ఉచిత పుస్తకాలు

ఇక్కడ నెట్‌లో లభించే ఉచిత పుస్తకాల సమాచారం పొందుపరచాను. ఆసక్తి కలవారు ఉపయోగించుకో గలరు. ముఖ్యోద్దేశం తెలుగుపుస్తకాలలో ఉచితంగా లభించే వాటిని సూచించటమే. కాని ఇతరపుస్తకాలనూ సూచించటం జరిగింది.

1.  MusicResearchLibrary

Music Research Library is a collection of publicly accessible and downloadable electronic resources related to Indian Music organized into various collections. These include manuscripts, articles, books, periodicals, source texts and teaching resources. 

ఈ సైట్‌లో ఫేజీ పైన కుడివైపున ఒక సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. అందులో telugu అని టైప్ చేయండి. అందుబాటులో ఉన్న గ్రంధాల పట్టిక కనిపిస్తుంది. ఈ 2023-1-11రోజన  చూస్తే 347 పుస్తకాలు ఉన్నాయి. 

ఈ సైట్ పేజీలో పైన విభాగాల వారీగా పట్టిక కనిపిస్తుంది. అందులో Books అన్న దాని మీద క్లిక్ చేస్తే ఒక పట్టీ నిలువుగా తెరచుకుంటుంది భాషలవారీగా. మీరు తెలుగు పుస్తకాల కోసం అందులో Books - Telugu అన్న విభాగం పేరు మీద్ క్లిక్ చేస్తే తెలుగు పుస్తకాల విభాగం వస్తుంది. అలా చూస్తే అక్కడ 173 పుస్తకాలు ఉన్నాయని తెలుస్తోంది. నేరుగా కూడా అక్కడికి వెళ్ళవచ్చును

2. శ్రీ రామసేవాకుటీరము “ఆంధ్రవాల్మీకి” వాసుదాసు స్వామి 

 హోం శ్రీ శ్రీ శ్రీ “ఆంధ్రవాల్మీకి” వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు స్వామి) గారి సాహిత్యానికి సంబంధించిన సైట్.  ఈ సైట్ లోనికి వెళ్ళి పైన చూస్తే మనకు వివిధ విభాగాల పట్టిక కనిపిస్తుంది. అందులో "వాసుదాస స్వామి రచించిన గ్రంథములు" అన్న విభాగంలో వారి పుస్తకాలు లభిస్తున్నాయి. స్వామి వారు శ్రీమద్రామాయణాన్ని యధాతధంగా తెలుగు చేయటం వలన అంధ్రవాల్మీకి అయ్యారు. ఆపుస్తకాలూ ఇతర రచనలూ కూడా మనం ఇక్కడ నుండి పొందవచ్చును.

౩. ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ । Free Gurukul Education Foundation

ఈ సైట్‌లో కూడా అనేక రకాల తెలుగుపుస్తకాలు లభిస్తున్నాయి. సైట్ పైన ఇచ్చిన విభాగాల పట్టికలో TAG అన్నదానిని ఎంచుకొని క్లిక్ చేస్తే మనకు పుస్తకాలను అనేక వర్గీకరణలతో పట్టిక వేసి చూపుతున్నారు ఏ వర్గంలో ఎన్ని పుస్తకాలున్నాయన్న సమాచారంతో సహా. ఈ 2023-1-11రోజన  చూస్తే ఆదిశంకరాచార్య అన్న వర్గంలో 42 పుస్తకాలను చూపారు. 

4. తెలుగు పరిశోధన 

ఈ సైట్ వారు తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Free PDF Telugu Books and Sanskrit books  అని చెప్పుకున్నారు.  ఇక్కడ సైట్ పేజీలో ఇచ్చిన వర్గాలు కొన్ని ఉన్నాయి. విషయసూచిక అన్న వర్గంలో కొన్ని పుస్తకాలనూ, సంపుటాలనూ చూడవచ్చును. భాలవ్యాకరణం వర్గంలో వీడియో పాఠాలూ ఉన్నాయి!

