నమ్మిన రాముడు నా కగుపడడే
యిమ్మహి వా డిపు డెందున్నాడో
ఎందున్నాడో యెవ్వరి కెరుకో
యిందీవరాక్షుడు యినకులతిలకుడు
మందిరశతమున మరిమరి వెదకితి
నెందును లేడే యేమైనాడో
వనముల మునులే తనవారని నే
విని యుంటిని నా విభుని జాడలను
మునిజను లందరి మనసుల వెదకితి
కనరా కెచటికి చనినాడో కద
దాగుడుమూతలు తనకు వినోదము
బాగోలే దన వశమా ఐనను
ఆగుదునా హరి నరయుచు నిటులే
సాగుదు విడవక సంతోషముగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.