9, ఆగస్టు 2026, ఆదివారం

శ్రీహరినామము చేయండీ


ఊహలపోహలు మానండీ
శ్రీహరినామము చేయండీ

శ్రీహరినామము చేసెడు వారికి
  చింతలు దూరం  బగునండీ
శ్రీహరినామము చేసెడు వారికి
  చిక్కులు బహుదూరంబండీ
శ్రీహరినామము చేసెడు వారికి
  క్షేమము నిత్యం బగునండీ
శ్రీహరినామము చేసెడు వారల
  జీవితమే ధన్యంబండీ

శ్రీహరినామము శివు డనిశంబును
  చింతించునని తెలియండీ
శ్రీహరినామము త్రిలోకములకును
  శిరోధార్యమని తెలియండీ
శ్రీహరినామము చేసినకొలదియు
  జిహ్వకు రుచియని తెలియండీ
శ్రీహరినామము చేయుట వలననె
  దేహికి మోక్షము తెలియండీ

హరేరామ శ్రీహరేరామ యని
  నిరంతరము ధ్యానించండీ
హరేకృష్ణ శ్రీహరేకృష్ణ యని
 నిరంతరము ధ్యానించండీ
హరినామజపానందముతో నిహ
  పరముల సుఖమును పొందండీ
కరుణామయుడగు శ్రీహరికృపచే
  హరిసన్నిధికే చేరండీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.