5. దేవిశెట్టి చలపతిరావు గారి పుస్తకాలు 

'అభినవ వ్యాస' 'జ్ఞాన ప్రపూర్ణ' శ్రీ దేవిశెట్టి చలపతిరావు గారు సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధముగా వ్యాఖ్యానించిన కొన్ని గ్రంధముల పుస్తకములను ఇక్కడ PDF format లో ఉన్నాయి. సైట్ పేజీలో ఉన్న వర్గాలను చూడండి. ఈబుక్స్ మాత్రమే‌ కాక ఇతర సాహిత్యం కూడా చాలానే ఉన్నది.

6. JeevanMukthi Saadhana

ఇదొక తెలుగు బ్లాగ్. ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చును. ఇక్కడ చాలా విలువైన సమాచారం ఉంది. వైదిక ధార్మిక గ్రంధాలూ ఇంకా బోలెడు వర్గాలుగానూ సమాచారం ఉంది. ఆసక్తికర మైన బ్లాగు.

7. ఉచిత గురుకుల విద్య బ్లాగ్

ఈ బ్లాగ్ కూడా చాలా పుస్తకాలను అందిస్తోంది. కొన్ని వర్గాల పుస్తకాలను కట్టగట్టి మరీ‌ అందిస్తోంది.  ఉదా: సంగీత సంబంద 32 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఇత్యాది.

8. 951+ Free Math Books

ఈ సైట్‌లో mathematics పుస్తకాలు చాలా ఉన్నాయి. ఐతే అవన్నీ ఇంగ్లీషులో ఉంటాయనుకోండి. ఇబ్బంది లేదుగా.

9. The Divine Life Society ఈ పేజీ గురించి సైట్‌లో  "The books published by The Divine Life Society are being made available on the web in both Portable Document Format (PDF) and HTML. " అని ఉంది. ఇది సొసైటీ వెబ్‌సైట్‌లో ఒక విభాగం. పుస్తకాలను తరగతుల వారీగా లిష్టుచేసి ఉంచారిక్కడ. ఇతరవిభాగాలను దర్శించాలని అనుకొంటే పేజీ పైన విభాగాలకు లింకులు పట్టికగా ఉన్నాయి.

10. Holybooks.com

 ఇక్కడ వివిధమతాలకు సంబంధించిన పవిత్రగ్రంథాల సమాహారం కనిపిస్తుంది. పుస్తకాలు అన్నీ ఇంగ్లీషులో ఉంటాయి. సైట్‌ తెరచి పైన కుడివైపున ఉన్న సెలక్షన్ బాక్స్ మీద క్లిక్ చేసి ఆసక్తి కల మతానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చుకోవచ్చును.

11. telugudownloading 

ఇది ఒక బ్లాగ్. చాలా కాలం నుండి స్తబ్ధుగా ఉంది. కాని ఇక్కడ చాలా పుస్తకాలు దొరుకుతున్నాయి. సైట్ గురించి "all telugu books, telugu novels and telugu magazines are available here for free. You can find almost all the telugu books and telugu novels in ebook format here and magazine like swathi, navya, India today e.t.c., ebooks available here without any registration" అని చెప్పారు.  యండమూరి అనే లేబుల్ పెట్టి ఏకంగా 69 ఉన్నాయి!  సూర్యదేవర రామ్మోహన రావు ఐతే అవి 88 ఉన్నాయి.  మధుబాబు అనే పేరున ఉన్నవి 59. ఆధ్యాత్మిక సాహిత్యం కోసం చూడకండి ఇక్కడ.

12. Free download Pdf 

ఇది కూడా ఒక బ్లాగ్. దీని గురించి "Free download Pdf  files of Comics, Novels, Magazines, Ebooks " అని చెప్పారు.  ఇది చురుగ్గానే ఉన్న బ్లాగ్. ఇక్కడ కూడా చాలా పుస్తకాలు లభిస్తాయి. పేజీ‌ తెరవగానే నాకు కొన్ని ఇంగ్లీషు నవలలూ, సూర్యదేవర రామ్మోహన రావు పుస్తకం ఒకటీ ఈజనవరి 13 తేదీతో స్వాతి వీక్లీ ఒకటీ దర్శనం ఇచ్చాయి. 

