23, జులై 2014, బుధవారం

టాం‍క్‍బండ్ మీద ఉన్న పెద్దల విగ్రహాలలో పనికిమాలిన విగ్రహాలున్నాయా?


స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి సారథ్యంలో హైదరాబాదులోని టాంక్‍బండ్ మీద ఏర్పాటు చేయబడిన తెలుగునాట  ప్రసిథ్థులైన వారి విగ్రహాల పట్టిక ఈ దిగువన ఇస్తున్నాను. ఇవి మొత్తం 33 విగ్రహాలు.

వీటిలో పనికిమాలిన విగ్రహాలున్నాయేమో కాస్త పరిశీలించండి.

     1     రాణీ రుద్రమదేవి 
     2     మెహబూబ్ ఆలీ ఖాన్ 
     3     శ్రీ సర్వేపల్లి రాదాకృష్ణ
     4     కట్టమంఇ రామలింగారెడ్డి
     5     గురజాడ వెంకట అప్పారావు పంతులు
     6     బళ్ళారి రాఘవ 
     7     అల్లూరి సీతారామరాజు 
     8     సర్ ఆర్థర్ కాటన్
     9     త్రిపురనేని రామస్వామి చౌదరి 
   10     పింగళి వెంకయ్య
   11     కందుకూరి వీరేశలింగ పంతులు
   12     మగ్ధుం మొహియుద్దీన్ 
   13     సురవరం ప్రతాపరెడ్డి 
   14     గుర్రం జాషువా
   15     ముట్నూరి క్ర్శష్ణారావు 
   16     శ్రీశ్రీ 
   17     రఘుపతి వెంకట రత్నం నాయుడు 
   18     త్యాగరాజస్వామి
   19     రామదాసు 
   20     శ్రీకృష్ణదేవరాయలు
   21     క్షేత్రయ్య 
   22     పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
   23     బ్రహ్మనాయుడు
   24     ఆతుకూరి మొల్ల 
   25     అబుల్ హసన్ తానాషా 
   26     సిధ్దేంద్రయోగి
   27     యోగి వేమన 
   28     పోతనామాత్యుడు
   29     అన్నమాచార్య 
   30     యర్రాప్రగ్గడ 
   31     తిక్కన సోమయాజి 
   32     నన్నయ భట్టారకుడు
   33     శాలివాహనుడు 


32 కామెంట్‌లు:

  1. శ్యామలీయం మాస్టారూ, ఈ వ్యక్తుల ఎంపిక ప్రాతిపదిక ఏమిటి? (ఎవరు ఎలా చేసారు కాదు)

    The relevance or otherwise of the individual should only be seen vis-a-vis the criterion.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏ ప్రాతిపదిక ఆధారంగా ఎంపిక చేసారో తెలియదండి ఈ రోజున ప్రజలో శ్రీకాంత్ చారిగారి వ్యాఖ్య ఒకటి చూడండి. యధా తధంగా ఇక్కడ ఇస్తున్నానుః


      మీరు ప్రవీణ్‌ని సంబొధించినా, నన్నే ఉద్దేశించి అన్నట్టున్నారు. మచ్చుకు కొన్ని చెపుతాను.

      అబుల్ హసన్ తానీషా. ఇతను చరిత్రలో ఒరగబెట్టిందేమీ లేదు. కేవలం రామదాసు కథలో "రాముడు కలలోకి వచ్చాడు" అన్న అభూత కల్పన తప్ప.

      పోతులూరి వీరబ్రహ్మం. ఇతను రాసిన పుక్కిటి పురాణానికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఇతన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు.

      బ్రహ్మనాయుడు. ఇతడు కేవలం ఒక కావ్యం ద్వారా వెలుగులోకి వచ్చిన వ్యక్తి. చారిత్రక ఆధారాలు శూన్యం. ట్యాంకుబండుపై విగ్రహం నిలుపవలసిన స్థాయి కాదు.

      ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. ఇతరులు వ్యతిరేకించ వచ్చు.


      చారిగారి అభిప్రాయం సబబుగాబనే ఉందనిపిస్తోంది.

      తొలగించండి
    2. ప్రాతిపదిక ఏమిటో తెలీకుండా ఎంపికలో తప్పొప్పులు చెప్పలేము కదండీ. ఏలిన వారు వాడిన ప్రాతిపదిక ఏదయినా మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలి.

