హరేరామ హరేరామ హరేరామ రామ
నిరంతరము నీపేరే స్మరించేము రామ
సిరులను మేమిన్నాళ్ళును స్మరించితే రామ
స్మరించనే లేదు మమ్ము సిరులో రఘురామ
సిరుల కొరకు తపించుచు చెడుటకన్న రామ
హరిస్మరణము మేలన్నది యెరుగమైతి రామ
నరులను మేమిన్నాళ్ళును నడ్డివిరుగ రామ
విరుగబడి కొలువ కొలువ నేమొరిగెను రామ
పరులను సేవించుచు నిల బ్రతుకకుండ రామ
హరిసేవయె మేలన్నది యెరుగమైతి రామ
సుఖము కొరకు నిన్నాళ్ళును చూచిచూచి రామ
మఖవశివబ్రహ్మాదుల మాటలెన్ని రామ
సుఖమన హరిస్మరణదివ్య సుఖమనుచు రామ
సుఖముగా నిన్ను తలప జొచ్చితి మో రామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.