13. Sri Aurobindo Ashram

ఇది అరవిందుల అశ్రమం సైట్. ఈ సైట్ తెరచినప్పుడు పైన సెక్షన్లు సూచించారు. Library అన్న సెక్షన్ లోనికి వెళ్ళండి. ఆ సెక్షన్ లోపల అరవిందుల వారివీ మదర్ వారివీ రచనలు అన్నీ లభిస్తున్నాయి. లేదా మీరు Sri Aurobindo అన్న సెక్షన్ లోనికి వెళ్ళి అక్కడ Writings sub-section పేజీ తెరచి చూచినా పుస్తకాలు అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా ఈ‌సబ్-సెక్షన్ చివరన మీకు Zipped file of all the above PDFs కనిపిస్తుంది సులువుగా అవిధంగా అన్నీ ఒక్కసారిగా తెచ్చుకోవచ్చును.

14. Theosophical University Press: Online Literature

మీరు ఈసైట్ తెరచి ఇక్కడ నుండి చాలా పుస్తకాలనూ ఆడియో పుస్తకాలనూ పొందవచ్చును. ఈ సైట్ పేజీ చివర్ సొసైటీ‌ హోం పేజీకి లింక్ కూడా ఉంది.

15. Blavatsky Study Center 

ఈ Blavatsky అనే ఆవిడ దివ్యజ్ఞానసమాజం స్థాపకురాలు. అదే లెండి theosophical society. ఇక్కడ ఈసమాజ సాహిత్యం ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చును. ముఖ్యంగా ఆవిడ రచనలు.

16. World Teachers Trust.

ఈ ట్రస్ట్ వారి సైట్లో సైట్ మొదట్లోనే విభాగాలను సూచించారు. మీరు Publications అనే విభాగంలో Telugu Books అన్న ఉప విభాగాన్నీ చూడవచ్చును. అక్కడ డా. కె. పార్వతీకుమార్ గారి ద్వారా వెలువడిన కొన్ని తెలుగు ప్రచురణలు ఇక్కడ పిడిఎఫ్ (PDF) ఫార్మాట్లో ఇవ్వబడినవి. అది కాక ఎక్కిరాల కృష్ణమాచార్య గారి తెలుగు పుస్తకాలు ఎందుకు ఇక్కడ లేవో తెలియదు. ఆశ్చర్యం!

17. Rare Book Society Of India 

ఇది ఒక అద్భుతమైన సైట్. ఇక్కడ అరుదైన గ్రంథాలు దొరుకుతున్నాయి. సైట్ తెరచి పైన కుడివైపున ఉన్న సెర్చ్ బాక్స్ లోపల గణిత గ్రంథాల కోసం ganita అని టైప్ చేసాను. నాకు మహావీరాచార్య పుస్తకం గణిత సార సంగ్రహం దొరికింది. ఇంగ్లీషులో ఉన్నది. దానితో పాటే భాస్కరాచార్య సిధ్ధాంతశిరోమణికి, సమర్ధ జగన్నాథ రేఖాగణితం పుస్తకాలకు లింకులు కనిపించాయి. మీరు వెదకి చూడవచ్చును కావలసిన పుస్తకాల కోసం.

18. శ్రీ సాయి మాస్టర్ సేవా ట్రస్టు 

ఇది గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వారి సైట్.  ఇక్కడ ఈ 2023-1-11రోజన  చూస్తే 73 పుస్తకాలు ఉన్నాయి  స్వామి వారిని గురించి కూడా ఈసైట్ ద్వారా తెలుసుకోవచ్చును.