      ఉ. ఈ విగ్రహాలను "తెలుగు వెలుగులు" అని కొందరు అనేవారు ఉన్నారు. ఈ లెక్కన చెల్లని ఎంపికలు ఏమిటో చూద్దాం:

      2 మెహబూబ్ ఆలీ ఖాన్
      3 శ్రీ సర్వేపల్లి రాదాకృష్ణ
      8 సర్ ఆర్థర్ కాటన్
      12 మగ్ధుం మొహియుద్దీన్
      20 శ్రీకృష్ణదేవరాయలు
      25 అబుల్ హసన్ తానాషా
      33 శాలివాహనుడు

      వేరే ప్రశ్న: మీకు తెలిస్తే విశాఖ రామకృష్ణ బీచు మీది విగ్రహాల పట్టిక ఇవ్వగలరా, థాంక్స్.

      తొలగించండి
    3. గొట్టిముక్కలవారూ,
      విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద విగ్రహాల వివరాలు నాకు తెలియవండీ.
      ఈ విగ్రహాలతాలూకు పెద్దలు అంతా తెలుగువెలుగులా అంటే నేను వెంటనే ఏమీ చెప్పలేను.
      కొంచెం లోతైన పరిశీలన చేయకుండా ఏవిధమైన వ్యాఖ్యా ఉచితం కాదని నా అభిప్రాయం.
      . మాటవరసకు శాలివాహనుడుని చూదాం. ఆయన భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. . శకకర్త. భారతీయ పంచాంగం(కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది. కాబట్టి ఆయన బొమ్మను అనుగ్రహించవచ్చునేమో ఆలోచించండి. ఇలాగే అందరి విషయంలోనూ కూడా కూలంకషమైన పరిశీలన తరువాతనే 'పనికిమాలినవి' నిగ్గు తేల్చవచ్చును.

      తొలగించండి
    4. మరొకముక్క, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలను కూడా మీరు చెల్లని ఎంపికగా చేసారే. మీ దయ, ఆయన ప్రాప్తం!

      తొలగించండి
    5. సార్ శాలివాహనుడు తెలుగా కాదా అన్న ప్రశ్నకు ఆయన పేరుతొ శకారంభం కావడానికి సమాధానం.

      రాయల సంగతి పెద్ద డిబేటు, ఇప్పటికి వదిలేద్దాం. మహబూబ్ పాషా తెలుగు వాడు కాదు కదా. ఆయనను తెలుగు వెలుగు అనగలమా?

      తొలగించండి
    6. జైగారూ, మీ మొదటి వాక్యం "శాలివాహనుడు తెలుగా కాదా అన్న ప్రశ్నకు ఆయన పేరుతొ శకారంభం కావడానికి సమాధానం." నాకు అర్థం కాలేదు.

      ఎవరైనా తెలుగువారు కానివారైనా తెలుగువారికి చిరస్మరణీయమైన వారైతే అలా గుర్తించటం తప్పు కాదనుకుంటాను.

      తొలగించండి
    7. నాకు తెలిసి శాతవాహనులు పాళీ భాష మాట్లాడే వారు. అంచేత ఆ రాజులు ఎవరూ "తెలుగు వెలుగు" అనే ప్రాతిపదిక కింద అర్హులు కారు. A person does not become a Telugu icon because his name is used for (an admittedly non-Telugu) almanac.

      తొలగించండి
    8. అవునండి, అవన్నీ పనికిమాలినవే - యేమిటట!హైదరాబాదు తెలంగాణాలో వుంది!!వారికి అవన్నీ పనికిమాలినవే!!!ఘజినీ దైవప్రతిమనే కూలగొట్టేశాడు , మహా శివుదు మనకి దేవుడు కానీ ఘజినీకి కాదుగా - రాతిగదతో ఒక్క దెబ్బకి పగల గొట్టాడు.ఆనాడు భూమి కంపించ లేదే, పాతాలం పగిలి ఘజినీ అందులో కూరుకు పోలేదే!రేపు హైదరాబాదులోనూ అదే జరుగుతుంది, ఘజినీకి మన దేవుడు కేవలం రాయిలాగే కనిపించాడు - తెలంగాణా వాళ్ళకి ఆంధ్రా వాళ్ళ విగ్రహాలూ అలాగే కనపడతాయి, అందులో వింతేముంది?నిర్దాక్షిణ్యంగా పగల గొట్టేస్తారు,కేవలం తెలంగాణాకు సంబంధించినవి మాత్రమే పెట్టుకుంటారు, అప్పుడు మాత్రం భూమి బద్దలవుతుందా?

