతగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. విన్నకోట వారు,

    ఈ ఉదయం ఈ వ్యవహారంతో‌ మనస్సుకు అశాంతి కలిగింది. కొన్ని కారణాలవలన ఇప్పటికే ఉన్నది అశాంతి. ఈ‌ దుండగాన్ని తిలకించి చలించి మరింత చేదుతిన్నట్లుగా అయింది దాని స్థితి. ఒక గంట క్రిందట(అంటే 7:10కి) జిలేబీ గారు తమ ఘనతవహించిన టపా క్రింద వారు వ్రాసుకున్న ఈ స్వోత్కర్షను చూడండి

    "..తేనే లాంటి మన తెలుగును అంతరించిపోయే ప్రమాదం నుండి కాపాడుదాం. మన తెలుగు భాష మాధుర్యాన్ని, మన తెలుగు జాతి గొప్పదనాన్ని దశ దిశలా చాటుదాం."

    ఇలాగేనా తెలుగు పరువుమర్యాదను కాపాడేది? భాషను కాపాడేదీ? వెనుకటికి ఎవడో దొంగతనాలూ దోపిడీలూ చేస్తూ దొరికిపోయి, ఆ డబ్బుతో విద్యాలయాలు నడుపుతున్నానూ, దానధర్మాలు చేస్తున్నానూ, ప్రజాసేవా - దేశసేవా దండిగా చేస్తున్నానూ అవన్నీ ఎంతో‌మంచి పనులూ‌ ఎంతెంతో గొప్పగొప్ప పనులూ‌ అని పెద్దగా ఉపన్యసించాడట. అలాగుంది! ఇలా పెద్దవారి బ్లాగుల్ని దర్జాగా చౌర్యం చేసి మరీ తెలుగుకు సేవచేయటమా అని! కలికాలం. కలికాలం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారూ, జిలేబీ గారి ఈ కామెంట్‌లోని పదాలు మొత్తం Srinivas rjy గారి "శోధిని" సంకలినిలోని మొదటి పేజీలో (Home) కుడివైపు కనిపించే మాటలు. ఈ రోజు జిలేబీ గారు తలపెట్టిన పని కూడదని మందలిస్తూ Srinivas rjy గారు "వరూధిని" బ్లాగులోను ("మాలిక" లో మాత్రం కనిపిస్తోంది), మీ బ్లాగులోను వ్యాఖ్య వ్రాశారు కదా, ఆయనపై విసురయ్యుంటుంది బహుశః.

      తొలగించండి
  5. శ్యామలీయం గారూ ! జిలేబీగారు పైన తెలుగు భాషని గూర్చి వ్రాసిన వ్యాఖ్య "శోధిని" మొదటి పేజీలోనిది. నా కామంతుకు జవాబుగా ఆమె (అతడు ??) వ్రాసి ఉంటారని అనుకుంటున్నాను . మరి నా కామెంటు ఎందుకు తొలగించారో వారే చెప్పాలి . ఏమైనా అసభ్యంగా ఉందా ? ఈ బ్లాగులో కూడా అదే కామెంట్ ఉంది. చూసి చెప్పండి .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీగారికి తమకు తోచింది ఒప్పోతప్పో చేసేయటమే అలవాటు కాని ఎవరి అభ్యంతరాలనూ‌ ఖాతరు చేసే అలవాటు లేదని నా అభిప్రాయం.

      తొలగించండి
  6. జిలేబీ అనబడే (???) వారు కామెంట్లు ఎందుకు తొలగిస్తున్నారు ??

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి కారణం. ఆ కామెంట్లను పంపినవారు అయోగ్యులైన చిందులరాయళ్ళని జిలేబి గారి అభిప్రాయం‌ కాబట్టి.
      రెండవ కారణం. జిలేబీ గారి దృష్టిలో అవి ప్రచురణార్హత లేని, పసలేని కామెంట్లు కాబట్టి.
      మూడవ కారణం. ఆ కామెంట్లను ఉండనిస్తే వాటికి తాను సమాధానాలు వ్రాయాలి కాబట్టి.
      నాలుగవకారణం. జిలేబీ గారి రాతల్లోనూ చేతల్లోనూ అంతా విశృంఖలత్వమే కాబట్టి.

