బాపు బాపు కృష్ణా బాలకృష్ణా బాపు రే నీ ప్రతాపభాగ్యము లివిగో | |
బాలుడఁవై రేపల్లెఁ బాలు నీ వారగించఁగ పాల జలనిధి యెంత భయపడెనో ఆలించి తొదల మాట లాడనేరుచుకొనఁగ యీ లీల నసుర సతు లెంత భ్రమసిరో |
॥బాపు॥ |
తప్పటడుగులు నీవు ధరమీద బెట్టగాను తప్పక బలీంద్రుఁ డేమి దలచినాఁడో అప్పుడే దాఁగిలి ముచ్చు లందరితో నాడఁగాను చెప్పేటి వేదాలు నిన్నుఁ జేరి యెంత నగునో |
॥బాపు॥ |
సందడి గోపికల చంకలెక్కి వున్ననాఁడు చెంది నీ వురము మీఁది శ్రీసతి యేమనెనో నిందుగ శ్రీవేంకటాద్రి విభుఁడవై యున్న నేఁడు కందువైన దేవతల ఘనత యెట్టుండునో |
॥బాపు॥ |
(బౌళి రాగంలో అన్నమాచార్య సంకీర్తనం 1625వ రేకు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.