30, నవంబర్ 2024, శనివారం

రామచంద్ర హరి నమోస్తుతే


రామచంద్ర హరి నమోస్తుతే
కామితవరద నమోస్తుతే

శ్రీరఘునందన నమోస్తుతే 
    సీతారామా నమోస్తుతే 
వారిధిబంధన నమోస్తుతే  
    పౌలస్త్యాంతక నమోస్తుతే 
భూరికృపాళో నమోస్తుతే 
    పురుషోత్తమ హరి నమోస్తుతే
నారాయణ హరి నమోస్తుతే  
    జ్ఞానమయాకృతి నమోస్తుతే

ఇనకులతిలకా నమోస్తుతే 
    వనజదళేక్షణ నమోస్తుతే
దనుజవిరామా నమోస్తుతే 
    మునిమఖరక్షక నమోస్తుతే
మునిజనకామిత నమోస్తుతే 
    మోహనరూపా నమోస్తుతే 
జననాథోత్తమ నమోస్తుతే 
    జగదభిరామా నమోస్తుతే

భాసురవిక్రమ నమోస్తుతే
    భండనపండిత నమోస్తుతే
కోసలనాయక నమోస్తుతే
    కోదండధర నమోస్తుతే
దాసజనావన నమోస్తుతే
    దశరథనందన నమోస్తుతే
వాసవాదినుత నమోస్తుతే
    వైకుంఠాధిప నమోస్తుతే


28, నవంబర్ 2024, గురువారం

శ్రీరామ జయరామ సీతారామ


శ్రీరామ జయరామ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరామ  రఘురామ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరామ గుణధామ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరామ ఘనశ్యామ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరామ  మునికామ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరామ శుభనామ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరామ రణభీమ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరామ పరంధామ సీతారామ

    శ్రీరామ జయరామ జయజయ రామ


23, నవంబర్ 2024, శనివారం

అందమైన శ్రీరాముని


అందమైన శ్రీరాముని జూడగ 
    నరుగుదమా గుడికి మన
మందరమును శ్రీరాముని జూడగ 
    నరుగుదమా గుడికి

కనులవిందుగ గుడిలో కొలువై 
    కనబడు మన శ్రీరాముని
హనుమల్లక్ష్మణసీతాయుతుడై 
    యలరారే మన రాముని
ధనువును దాలిచి చిరునగవులతో 
    దరిసెన మిచ్చెడు రాముని
మనకోరికలను వినినవెంటనే 
    మన్నించెడు మన రాముని

వచ్చిన యార్తుల దయతో జూచుచు
    వలదిక భయమను రాముని
హెచ్చిన కౌతుకమున తన సన్నిధికి
    వచ్చిన మెచ్చెడు రాముని
ముచ్చట లడుగుచు మ్రొక్కెడు వారల
    బుధ్ధుల నెరిగెడు రాముని
సచ్చరితులు విజ్ణానులు వచ్చిన
     సంతోషించెడు రాముని


శ్రీరామ్ శుభనామ్ సీతారామ్


శ్రీరామ్ శుభనామ్ సీతారామ్ హరి 
  శ్రీరామ్ రఘురామ్ సీతారామ్
శ్రీరామ్ గుణధామ్ సీతారామ్ హరి 
  శ్రీరాం జయరామ్ సీతారామ్

శ్రీరామ్ దశరథనందన రామ్ 
  శ్రీరామ్ రవికుల భూషణ రామ్
శ్రీరామ్ మునిమఖరక్షక రామ్ 
  శ్రీరామ్ మునిజనసన్నుత రామ్
శ్రీరామ్ దశముఖమర్ధన రామ్ 
  శ్రీరామ్ సురగణప్రస్తుత రామ్
శ్రీరామ్ భక్తజనావన రామ్ 
  శ్రీరామ్ మోక్షప్రదాయక రామ్

శ్రీరామ్  కంజదళేక్షణ రామ్ 
  శ్రీరామ్ కార్ముకభంజన రామ్ 
శ్రీరామ్ ధర్మవివర్ధన రామ్  
  శ్రీరామ్ దానవభంజన రామ్  
శ్రీరామ్ నిరుపమవిక్రమ రామ్  
  శ్రీరామ్ నిత్యనిరంజన రామ్
శ్రీరామ్ సజ్జనరంజన రామ్ 
  శ్రీరామ్ భవభయభంజన రామ్


