31, ఆగస్టు 2016, బుధవారం

ఏ మందురా రామ యే మందురా ?ఏ మందురా రామ యే మందురా లోక
మే మన్న నీ వాడ నే నందురా

కామక్రోధాదికఘనవైరిషట్కము
నా మీద పగబట్టి నన్ను జేరి
పాములవలె జుట్టి బట్టెనురా
ఏమయ్య నీ నామ మే కాచెనురా
ఏ మందురా

ఎన్ని జన్మము లెత్తి యున్నానొ తెలియదు
అన్ని జన్మల పాప పున్నెముల
నెన్నగ నా బమ్మ కేనియు వశమా
అన్నియు నీ నామ మడగించెనురా
ఏ మందురా

జీవుడ నగు నేను చీకాకు పడుచుండ
దేవుడ నా చింత దీర్చుటకై
యే వేళ నీ నామ మిచ్చితి వో గాని
భావింప నాడె నీ‌ బంటుగ నైతిరా
ఏ మందురా


(వ్రాసిన తేది 2014-09-13)