15, ఆగస్టు 2014, శుక్రవారం

జననీ భారతీ నమోస్తుతే


జననీ భారతీ నమోస్తుతే  వరదే
ఘనకీర్తియుతే కల్యాణప్రదే పదేపదే 

గంగాగోదావరీత్యాది ప్రాణహితపుష్కరవాహినీ సమేతే
సంగరహితమునిరాజముఖ్యగణసేవ్యమానశుభచరణే  ॥జననీ॥

కాశీశ్రీశైలప్రయాగభధ్రాద్రీత్యాదిఘనపుణ్యక్షేత్రకోటివిరాజితే
రాశీభూతకారుణ్యమూర్తే రమణీయప్రకృతిశోభావిభాసితే ॥జననీ॥

వేదోపనిషద్వివేకసంశోభితపూతధాత్రే విపులవిజ్ఞానప్రదాత్రే
మోదప్రదాత్రే మోక్షప్రదాత్రే వేదాస్యాద్యభినుతయాగధాత్రే ॥జననీ॥