      తొలగించండి
  7. "చిందుల రాయుళ్ళు" ట. ధన్యోస్మి.
    ఈ క్రింది పద్యం "శోధిని" లో కనిపిస్తోంది ("మాలిక" కొంచెం బిగుసుకున్నట్లుంది).
    ------------------------
    వ్యాఖ్య వ్రాసిన సమయం: August 12th, 2016, 11:13pm IST వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

    మాచన వారికి నమస్సులు

    కందకు లేని దురద లీ
    చిందుల రాయుళ్లకేల చెప్పు జిలేబీ ?
    డెందము నింపెడు మాచన
    సుందర సొబగగు టపాల సొమ్మందిరిదీ

    జిలేబి
    --------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాత పెట్టి వెన్న రాసినట్లుగా ఉంది. చేస్తున్నది తప్పుడుపని ఐతే దానికి మాచన వారికి నమస్సులు అనటం ద్వారా మంచి జోడింపు సేస్తున్నారు. భలే. అంతర్జాలంలో అచ్చుపడ్డాక ఏ రచన ఐనా సరే ఊరిసొమ్ము ఐపోతుందన్న అభిప్రాయం జిలేబీ గారిది. కాని ఎన్నోసార్లు అందరమూ మొత్తుకున్నట్లుగా అసలువ్రాయసకాని అనుమతి పొందటం అవసరం‌ కదా? జిలేబీ‌గారి పద్యాలలోనే‌కాదు వారి పోకడలనిండా అవలక్షణాలైతే ఎలా వేగేదండీ?

      తొలగించండి
  8. జిలేబిగారు,
    నమస్కారం.
    నమస్కారం తెలుగు సంస్కృతికి నిదర్శనం.
    ''ఆదరణ కోల్పోతూ ఒక పల్లెటూరి భాషగా మిగిలిపోతున్న ప్రపంచ భాషలలో కెల్లా గొప్పదైన తేనే లాంటి మన తెలుగును అంతరించిపోయే ప్రమాదం నుండి కాపాడుదాం. మన తెలుగు భాష మాధుర్యాన్ని, మన తెలుగు జాతి గొప్పదనాన్ని దశ దిశలా చాటుదాం.''


    మీకు తెనుగు భాష పట్ల ఉన్న మక్కువకు ఆనందం.
    ''కందకు లేని దురద లీ
    చిందుల రాయుళ్లకేల చెప్పు జిలేబీ ?
    డెందము నింపెడు మాచన
    సుందర సొబగగు టపాల సొమ్మందిరిదీ''

    తప్పుచేస్తూ దొరికినవాడు చివరిగా మాటాడేమాట ఇదే కదూ

    నా బ్లాగు టపాలను సంస్కరించి మరల ప్రచురించడం లేదా పుస్తకరూపంలో తీసుకురావడం కోసం ప్రైవేట్ చేశా. ”నాకేదీ ఆహ్వానం, కాదు, నా కోరిక ఎందుకు మన్నించలేదనేదే” మీ మనసులోబాధ. మీరు ప్రతి విషయాన్నీ సంచలనం చేయాలనుకుంటారు, అది నాకు నచ్చదు అందుకే మీకు ఆహ్వానం పంపలేదు, మీరు బ్లాగు దర్శించడానికి కోరితే సమ్మతించలేదు.

    మీరు నా బ్లాగు టపాలు చదవక ఉండలేనట్టుగా మీ మాటలవల్ల తెలుస్తోంది, చాలా సంతసం.
    ప్రాణంబుల నెవరిచ్చెన్?
    జ్ఞానంబుల నిచ్చెనెవరు జగదంబ కదూ ?
    గానంబు మీ టపా మధు
    రానందంబుల నిలుపక వ్రాయుము యొజ్జా !

    మీకు తెనుగు భాష పట్ల ఉన్న మక్కువకీ సంతసం. అందుకుగాను నా బ్లాగును ఇప్పటివరకు ఉన్న టపాలను సంసరించి ఇచ్చేస్తా! పుస్తకం/పుస్తకాలుగా వేసుకోండి, తెనుగు పట్ల మక్కువను అలా చాటండి. ''పేకాట పేకాటే పెద్దన్నయ్య పెద్దన్నయ్యే! వ్యాపారం వ్యాపారమే!'' నా బ్లాగులో టపాలు మీకివ్వడానికి,

    ౧. మీరు ఎన్ని భాగాలుగా వేసుకుంటే అన్ని భాగాలకూ ఒక్కొక భాగానికి ౨౫౦ కాపీల వంతున ఇవ్వండి, నాకు. మిగిలిన ౭౫౦ కాపీలు అమ్ముకోండి. తరవాత ప్రచురణల్లో ౨౦౦ కాపీలివ్వండి. మొత్తానికిప్పుడు ఒక ఐదువేల రూపాయలివ్వండి.
    లేదా
    ౨.ఏక మొత్తంగా ౩౦,౦౦౦/- ఇచ్చి బ్లాగులో టపాలు స్వంతం చేసుకోండి.
    లేదా
    ౩. నాకు ౧౫౦౦౦/- రూపాయలివ్వండి, ౧౫౦ కాపీలివ్వండి ఈ ప్రచురణకి.
    లేదా
    ౪.మీకెలా లాభమో ఆలోచించుకుని చెప్పండి.
    నేనడిగినది రోజుకూలి రెండు రూపాయలు కూడా కిట్టలేదు.

