హరినామామృత మానగ నొల్లని
నరునకు మోక్షము నాస్తి సుమా
నరునకు మోక్షము నాస్తి సుమా
హరి లేనే లేడను వారలతో
పొరబడి స్నేహంబును చేయుటచే
నిరంతరంబుగ నీచవాక్యముల
హరిపై రువ్వుచు నపహసించుచును
హరిపారమ్యము నాక్షేపించుచు
మరి యింకొక్కని పరదైవత మని
తరచుగ మ్రొక్కుచు తమోగుణంబున
హరిలో వెదకుచు నవగుణంబులను
హరికాదు కదా సిరిముఖ్యం బని
దురాశ నటునిటు తిరుగుచు బ్రతుకును
కరగించుచు శ్రీకరుడగు హరినే
మరచి చరించెడు మతిహీనుం డగు
హరిపై భక్తియె యలవడ నీయని
పురాకృతముచే పుట్టిన దాదిగ
తరించవలెనను తలపే కలుగక
పొరబడి యైనను హరి యన నేరక
గురువులు కొందరు గుఱుతెఱుగకయే
తరచుగ దుర్బోధలు చేయుటచే
పరాత్మరుని యెడ పరాంగ్ముఖత్వము
తిరమై దుర్మతపరుడై తిరుగుచు
హరేరామ యని హరేకృష్ణ యని
నరుడ న్నంతనె నవ్వుచు వైళమ
వరంబులిచ్చెడు కరుణామయు డగు
హరి యున్నా డని యాత్మ నెఱుంగక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.