2, సెప్టెంబర్ 2026, బుధవారం

నీ వెవ్వడవని నేనడిగితినా


నీ వెవ్వడవని నేనడిగితినా
నీ వడిగితివా నేనెవ్వడనని

మెచ్చని లోకము మీరెవ్వరని
పిచ్చిమాటలను ప్రేలును చూడు
ముచ్చటగా మన మొకటై యుండిన
కచ్చ దేనికీ కాపురుషులకు

నిన్నెరుగుననా నిను నిందించును
నన్నెరుగుననా నను నిందించును
నిన్నడగునురా నేనేవడనని
నన్నడగును నీకున్న దేమిటని

నేను నచ్చనట నీవు నచ్చవట
నీనా నెయ్యము తాను మెచ్చదట
పోనీ రామా ముఖ్యంబైనది
నేనును నీవును నేస్తుల మగుటే