      తొలగించండి
  2. సర్. ఈ లిస్టులో ఇంకా చేర్చవలసినవి అంటే తెలంగాణాలో ప్రముఖులవి ఉన్నాయనుకుంటున్నారా? ఆ అవసరం లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంచెం సంధిగ్ధత.
      ఈ లిష్టు అంటే? తొలగించవలసినవారిదా? ప్రతిష్టించవలసినవారిదా?
      ప్రతిష్టించవలసినవారిదైతే తగినంత ఉండనే ఉంది!

      తొలగించండి
    2. :) కరెక్టుగా చెప్పాలంటే అప్పుడు చేర్చి ఉండాల్సిన లిస్టులోనండీ.

      తొలగించండి
  3. తెలుగు వెలుగులు అంటే తెలుగువారే కావలసిన అవసరం లేదనుకుంటాను. కాటన్, కృష్ణదేవరాయలు తెలుగువారికంటే తెలుగుకు ఎక్కువగానే వెలుగులు నింపారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణదేవరాయలు తెలుగువాడేనండీ.
      ఈ బ్లాగులో ఆవిషయమై కొన్నాళ్ళ క్రిందట శ్రీసంగనభట్ల నరసయ్యగారి వ్యాసమూ ఉంచాను చూడండి.

      తొలగించండి
    2. కృష్ణదేవరాయలు కన్నడిగుడు కాదా? నేనిప్పటివరకు ఆయన తెలుగువాడు కాడనుకుంటున్నాను. మీరు చెప్పిన పోస్టు లింక్ ఇవ్వండి.

      తొలగించండి
    3. "కాటన్, కృష్ణదేవరాయలు తెలుగువారికంటే తెలుగుకు ఎక్కువగానే వెలుగులు నింపారు"

      నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు ఏ మన్యప్రజల జీవితాలాలో చీకటి పారద్రోలాలని పోరాడారో వారు తెలుగు వారు కాదు. ఇదొక్కటి వదిలేస్తే ఆయన తెలుగుకు ఏమీ చేయలేదనేది వాస్తవం. అంచేత కాటన్ (రాయలను కాస్సేపు పక్కనపెట్టి) కావాలంటే అల్లూరిని తొలగించాలి.

      ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. ఒక ప్రాతిపదికను ఎలా అన్వయించాలో అని మాత్రమె చూస్తున్నాను. నా అన్వయనలో లోపాలంటే తెలుపగలరని మనవి.

      తొలగించండి
    4. జైగారూ, వివాదం దేనికండీ. సీమాంద్రప్రాంతంవారు ప్రతిపాదించిన పెద్దలెవరూ అర్హులు కారంటే సరిపోతుందేమో? అసలు సీమాంద్రవారే హేళనకు తప్ప ఎందుకూ పనికిరాని పరిస్థితి. అంతా కాలప్రభావం! మంచిదండీ. ఈ విగ్రహాలు తరలించటం ఖర్చులైనా మిగులుతాయి, పగలేసి పండగచేసుకుంటే సరి అందామా? ఒకటో అరో తెలుగువాళ్ళు అని మీరొప్పుకునే అదృష్టవంతులైన వారి విగ్రహాలను దయచేసి గుర్తించి ఇస్తే ఆ ఒకట్రెండూ పట్టుకెళ్ళమందాం లెండి, మరీ సీమాంద్రవాళ్ళు ఏడిచిపోకుండా.

      తొలగించండి
    5. అల్లూరిని తొలగించాలి :(( ఏమో జై గారు ఈ పద్ధతిలో వాదించడం కంటే మిన్నకుండడం బెటర్. అయితే ఓ ప్రాతిపదిక అన్నారు. అదేదో బాగున్నట్లున్నది.

      తొలగించండి
    6. ఈ ఆర్టికల్ ( శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగువాడే! ) నేను ఇంతక్రితమే చదివానండీ. అయినా ఆ తరువాత కూడా ఎక్కడో దీనికి భిన్నమైన వాదన చదివినట్లున్నది.

      తొలగించండి
    7. సార్ నా వ్యాఖ్యలు ప్రస్తుతం ఉన్న విగ్రహాల గురించి. రేపో మర్నాడో వాటి స్థానంలో రాబోయే తెలంగాణా మహనీయుల పట్టికలో ఖచ్చితంగా (ఆంధ్రులతో సహా) రాష్ట్రేతరులు ఉండబోరు.

