హరియే యిటులాడు మనిన నాడను బొమ్మందునా
పలు బొమ్మలలోన దూఱి బాగుగనే యాడితిని
పలుగాకుల మాటలకును బాగుగనే యేడ్చితిని
కలసిరాదు కాల మన్న కానిమ్మని యంటిని
తెలియనటు లుండు మనిన తిరిగితి నాభంగిని
తెలివిడి లేనట్టు లాడె జలజాక్షుడు తెలిసియును
జలజనయన కొఱకై శ్రీజానకీరాము డగుచు
తెలివిడి లేనట్టు లాడ తెలిసియు నే నేగనా
తెలిసి తప్పులెంచు వారి కలిసికొనగ నీపూట
రామరామ యనుకొనుచు నామనసున నిక్కముగ
ధీమంతుడు నగుచు నేను తెలిసిన హరి యాటలో
నేమేమి పలుకవలయు నేమి చేయవలయునో
రామార్పణముగ చేయ ప్రయాణమై పోవనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.