అన్నియు నీవై యమరి యుండగ నెన్నగ నేమిటి కితరుల నిపుడు |
|
పవలు నీవు దీప్తాంశుడవగుచు నవల రేయి నమృతాంశుడ వగుచు దివి భువి గాచుచు తేజరిల్లగ నెవరిని పొగడగ నేమి కలదయా |
అన్నియు |
దేవతలందరు నీ విభూతులే జీవకోటి నీ చిత్కళలే యన నీ విశ్వంబున నెటు చూచినను నీవే కలవన్నిటిలో నిండుగ |
అన్నియు |
అది కావలెనని యాదేవతలనొ యిది కావలెనని యీదేవతలనొ మది నెన్నుట మతిమాలిన పనిగద యిదిగో నిన్నే యెన్నెద రామా |
అన్నియు |
29, ఆగస్టు 2016, సోమవారం
అన్నియు నీవై యమరి యుండగ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.