18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

హరేరామ జయ యనేవారికే బరాబరిగ మోక్షం

 
హరేరామ జయ యనేవారికే బరాబరిగ మోక్షం శ్రీ
హరేకృష్ణ జయ యనేవారికే సరాసరిగ మోక్షం 

నిరంతరముగా హరిని స్మరించిన బరాబరిగ మోక్షం
హరిస్మరరణము నేమరని  వారికే సరాసరిగ మోక్షం
హరిభక్తులకే ధరాతలంబున బరాబరిగ మోక్షం
బరాబరిగ మోక్షం బాబూ సరాసరిగ మోక్షం

పరమపురుషుడని రాముని నమ్మిన బరాబరిగ మోక్షం
శరణాగతుడై హరిని వేడితే సరాసరిగ మోక్షం
హరియే సర్వస్వంబని నిలచిన బరాబరిగ మోక్షం
బరాబరిగ మోక్షం బాబూ సరాసరిగ మోక్షం

గురువును దైవము హరియని నమ్మిన బరాబరిగ మోక్షం
హరిపారమ్యము నెరిగన వారికి సరాసరిగ మోక్షం
నరునకు వేరొక దారిన దొరుకదు బరాబరిగ మోక్షం
బరాబరిగ మోక్షం బాబూ సరాసరిగ మోక్షం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.