      తొలగించండి
    8. అవునండి, అవన్నీ పనికిమాలినవే - యేమిటట!హైదరాబాదు తెలంగాణాలో వుంది!!వారికి అవన్నీ పనికిమాలినవే!!!ఘజినీ దైవప్రతిమనే కూలగొట్టేశాడు , మహా శివుడు మనకి దేవుడు కానీ ఘజినీకి కాదుగా - రాతిగదతో ఒక్క దెబ్బకి పగల గొట్టాడు.ఆనాడు భూమి కంపించ లేదే, పాతాళం పగిలి ఘజినీ అందులో కూరుకు పోలేదే!రేపు హైదరాబాదులోనూ అదే జరుగుతుంది, ఘజినీకి మన దేవుడు కేవలం రాయిలాగే కనిపించాడు - తెలంగాణా వాళ్ళకి ఆంధ్రా వాళ్ళ విగ్రహాలూ అలాగే కనపడతాయి, అందులో వింతేముంది?నిర్దాక్షిణ్యంగా పగల గొట్టేస్తారు,కేవలం తెలంగాణాకు సంబంధించినవి మాత్రమే పెట్టుకుంటారు, అప్పుడు మాత్రం భూమి బద్దలవుతుందా?ఆకాశం చిల్లు పడేలాగ ఆంధ్రమాత యేడుస్తుందా?యేమీ కాదు, అంతా ఇప్పట్లాగే వుంటుంది, అవునా జై గారూ?!

      తొలగించండి
  4. NTR constituted a committee (headed by CiNaRe) to select the names of these telugu greats. The statues have been erected as recommended by the committee.

    రిప్లయితొలగించండి
  5. *ఏ మన్యప్రజల జీవితాలాలో చీకటి పారద్రోలాలని పోరాడారో వారు తెలుగు వారు కాదు.*

    జై గారు,

    మీలాంటి వాదనను ఉస్మానియా, జె.యన్.టి.యు., సెంట్రల్ యూనివర్సిటిల లో కొంతమంది వినిపిస్తారు. ఈవాదనకు కాలం చెల్లింది. మీరు గమనించాల్సిందేమిటంటే ఇటువంటి వాదనని ఆంధ్రావాళ్లు పట్టించుకోరు. ఆంధ్రా మేధావులకి విశాలమైన దృక్పథం ఉంది. సంచారా జాతులైన (నక్కలోళు,సుగాలి లు మొదలైన ) వారి భాషని (లిపి లేదు) స్వాతంత్ర సమరయోధుడు, నెల్లురుకు చెందిన కాంగ్రెస్ పార్టి సభ్యుడు వెన్నెలకంటి రాఘవయ్య అనే బ్రాహ్మణుడు గ్రంథస్థం చేశాడని,చాలా రోజుల క్రితం దళితకవి కత్తి పద్మా రావు రాస్తే చదివినట్లు గుర్తు. మరి మీ లాజిక్ ప్రకారం, హిందువులో కారో తెలియని సంచారా జాతుల వారి భాషను బ్రాహ్మణుడు గ్రంథస్థం చేయటమేమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. కంచా అయ్యలయ్య తెలంగాణా ఏర్పడిన తరువాత రాసిన మొదటి వ్యాసంలో వెనుకబడిన తరగతుల వారి జీవితంలో, ఆంధ్ర సమాజంలో వచ్చిన మార్పులు తెలంగాణా వారిని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఏకరువు పెట్టాడు. అది మీరు చదివే ఉంటారు. మీరు ఆంధ్రా మేధావుల విశాలదృక్పథాన్ని, ఆంధ్రా రాజకీయ నాయకుల సంకుచిత తత్వాన్ని ఒకే గాటన కడుతున్నారేమో అనిపిస్తున్నాది. అది భావ్యం కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరాం గారూ, మేధావుల విశాల దృక్పథం పై నాకు ఎటువంటి అనుమానం లేదు. ఉ. కత్తి పద్మారావు గారు చేసిన పోరాటాలకు దేశమంతా ఆయనకు రుణపడింది.

      మీరు నా వ్యాఖ్యను isolatedగా చూసారేమే మొత్తం trail చదివితే నా ఉద్దేశ్యం తెలుస్తుంది. All I am saying is "if uplifting Telugus is the criterion, please note Alluri fought for tribals whose mother tongue is not Telugu".

