23, ఆగస్టు 2016, మంగళవారం

పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు





పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు
పాడగ నేనెంత వాడనయ్య రామ


సాహిత్యము లేదు సంగీతము రాదు
ఓహో నేనును పాడ నుంకింతునో
ఊహించు నిను పాడ నుల్లము శ్రీరామ
సాహసించి నేను నేడు పాడెదనో
పాడేరయ్యా

వేదశాస్త్రంబుల వివరము లెఱుగను
వేదాంతసిధ్ధాంతవిధముల నెఱుగ
వేదవేదాంతసంవేద్య శ్రీరామ
నీ దయ నేమని పాడెదనో
పాడేరయ్యా

రాగము లేదు కాని రాము డున్నాడని
తూగు భావము లేదు తోచు భక్తి యని
భాగవతులు మెచ్చ పరమాత్మ శ్రీరామ
నీ గాధలను నేను పాడెదనో
పాడేరయ్యా



(వ్రాసిన తేది: 2014-09-04)

1 కామెంట్‌:

  1. హరి గుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్తకోటులిలలో
    తెలివితో చెలిమితో కరుణగల్గి జగమెల్లను సుధాధృష్టిచే బ్రోచు వారెందరో మహానుభావులు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.