10, నవంబర్ 2024, ఆదివారం

ఏమండీ ఆమోక్ష మెట్లు వచ్చును

ఏమండీ ఆమోక్ష మెట్లు వచ్చును
రాము డిచ్చు నందురా ఆమోక్షము

రామనామ మొకటి లేక రాదు మోక్షము శ్రీ 
రామ రామ రామ యనక రాదు మోక్షము

రాముని సత్కృపయె లేక రాదు మోక్షము శ్రీ 
రామునిపై భక్తి లేక రాదు మోక్షము

రాముని సేవించకుండ రాదు మోక్షము శ్రీ 
రామభజనపరత లేక రాదు మోక్షము 

రామ తత్త్వ మెరుగకుండ రాదు మోక్షము శ్రీ 
రామచింతనపరుడు గాక రాదు మోక్షము 

రాముని కీర్తించకుండ రాదు మోక్షము శ్రీ 
రాముని పూజించకుండ రాదుమోక్షము

రామపాద మంటకుండ రాదు మోక్షము శ్రీ 
రాము డీయకుండ నీకు రాదు మోక్షము

శ్రీరఘురాముని నమ్మండి

శ్రీరఘురాముని నమ్మండి శ్రీరఘురాముని తెలియండి

శ్రీరఘురాముని చేరండి శ్రీరఘురాముని కొలవండి


శ్రీరఘురాముని చిత్తము నందున చేర్చిరహించిన  కైవల్యం

శ్రీరఘురాముని కన్యము నెఱుగక జీవించినచో కైవల్యం

శ్రీరఘురాముని తత్త్వము నిత్యము చింతించినచో కైవల్యం

శ్రీరఘురాముని సేవను విడువక చేయుట మరగిన కైవల్యం


శ్రీరఘురాముని కథలను నిత్యము ప్రీతిగ చదివిన కైవల్యం

శ్రీరఘురాముని కీర్తన లెప్పుడు చెలగుచు పాడిన కైవల్యం

శ్రీరఘురాముని నామము విడువక చేయుచు నుండిన కైవల్యం

శ్రీరఘురాముని భక్తిని విడువక జీవించినచో కైవల్యం


శ్రీరఘురాముని సత్కృప వలననె జీవికి కలుగును కైవల్యం

శ్రీరఘురాముని దాస్యము చేసిన జీవికి కలుగును కైవల్యం

శ్రీరఘురాముని మరువక బ్రతికే జీవికి కలుగును కైవల్యం

శ్రీరఘురాముని సీతారాముని చేరి పొందుడీ కైవల్యం





3, నవంబర్ 2024, ఆదివారం

రామరామ యన వేలా


రామరామ యన వేలా శ్రీరఘురాముని కొలువ వదేలా


రామనామమును మించిన మంత్రము భూమిని లేదని చక్కగ నెఱిగియు

రామనామమును చేసిన జీవులు రయముగ మోక్షము పొందుట నెఱిగియు

రామదాసులకు సర్వసంపదలు రాముడు తప్పక నిచ్చుట నెఱిగియు

రామదాసులకు రాముడె యోగక్షేమము లరయుచు నుండుట నెఱిగియు

రామనామమును శివుడే నిత్యము ప్రేమగ ధ్యానము చేయుట నెఱిగియు

రామనామమును పలికిన వినినను రోమహర్షణము కలుగుట నెఱిగియు

రాముడు శ్రీమన్నారాయణుడని బ్రహ్మాదులు ప్రకటించుట నెఱిగియు

రాముని కన్నను దైవము లేడని భూమినందరును పొగడుట నెఱిగియు

బ్రహ్మాదికసురపూజ్యుడు రాముడు భగవంతుం డని బాగుగ నెఱిగియు

బ్రహ్మానందము రామనామమును పాడుటలోనే కలదని యెఱిగియు

సర్వకాలముల రామనామమును చక్కగ జేయగ దగునని యెఱిగియు

సర్వాత్మకుడగు రాముం డొక్కని శరణము జొచ్చిన చాలని యెఱిగియు