20, ఆగస్టు 2016, శనివారం

బ్లాగుకు ప్రత్యామ్నాయ వేదిక సూచించండి.


నా సాహిత్యవ్యాసంగానికి తగిన ప్రత్యామ్నాయ వేదిక గురించి అన్వేషిస్తున్నాను. ఇంతవరకూ శ్యామలీయం ప్రథానబ్లాగుగా నడిచిన ఈ వ్యాసంగానికి అనివార్యకారణాల వలన ప్రత్యామ్నాయం ఆలోచించుకొనక తప్పటం‌ లేదు. తగిన ప్రత్యామ్నాయం దొరికే వరకూ బ్లాగుల్లో కొనసాగటం‌ జరుగుతుంది.

నా శ్రేయాభిలాషులు ఎవరైనా తమదృష్టిలో ఉన్న ప్రత్యామ్నాయాల గురించి తెలియచేస్తే సంతోషిస్తాను. వారు తమ సూచనలను syamaliyam@gmail.com అనే నా మెయిల్‌కు పంపవలసిందిగా విజ్ఞప్తి.

నేను నా కృషిని మరొక తగిన వేదికకు మార్చుకొనే వరకూ బ్లాగుల్లోనే కొనసాగవలసి ఉంది కాబట్టి, ఇబ్బందులకు గురిచేసి ఆనందించే వారి నుండి సురక్షితంగా ఉండటానికి దారులు వెదుక్కొనక తప్పదు. అందుచేత ఈ‌క్రింది విధానాలను ప్రకటిస్తున్నాను.

  • శంకరాభరణం, కష్టేఫలీ వంటి అతికొద్ది బ్లాగుల్లో తప్ప మరెక్కడా వ్యాఖ్యానించను. 
  • ఎవరన్నా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నాపైన వ్యాఖ్యలు చేసినా సమాధానం ఇవ్వను. 
  • నా వ్యాఖ్యలకు ఎవరైనా ప్రతివ్యాఖ్యను వ్రాసినా నేను సమాధానం ఇవ్వటం‌ కష్టం. చర్చలకు నాకు సమయం ఉండదు.
  • శ్యామలీయం బ్లాగులో వ్యాఖ్యల మీద ప్రతివ్యాఖ్యలను ప్రోత్సహించను. వ్యాఖ్యలు నేరుగా టపాకు సంబంధించి మాత్రమే ఉండాలి. ఇతరవ్యాఖ్యాతల అభిప్రాయాలపై ఖండన మండనలు వద్దు. చర్చలకు తావు బాగా తక్కువ.

అందరూ‌ సహకరించ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

7 కామెంట్‌లు:

  1. మీ మెయిల్ కి సూచన పంపుతాను. వీలు చూచుకుని ఆచరించండి. మీకు బ్లాగు వేదికకాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ‌ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. తెలుగుబ్లాగులు నాకు సరైన వేదికా కావన్నదే నిజం. మీ‌ సూచనల కోసం ఎదురుచూస్తాను.

      తొలగించండి
  2. నా సూచన పంపాను. పరిశీలించగలరు

    రిప్లయితొలగించండి
  3. సార్ మీరు బ్లాగులో కొనసాగండి. ఇతర మాద్యమాల గురించి నాకు తెలీదు కానీ అక్కడా stalking, character assassination etc. ఉన్నాయని వింటున్నాను.

    కావాలంటే వ్యాఖ్యల సదుపాయం కొందరికే పరిమితం చేసి మోడరేషన్ కూడా పెడితే సరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇద్దరు తెలుగువారు ఒక చోట చేరితే మొత్తం మూడుపార్టీలుగా ఉంటారని అంటారు. తెలుగువారిలో కల అనైక్యత కారణంగా తెలుగువారు కలిసికట్టుగా ఎదగటం తమ భాషాసంస్కృతులను పరిరక్షించుకోవటం దుస్సాధ్యంగా ఉంది. అందుచేత బ్లాగుల్లోనే‌ కాక ఎక్కడైనా పరస్పరహననోద్యమంలో అందరూ నిమగ్నమై ఉండటం అందులో విద్యాధికులూ సామాజికబాధ్యతకలహోదాల్లో పనిచేసిన/చేస్తున్న వాళ్ళు కూడా ఉండటం మరీ ఆశ్చర్యాన్ని కలిగించదు. కాని దెబ్బతగిలినప్పుడు ఒకరు నవ్వటం‌ మరొకరు కన్నీటిపర్యంతం‌ కావటం‌ సహజం. మంచి చెడ్డలన్నీ దైవానికి వదిలేయటం తప్ప చేయగలిగినది ఆట్టే కనిపించటం లేదు.