19. PDF DRIVE

ఈ సైట్ గురించి వారి మాటల్లో "PDF Drive is your search engine for PDF files. As of today we have 81,876,179 eBooks for you to download for free. No annoying ads, no download limits, enjoy it and don't forget to bookmark and share the love!"  ఇక్కడ వివిధ విభాగాలకు చెందిని పుస్తకాలు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొన వచ్చును. ఉదాహరణకు Python Programming  గురించిన పుస్తకాలూ‌ ఉన్నాయి.  Paul Brunton రచించిన పుస్తకాలూ‌ ఉన్నాయి. నేనొక పుస్తకం Python Programming  గురించినది దించుకొని చూసాను. సులభంగానే‌ వచ్చింది.

20. PUVVADA KAVITHA

ఈ సైట్‌లో పువ్వాడ శ్రీరాములు (రామదాసు గారు) , పువ్వాడ శేషగిరిరావు, పువ్వాడ తిక్కన సోమయాజి గార్ల సాహిత్యం లభిస్తోంది.

21. Archive

ఇది ఒక నానాజాతిసమితి. వారి మాటల్లో "nternet Archive is a non-profit library of millions of free books, movies, software, music, websites, and more." ఈ సైట్ తెరచి సెర్చ్ బాక్స్ లోపల మనకు కావలసిన సమాచారం తాలూకు ఏదైనా పదమో పదబంధమో టైప్ చేసి చూస్తే కావలసిన పుస్తకాలు వస్తాయి. మాటవరసకు మీరు శతకము అని టైప్ చేస్తే 396 ఐటమ్స్ వచ్చాయి. అందులో ఎన్నెన్నో శతకాలు ఉన్నాయి.

22. Jyothish Books 

ఇది ఒక బ్లాగ్.  సైట్ వారి మాటల్లో "Download and read old jyothish books for free. Share the knowledge and gain insight into the divine and sacred science of astrology". అనేకానేక  ఇక్కడ మీరు పుస్తకాలను ఉచితంగా చదువుకోవచ్చును. కాని దిగుమతి సౌకర్యం కనిపించటం లేదు. కాని ఈసౌకర్యం ఉందన్నారే? వారిని అడిగి చూస్తున్నాను.

23. Library Genesis

ఇది ఒక మంచి సైట్. వారి మాటల్లో "A guide to effective catalog searching" ఇక్కడ నుండి ఎన్నో పుస్తకాలనూ దిగుమతి చేసుకోవచ్చును. సెర్చ్ బాక్స్‌ ఉంది. కావలసిన మాట(లు) టైప్ చేసి పుస్తకాలను తెచ్చుకోవటమే.  నేను  అని టైప్ చేస్తే బోలెడు పుస్తకాలు వచ్చాయి. నేను Trance-formations అనే పుస్తకం దిగుమతి చేసుకొని చూసాను. వచ్చింది సులువుగానే. 

24. శ్రీ కంచి కామకోటి పీఠము 

ఇది కామకోటి శ్రీ కంచి కామకోటి పీఠము, కాంచీపురము యొక్క అంతర్జాల తెలుగు వేదిక. ఇక్కడ ఈ 2023-1-11రోజన  చూస్తే 83 పుస్తకాలు చదువుకొనటానికి అందుబాటులో ఉన్నాయి. దిగుమతి చేసుకోలేము. చాలా స్తోత్రాలు తాత్పర్యంతో సహా ఉన్నాయి.

25. shaivam.org

ఇది శివభక్తికి సంబంధించి సైట్. ఇక్కడ వివిధభాషల్లో పుస్తకాలు లభిస్తున్నాయి. తెలుగులో కూడ చాలానే పుస్తకాలు ఉన్నాయి.

 

విజ్ఞప్తి: పాఠకులకులలో ఎవరికైనా ఇలా ఉచిత పుస్తకాలను అందించే సైట్ల వివరాలు ఇంకా ఏమన్నా తెలిసిన పక్షంలో దయచేసి నాకు తమతమ వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. పరిశీలించి ఈ పేజీలో కొత్త వివరాలను పొందుపరుస్తాను.