30, ఆగస్టు 2026, ఆదివారం
జనులారా నాపేరిది యని యెందుకు తలచేరో
అందరును నావారే ననుకోవయ్యా
అందరును నావారే ననుకోవయ్యా హరి
నందరిలో పెద్దబంధు వనుకోవయ్యా
ఆదుకొనే వాడు బంధు వనుకోవయ్యా హరి
యాదుకొన్నటుల నెవ్వ రాదుకొందురయ్యా
చేదోడై యెవరుండిన చెంతనెవరు లేకుండిన
ఆదుకొనుచు సన్నిహితుం డగుచు హరి యుండడా
ఆశ్రయము నిచ్చు బంధు వనుకోవయ్యా హరి
నాశ్రయించి జగము లున్నవనుచు తెలియవయ్యా
ఆశ్రయించ నెవరుండిన నస లెవ్వరు లేకుండిన
నాశ్రిత సంరక్షకుడై హరి చక్కగ నుండడా
పిలిచినపుడు పలుకువాడె పెద్దబంధుయయ్య యిన
కులతిలకా యనగానే పలుకు శ్రీరాముడయా
ఇల నీతో నెవరుండిన నెవ్వరు నిల లేకుండిన
కలనైనను నిను వీడక ఘనుడు హరి యుండడా
29, ఆగస్టు 2026, శనివారం
తప్పక మనకున్న దొక దగ్గర దారి
తిప్పలును లేని యొక తిన్ననైన దారి
హరినామస్మరణమే యాదారి
హరికంకితమగుటయే యాదారి
మరి వేరేదియు లేదు మంచిదారి
అరుగరాని దితరులకు నాదారి
పురుషోత్తము నింటికే పోవుదారి
మరి వేరేదియు లేదు మంచిదారి
హరేకృష్ణ యనుటయే యాదారి
హరిని కీర్తించుటయే యాదారి
మరి వేరేదియు లేదు మంచిదారి
24, ఆగస్టు 2026, సోమవారం
శివమయము కాని దేది జీవుడా
దేవుడే దిక్కు
దేహమేల నెల్లప్పుడు దేవుడే దిక్కు
చేవచెడి యున్న వేళ దేవుడే దిక్కు స
ర్వావస్థల జీవుల కాదేవుడే దిక్కు
దేవతలకు నైనను దేవుడే దిక్కు ఆ
దేవేంద్రున కైనను దేవుడే దిక్కు
భూవలయ మందైనను దేవుడే దిక్కు ఆ
దేవభూమి యందైనను దేవుడే దిక్కు
వేవురిలో నుండినను దేవుడే దిక్కు మరి
నీవొక్కడ వైయున్నను దేవుడే దిక్కు
జీవునకు సంసారమందు చేరిన దాది
త్రోవకాన రాని దైన దేవుడే దిక్కు
చావైనను రేవైనను దేవుడే దిక్కు ఆ
దేవదేవుడైన రామదేవుడే దిక్కు
15, ఆగస్టు 2026, శనివారం
దశరథనందన పాహి
దశరథనందన పాహి
దశముఖమర్దన పాహి
9, ఆగస్టు 2026, ఆదివారం
హరినామామృత మానగ నొల్లని
నరునకు మోక్షము నాస్తి సుమా
శ్రీరామ మారాథ్యపాదుకం కారుణ్యవారాన్నిధిం భావయే
శ్రీరామ మారాథ్యపాదుకం కారుణ్యవారాన్నిధిం భావయే
శ్రీహరినామము చేయండీ
3, ఆగస్టు 2026, సోమవారం
ఎంతకాల మున్నచో నంతకష్టము
1, ఆగస్టు 2026, శనివారం
శివుడు పెట్టకుండ బువ్వ చేతికి రాదు
శివుడు పెట్టకుండ బువ్వ చేతికి రాదు ఆ
భవుడీయక రామమంత్రభాగ్యము లేదు
వివరముగా చెప్పనేల విరించ్యాదులకును గూడ
భవతారకమంత్రమహిమభావ్యము కాకుండును
శివభక్తిపరాయణులకు చిక్కును హరిమంత్రము
శివశివశివ యనకుంటే జీవితము వృథా
శివుని నుండి పార్వతికి చెందినదా మంత్రము
శివుడు హనుమయై యుపాసించిన హరిమంత్రము
శివుడు భిక్షగా నీయక చిక్కదు భవతారకము
శివుని వేడి బడయలేని జీవితము వృథా
శివుడు భోళాశంకరుడు జీవులందరకు హితుడు
శివుని పురము చేరి మీరు శివుని మెప్పించవచ్చు
శివసన్నిథి నున్న చాలు శివుడిచ్చును మంత్రము
శివుని చేరమనే వారి జీవితము వృథా
హరేరామ హరేరామ హరేరామ రామ
నిరంతరము నీపేరే స్మరించేము రామ
సిరులను మేమిన్నాళ్ళును స్మరించితే రామ
స్మరించనే లేదు మమ్ము సిరులో రఘురామ
సిరుల కొరకు తపించుచు చెడుటకన్న రామ
హరిస్మరణము మేలన్నది యెరుగమైతి రామ
నరులను మేమిన్నాళ్ళును నడ్డివిరుగ రామ
విరుగబడి కొలువ కొలువ నేమొరిగెను రామ
పరులను సేవించుచు నిల బ్రతుకకుండ రామ
హరిసేవయె మేలన్నది యెరుగమైతి రామ
సుఖము కొరకు నిన్నాళ్ళును చూచిచూచి రామ
మఖవశివబ్రహ్మాదుల మాటలెన్ని రామ
సుఖమన హరిస్మరణదివ్య సుఖమనుచు రామ
సుఖముగా నిన్ను తలప జొచ్చితి మో రామ