      ఇప్పటికే‌ ఈ‌శ్యామలీయం‌ బ్లాగులో మోడరేషన్ ఉంది. కొందరి వ్యాఖ్యలను మరింత జాగరూకతతో పరిశీలించవలసి ఉందని అనుభవం‌పైన తెలిసివచ్చింది.

      ఐతే ఇతరబ్లాగుల్లో వ్యాఖ్యానించేటం చిక్కులు తెస్తోంది. తాము స్వయంగా అనేకబ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాసేవారూ నన్ను అన్ని బ్లాగులూ తిరుగుతున్నానని ఆక్షేపించటమూ జరుగుతున్నది. నా వ్యాఖ్యలను తొలగించిన వారిలాగే, నా వ్యాఖ్యలను కావాలని అడుతున్న వారినీ చూస్తున్నాను. ఐనా వీలైతే ఆ బ్లాగు ఓనరును సంప్రదించే వ్యాఖ్య ఉంచవచ్చును కాని అనేకులు తమ మెయిల్ ఐడి ఇవ్వరు కదా. మోడరేషన్ ఉన్నచోటు ఐతె ఆ చిక్కు లేదు. వారు ప్రచురించటమే ఆమోదానికి గుర్తు. ఐనా నా వ్యాఖ్యలపైన కావాలని చర్చలూ రచ్చలూ జరగటాన్ని అడ్డుకోలేను. చాలా వరకు వ్యర్థచర్చలు. నాకు హితవు కావు. అందుచేత సాధ్యమైనంతవరకూ వ్యాఖ్యలను ఎక్కడ ఉంచకపోవటమే మంచిది అనుకుంటున్నాను.

      ప్రత్యామ్నాయాన్వేషణ ఎందుకంటే ప్రశాంతంగా సాహిత్యకృషికి అనుకూలమైన వాతావరణం కోసమే.

      తొలగించండి
  4. I think blog is the best option. It has a good reach to readers. As the comment moderation is available in your blog, there wont be any problem

    రిప్లయితొలగించండి
  5. నేను GKK గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.మీ బ్లాగు,మీ ఇష్టం!మీకు నచ్చినవి రాసుకోండి.సమానధర్ముల హృదయశిరఃకంపం అన్నట్టు యాగ్రిగేటర్ ద్వారా చూసినవాళ్ళు ప్రశంసిస్తే సంతోషించండి!

    మోడరేషన్ ఉంది కాబట్టి మెకు నచ్చని కామెంట్లను మీరు ప్రదర్శించకండి.అదేమిటని అడిగే హక్కు ఎవరికీ లేదు!ఇక ఇతర్ల బ్లాగుల్లో మీరు వేస్తున్న కామెంట్లకి వస్తున్న రెస్పాన్స్ గురించి మీరు పొరపాటున కూడా బాధపడే అవసరం లేదు.ఎందుకంటే,వాల్మీకి మహర్షి సీత ముఖతా చెప్పించిన మనం పడుతున్న కష్టాలకి మనలోని భయాలూ,మనం చేస్తున్న తప్పులే కారణం అనేది ప్రత్యక్షర సత్యం!

    ఇతరులు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుదు సరిదిద్దాలని మీరు ప్రయత్నించడం మీ సంస్కారానికి నిదర్శనం!అవి తప్పులని తెలిసీ సరిదిద్దుకుని బాగుపడకుండా తప్పుని పట్టినందుకు మిమ్మల్ని తిట్టడం వారి కుసంస్కారం!!

    మార్క్ ట్చెయిన్ ఇలాంటివాళని చూసె చూసీ "నాయనా!నాకు తెలిసినది చెప్పడం వరకే నేను చెయ్యగలను.ఇది అర్ధం చేసుకునే తెలివితేటల్ని మాత్రం నీకు నేనివ్వలేను - సారీ!" అన్నాడు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.