    కాదు నేను ప్రచురిస్తా బ్లాగులో మళ్ళీ అంటే మీరింత నష్టం నాకు కలగజేస్తున్నట్టే! ఆలోచించండి.''మాచన వారికి నమస్సులు''
    ఉత్తి నమస్కారాలతో కడుపులు నిండవు. అందుకే మనకవులు,కళాకారులు ఇలా అయిపోతున్నారు గమనించండి.
    కాదు నేను ప్రచురిస్తానంటారా? ''అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టూ'', ''నువ్వు పప్పు పట్రా, నేను పొట్టు తెస్తా! గుళ్ళో కూచుని సమానంగా పంచుకు తిందామన్నట్టు లేదూ!'' నాకు నష్టం కలగజేయడమే తమ అభిమతమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జాజాసమాచారం: శర్మగారు తమ వ్యాఖ్యను వరూధినిబ్లాగులోనూ‌ ఉంచారు. జిలేబీగారు తదుపరిగా చేసిన వ్యాఖ్యలలో ఇలా అన్నారు.
      ...
      ప్రచురించను ; మీ రా ప్రయత్నం లో ఉన్నప్పుడు దానికి ఆటంకమూ రానివ్వను ; ఆ ముందు టపా తో సహా డిలీట్ :)
      ...
      చదువరు లందరికీ (చిందుల రాయుళ్లు చేసిన హంగామా కి చీర్సు తో వారిలో ఒకరు ఈ టపాల నిచ్చి సహకారం చేసినందులకు ) మా మాచన వారి కోరిక మీద ఈ ధారావాహిక రాదు.

      తొలగించండి
  9. అమ్మో. టపాలకోసం ఇంత గొడవా? జిలేబీ చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. తన వెర్రి మొర్రి పద్యాలతో బుర్రలో తొర్రి పడుతుంది. అయినా శర్మగారు వ్యాసాలను అమ్మజూపటం భావ్యంగా లేదు. మీరు అతిత్వరలో స్వయంకృత అజ్ఞాతం నుంచి బయటికి రావాలి. అసలు బ్లాగులు రాసేది ఎందుకు అందరు చదవడానికే కదా. దాచిపెట్టుకుంటే ఏమి ఫలం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరూ మర్యాదస్తులైతే చిక్కేమీ లేదు. అలా లేదు కదా పరిస్థితి. అరాచకవాదుల నుండి దూరంగా తన బ్లాగును ఉంచటానికే శర్మగారు తన బ్లాగును తాను అనుమతించిన వారికే పరిమితం చేస్తున్నారు.

      తొలగించండి
  10. విషయాన్ని సాగదీయడం నా అభిమతం కాదు కానీ కుతూహలం కొద్దీ శర్మ గారిని ఓ చిన్న సందేహం మాత్రం అడిగి ఇక ఆపేస్తాను.
    సందేహం :- శర్మ గారి ప్రైవేట్ బ్లాగుకి "జిలేబీ" గారిని "దేవిడీ మన్నా" చేసినట్లు శర్మ గారి వ్యాఖ్య ద్వారా తెలుస్తోంది, మరి పునఃప్రచురణ చేయాలనుకున్న "జిలేబీ" గారికి ఆ బ్లాగుటపాలు ఎలా లభ్యమయ్యాయి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సాధారణంగా మనం బ్లాగును సృష్టించి, టపాలు వేయటమూ వచ్చిన వ్యాఖ్యలకు సమాధానాలు వ్రాయటమూ తప్ప మరేమీ పట్టించుకోము. ఇంకేం చేయాలీ అనుకుంటాం.

      కాని మనం‌ మన బ్లాగుతాలూకు సెట్టింగులు జాగ్రత్తగా సరి చూసుకుంటూ ఉండాలండి. RSS ఫీడ్ అనేది ఒకటుంటుంది. బ్లాగ్ ఫీడ్ సెట్టింగులు పట్టించుకోకపోతే ఇలాంటి అనర్థాలు వస్తాయి.

      మీరు చూస్తూనే ఉంటారు చాలా బ్లాగు కామెంటులు పూర్తి నిడివితో మాలికలో కనిపిస్తుంటాయి. క్లుప్తంగానే కనిపించేటట్లూ చేయవచ్చు బ్లాగు సెట్టింగులు సరిచేసి. అలాగే బ్లాగుటపాలను కూడా కొన్ని దిక్కుమాలిన సైట్లు అదోదో గొప్ప ఉపకారం అన్నట్లు ఉన్నవున్నట్లు సేవ్ చేస్తూ ఉంటాయి. ఆ సైట్లను పట్టుకుంటే మీ‌ బ్లాగు సమాచారం‌ మొత్తంగా అక్కడ దొరికిపోతుంది.

