నీరేజపత్రేక్షణా శ్రీరామచంద్ర నిజభక్తసంపోషణా స్మేరాననా చిన్మయా శ్రీరామచంద్ర సీతామనోమోహనా పరమాత్మ నారాయణా శ్రీరామచంద్ర వైకుంఠవాసవిభో పరమేష్ఠిసంప్రార్థితా శ్రీరామచంద్ర పరమేశ లోకప్రభో కమనీయసందర్శనా శ్రీరామచంద్ర కౌసల్యాసుఖవర్థనా కమలాప్తకులభూషణా శ్రీరామచంద్ర కల్యాణగుణవర్థనా మునికాంతాశాపాంతకా శ్రీరామచంద్ర మునియాగసంరక్షకా మునిలోకపరివేష్ఠితా శ్రీరామచంద్ర దనుజప్రజాకంటకా భర్గచాపనిగ్రహా శ్రీరామచంద్ర వసుధాసుతావల్లభా భార్గవాగ్రహవారకా శ్రీరామచంద్ర పరమశాంతవిగ్రహా సాకేతనగరస్థితా శ్రీరామచంద్ర జనకాత్మజాసేవితా లోకావనాతత్పరా శ్రీరామచంద్ర లోకైకరక్షాపరా వనవాసదీక్షాన్వితా శ్రీరామచంద్ర భామాసౌమిత్రీయుతా అనుజ భరతప్రార్థితా శ్రీరామచంద్ర అభిషిక్తనిజపాదుకా మునిరాజగణసన్నుతా శ్రీరామచంద్ర మునిలోకవరదాయకా జనస్థాననిష్కంటకా శ్రీరామచంద్ర సకలాసురదర్పహా అపహసితదోషాచరీ శ్రీరామచంద్ర అపహృతక్షోణీసుతా విపరీతశోకాకులా శ్రీరామచంద్ర విపినభ్రమణవ్యాకులా శకుంతాధిపమోక్షదా శ్రీరామచంద్ర శబరీసమారాధితా వికటకబంధాంతకా శ్రీరామచంద్ర విరహార్తిసమ్మోహితా అవనీసుతాన్వేషకా శ్రీరామచంద్ర పవమానసుతసేవితా రవిపుత్రసన్మానితా శ్రీరామచంద్ర దివిజేంద్రతనయాంతకా గిరిప్రస్రవణసంస్థితా శ్రీరామచంద్ర విరహార్తిసంక్షోభితా హరిసైన్యసంసేవితా శ్రీరామచంద్ర వరఋక్షగణసేవితా పరిశీలితమేదినీ శ్రీరామచంద్ర హరిదర్శిత మైధిలీ అరిరావణదూషితా శ్రీరామచంద్ర హరిరాట్సమాశ్వాసితా కారుణ్యవారాన్నిధీ శ్రీరామచంద్ర ఘనపాపసంశోషణా వారాన్నిధిబంధనా శ్రీరామచంద్ర భండనహతరావణా పాకశాశనసన్నుతా శ్రీరామచంద్ర బ్రహ్మాద్యభినందితా సాకేతపీఠస్థితా శ్రీరామచంద్ర సర్వజగద్వందితా |
17, ఆగస్టు 2016, బుధవారం
సంక్షిప్త రామాయణం పాట.
3 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Very nice sir. divine lyrics.
రిప్లయితొలగించండికంబంధాంతకా ???
రిప్లయితొలగించండికబంధుడు కదా!
typo సరిచేసానండీ. ధన్యవాదాలు.
తొలగించండి