23, జులై 2014, బుధవారం

కొంచెం నా సంగతి.


నేను మేథావిని కానే కాను కాబట్టి ఖచ్చితంగా బ్రతికిపోయాను
లేకుంటే ఏదో జెండానో ఎజెండానో మోస్తూ వ్యాసాలు వ్రాసే దుర్గతి పట్టేదేమో!

నేను గొప్పవాణ్ణి కాకపోబట్టి అదృష్టవంతుణ్ణని అర్థమైపోయింది
లేకుంటే ఎవరు నా బొమ్మ పెట్టేవారో ఎవరు దాన్ని కూలగొట్టేవారో!

నేను వారసులకు నోచుకోకపోవటమూ ఒక వరమే అయ్యింది
లేకుంటే వచ్చే తరాల్లో ఎవరెవరు నన్నెన్ని మాటలనే పరిస్థితి వచ్చేదో!

నేను రాముణ్ణి నమ్ముకోవటం అనేది నాపురాకృతసుకృతఫల మయ్యింది
లేకుంటే ఈ భవసాగరతరంగాల ఆటుపోట్లను ఎలా తట్టుకో గలిగే వాడిని?



7 కామెంట్‌లు:

  1. మొత్తానికి మీరు అదృష్టవంతులయ్యారన్నమాట :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతే నండి. సరిగ్గా చెప్పారు.
      తృప్తిం జెందని మనుజుడు సప్తద్వీపముల నైన చక్కం బడునే
      అని పోతనగారు వాక్రుచ్చారు కదండీ బలిచక్రవర్తి పాత్ర ద్వారా.

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. నిజమే బాబాయి గారూ !! రాముని దయ ఉంటే భవసాగరమీదడం కష్టతరం కాదు !!

    రిప్లయితొలగించండి
  5. Mee blog chaalaa chaalaa bagundi sir. Mee blog choosi anandam vesindi.

    Sir recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

    http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

    Sir please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your comment in english language.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.