      ఇలా జరక్కుండా కూడా మీరు సెట్టింగులలో కట్టడి చేయవచ్చును. ఈ సంఘటన అందరికీ‌ మేలుకొలుపు కావాలి. బ్లాగర్ సెట్టింగులు ఐతే settings -> other -> site feed సరిచేయాలి. wordpressలో ఎలా చేయాలో మరెవరన్నా చెప్పాలి.

      తొలగించండి
  11. వివరణనిచ్చినందుకు ధన్యవాదాలు శ్యామలీయం గారు.
    శతకోటి ........ అనంతకోటి ........ సామెత గుర్తొస్తోంది.

    రిప్లయితొలగించండి
  12. జిలేబీ గారి ధోరణిలో ఏదో కొంచెం‌ మార్పు వచ్చిందని సంతోషించటం అత్యాశలాగే కనిపిస్తోంది.
    నిన్న జిలేబీగారు బహుదురుసుగా "ఓ నరసింహ రాయ ! చిందుల పరమావధి నెరుగు మోయి పండిత పుత్రా :)" అని మరొక అకటావికటపు దురద కందం వ్రాసారు తమ బ్లాగువ్యాఖ్యల్లో. పండితపుత్రా ఏమిటండీ తెలిసే వ్రాస్తున్నారా అలాంటి మాట అని అడిగిన పాపానికి ఆ నా వ్యాఖ్యను చాలా నిక్కచ్చిగా తొలగించి తాము పరమ ధీశాలినిగా మరింత కీర్తిగడించారు. తమను శ్లాఘించి (సకారణంగానే లెండి (ఆ కారణం నేనే ఐనా ఆశ్చర్యం లేదు సుమా!) )ఉబ్బేసే వారితో 'మీ ప్రోత్సాహమే మాకు పూర్తి బలం !' అంటూ తమ బలం ఇలా దుశ్చేష్టలతో రెచ్చిపోవటమే అని జిలేబీగారు లక్షణంగా కుండ బద్దలు కొట్టాక, ఇంక వారితో సముదాచారాదుల గురించి ప్రసంగించటం వట్ఠి కంఠశోష అనిపించింది.

    అందుకని కొద్ది నిముషాల క్రిందట జిలేబీగారి వరూధిని బ్లాగులో ఈ‌క్రింది వ్యాఖ్యను వ్రాసి (దానిని వారెలాగూ తొలగించేస్తారని మన పూర్వానుభవలను అనుసరించి నమ్మకంగా చెప్పవచ్చును కాబట్టి) దానిని ఇక్కడ చదువరుల సౌకర్యార్థం పొందుపరుస్తున్నాను:


    నిరాశ కలుగుతోంది.
    ఇటువంటి బ్లాగుప్రపంచంలో ఉండకపోతేనే మంచిదేమో.
    జిలేబీగారూ, రాజారావు గారి వంటి వారు భళీభళీ అనవచ్చును కాక, మీ తెంపరితనం జుగుప్స కలిగిస్తోంది.

    రిప్లయితొలగించండి
  13. స్వాతంత్ర్య దిన శుభాభినందనలు.

    ఫ్లాష్! ఫ్లాష్!!ఫ్లాష్!!!

    నా పాత టపాలు చదవక ఉండలేనివారి కోరికపై ఈ కింది కొత్త బ్లాగులో నా పాత టపాలు ధారావాహికగా ప్రచురిస్తున్నాను.
    https://kastephali.wordpress.com

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారూ,
      మీరు పొరబడుతున్నారని నా అభిప్రాయమండీ.
      మీ టపాలను చదవలేక ఉండలేనివారై కాదు.
      మీ మీద వారు చూపే మెఱమెచ్చు అభిమానం నిజమూ‌ కాదు.
      మీరు తమను ఆహ్వానించలేదు. అది వారికి అవమానం అయ్యింది.
      ఇప్పుడు జిలేబీ గారు చేస్తున్నదంతా కేవలం కక్షసాధింపు చర్య.
      మీ కోడీ కుంపటి లేనిదే తెల్లవారదా అని మిమ్మల్ని వెక్కిరించటం.
      అంతకు మించి మరేమీ లేనే లేదు.
      న అభిప్రాయం తప్పైతే చాలా అనందం.
      కాని జిలేబీ గారి ధోరణి చూస్తే కక్షసాధింపు మాత్రమే అనిపిస్తోంది ప్రస్తుతపరిస్థితిలో. అందుచేత మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవధ్దని మీకు నా విజ్ఞప్తి.


      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.