      తొలగించండి
  6. ఇన్ని వివాదాలతో ఆ విగ్రహ నాయకులని అవమానించే కన్నా.అవన్నీ తొలగించి, రాజీవ్ గాంధి, ఇందిరా గాంధి, సోనియా గాంధి, వీలైతే రాహుల్ గాంధి బొమ్మలు పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు కదా. ఇప్పటికే వీరిలో చాల మంది పేరుతొ అనేక పేటలు నగరాలు, గల్లిలు ఉన్నాయి కదా.వాటి మీద ఎవరికీ అభ్యంతరం లేదు. అలా అభ్యంతరం లేని వారివి పెడితే ఏ గోలా ఉండదు. వాళ్ళు వివాద రహితులైనా కాకపోయినా మన వాళ్లకి వివాదం ఉండదు కదా.

    రిప్లయితొలగించండి
  7. విగ్రహాలను తొలగించటం అనేది ఒక చెడు సంప్రదాయాన్ని మొదలు పెట్టడం అని నా అభిప్రయమ్. రేపు 5 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా దేశం గవర్నమెంట్ వస్తే వాళ్ళు వాళ్ళకి నచ్చని విగ్రహాలను తొలగిస్తారు. అది అలా ఉంచితే tankbund మిద ఉన్న విగ్రహాలలో కొన్ని వ్యక్తిగత ఇష్టానుసారం గా ఏమ్పిక చేయబడినవి అన్న విషయం స్పష్టం. ఘంటసాల, దాశరథి తదితరుల విగ్రహాలు లేకపోవడము వ్యక్తిగత ఇష్టానుసారమే.

    రిప్లయితొలగించండి
  8. కోట్లు దండుకున్న రాజకీయ నాయకుల విగ్రహాలన్నీ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ల నుంచి తొలగించి, తెలుగు కవుల,గాయకుల,చిత్రకారుల,సాంఘిక సంస్కర్తల,మేధావుల,ఆటగాళ్ల విగ్రహాలను ప్రభుత్వాల ఖర్చుతో ప్రతిష్టించాలి!

    రిప్లయితొలగించండి
  9. "2 మెహబూబ్ ఆలీ ఖాన్"

    నిజాము నవాబు అంటే ఎన్టీఆర్ గారికి కూడా గురే భలే భలే!

    రిప్లయితొలగించండి
  10. ఝై గారూ

    అసలు తెలంగాణేతర తెలుగు వారికి బ్రతికే హక్కు లేదండీ !! వాళ్ళు ఎంత పనికి మాలిన వారు కాకపోతే హైదరాబాదు "మన" రాజధాని అనుకుంటారు ? మరో మాట కూడా ఉందండోయ్ ! వీలుంటే కట్ట కట్టి వారందరికీ సామూహిక అగ్ని ప్రవేశమో, ఉరి శిక్షనో అమలు చేస్తే తెలంగాణా ప్రాంతంలో ఎమి ఖర్మ, కోస్తా జిల్లాలు, రాయల సీమ జిల్లాలు అన్నిట్లో కేవలం తెలంగానా వారిమి విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఈ దేశంలో ఎవ్వరినీ ఎవ్వరూ తూలనాడనంతగా కులాలకు, మతాలకు అతీతంగా ఎంత బాగా ఆంధ్రోల్లని తిట్టారండీ, ఎన్ని అబద్ధాలు, ఎన్ని తప్పుడు మాటలు సాటి వారితో పడుతున్నా, భరిస్తూ, తమ హక్కు కోసం ప్రశ్నించలేని వారికి నిజంగానే బ్రతికే హక్కు లేదు. శ్యామలరావు బాబాయి గారూ, మీరు ఆదికవి నన్నయ్య అనకండి, తెలంగాణాకి 1000 ఏళ్ళ క్రితమే అన్యాయం జరిగింది అంటారు !! (తెలంగాణా అనే పదం అస్సలు ఎప్పుడు పుట్టిందో కూడా మళ్ళీ వారికి తెలీదు). తెలంగాణా కవులకి మరో అన్యాయం జరిగిందండీ, ఆంధ్ర కవులు మహా భారతం ముందె తెనిగించి, పోతన గారికి భాగవతం వదిలేసారు (పాపం, పోతనగారు, ఆంధ్ర మహా భాగవతం రాశారండీ, తెలీక, తెలంగాణా మహా భాగవతం అని గ్రంధం పేరు మార్చాలి ముందు అత్యవసరం గా !!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విగ్రహాలుగా వుంటేనే గొప్పెళ్ళ వుతారా! గొప్పోళ్ల లోనూ పనికి మాలినోళ్ళు వుంటారా? విగ్రహాలు నెలకొల్పడనికి కూడా ప్రాంతానికి సంబంధించిన దామాషా లెక్కలు కావాలా?జై అనే ఈ గొట్టి ముక్కల సిధ్ధాంతి దగ్గిర జిల్లావారీ సమాచారం కూడా వున్నట్టుంది, ఆంధ్రాలో తెలంగాణా విగ్రహాలు యెన్ని వున్నాయో, తెలంగాణాలో ఆంధ్రావాళ్ళ విగ్రహాలు యెన్ని వున్నాయో సర్వే కూడా చేసినట్టు వున్నాడు, జీపీయస్ వివరాలతో సహా చెప్పగలిగినట్టుగా వుంది చూస్తుంటే!అకడున్న విగ్రహాల లిష్టు తయారు చేసింది మీ తెలంగాణోదే - సెనారే , పోయి అడుగు లిస్టులో వుంచదానికి క్రైటేరీయాలు చెప్తాడు.

