ఈ స్నేహం ఇప్పటిది కాదు
ఈ యెడబాటూ ఇప్పటిది కాదు
యెన్ని యుగాలైనది నిన్ను చూచి
నన్ను నువ్వు మరిచావని తలచేదా
ఇద్దరం ఒకటే నని యన్నావు
అసలిద్దరం లేనే లేమన్నావు
నన్ను నువ్వెలా వదిలేసి వెళ్ళిపోయావు
నిన్ను వెదుక్కుంటూ బయలుదేరాను
యెన్నివేషాలు వేసుకుని
యెన్ని లోకాలు తిరగానో
యెక్కడా నాకు నీ జాడ కానరాలేదు
మక్కువ తగ్గిందేమో నీకు నామీద
నిన్ను వెదుక్కుంటూ తిరిగి
నేను దారి తప్పినట్లున్నాను
యెక్కడ బయలుదేరిందీ గుర్తేలేదు
యెక్కడకు చేరేదీ తెలియటం లేదు
నన్ను వెక్కిరిస్తున్నాయే
యెన్నో నా భగ్న దేహరధాలు
ఈ పాతపడుతున్న దేహవాహనానికీ
ఓపిక నశించేలోగా ఒక్కసారి కనిపించు
నా స్సస్వరూపమే నీ వైనా
ఆ స్వరూపమేదో మరిచానే
కావాలని దాగి నువ్వు గడబిడ చేస్తుంటే
ఈ వెదుకులాట యెప్పటికి ముగుస్తుంది చెప్పు
ఒక నిజ భక్తుని ఆవేదన.ఆరాటం భగవతాన్వేషణలో
రిప్లయితొలగించండిఎలా ఉంటుందో చాలబాగా విశధికరిచావు.
పరమాత్మ. జీవుడు రెండు వేరు వేరు కాదని
చాలా సున్నితంగా విడమరిచావు