      శ్యామలీయం గారికీ, ఇంకా అమాయకంగా ఆంధ్రా స్టొన్స్ కోసం బాధ పడుతున్న వారిపైన నా ప్రగాఢ సానుభూతి.ఇదే విషయం మీద ఇటీవల 'ప్రజా దగ్గిర కూడా చర్చ జరిగింది.ఇక్కడున్న వారిలో కొందరు అక్కద కూడా వున్నారు.మీకందరికీ వున్న కొన్ని అమాయకత్వాల్ని తొలగించాలని ప్రయత్నిస్తున్నాను,యెంతవరకు సఫలీకృతుడను కాగలనో తెలియదు!.అక్కద చర్చ లో కేసీఆర్ ది నోటిదూల గా భావించారు కొందరు!కానీ చర్చ ను కొనసాగిస్తూ జై చేసిన వాదనల్నీ భావి స్టోన్స్ యొక్క లిస్టును ప్రతిపాదిస్తూ తను చేసిన వాదననీ గమనించారా?కేసీఅర్ ది నోటిదూల అన్న ఆ పెద్దమనిషి స్టోన్స్ ను మార్చి తీరాల్సిందే నని అంటూ కేసీఆర్ "పనికిమాలినోళ్ళు" అనకుండా "మన చరిత్రకు సంబంధించనోళ్ళు" వున్నారు అని కేసీఆర్ అని వుంటే బాగుండేదని సవరించాడు, గుర్తుందా?అక్కడ మన చరిత్ర - అంటే మొత్తం తెలుగు వాళ్ళ చరిత్ర అని కాదు గదా అతను అంటున్నది, తెలంగాణా చరిత్రకు సంబంధించని వాళ్ళు యెవరూ ఆంధ్రవాళ్లతో సహా వుందరు అని తెగేసి మరీ చెప్పాడు, అయినా మీరు ఇంకా కేసీఆర్ ది నోటిదూల అనే నమ్ముతున్నారా?"అన్నా, మన రాష్ట్రం లో మనకు నచ్చిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే పక్క రాష్ట్రం వాళ్లు అభ్యంతర పెడితే మనం లెక్క చేస్తామా?" అనే మాట విన్నాక కూడా మీకు తెలియడం లేదా, ఇవేవీ రాండం గా జరుగుతున్నవి కావని?

      కాదని నాకెప్పుడో తెల్సు.అక్కడెవరూ హఠాతుగా వుద్రేకంతో యేదో చేసేవాళ్ళూ లేరు, నోటిదూలతో అక్కర్లేని విషయాలు మాట్లాడే అమాయకులూ లేరు.వాళ్లని రాందంగా యేదో చేసే వుద్రేకపరులనీ వాళ్ళ వుద్యమ నేతా మరియూ ఇప్పటి ముఖ్యమంత్రికీ నోటిదూల అనీ నేననుకోవదం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం నుంచీ కొన్ని దశాబ్దాలకు సరిపడా ప్లానులు వేసుకుని వున్నారు వాళ్ళు. నాకు తెలుసు.మీరూ తెలుస్కోండి. వాళ్ళు మీకెంత ఇష్తం లేని పనులు చేసినా చూస్తూ వుండటమే తప్ప వాళ్లని ఆపగలగటం మీకు అసాధ్యమని కూడా నాకు తెలుసు. తెలంగాణాలో ఆంధ్రా స్టోన్స్ కూడా వుండటానికి వీల్లేదని అంటున్నవాళ్ళు ఆంధ్రోళ్లని కడుపుల బెట్టుకు చూస్తరట!వాటే జోక్?

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.