చిన్నమాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిన్నమాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, నవంబర్ 2026, మంగళవారం

చిన్నమాట. "మిష్టర్ వీటో"

ట్రంప్ గారికి కోపం వచ్చింది. డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్‌ వీటో’గా మారిపోతా.. అని గర్జించారు. డెమోక్రాట్లు గెలిస్తే అన్ని నిర్ణయాలను వీటో చేస్తానని హెచ్చరించారు.

చిత్తం. అంతా మీయిష్టం కదా ట్రంప్ గారూ. మీరేమో ప్రజలెన్నుకున్న అద్యక్షులాయె. ఇంకా ప్రజలు వేరెవరికైనా ఓటు వేయటం ప్రజాస్వామ్యం ప్రకారం చెల్లదు కదండీ. మీరే దేశం. మీరే ప్రజలు. మీరే ప్రపంచం. కాదన్నవాడికి పుట్టగతులు ఉండకూడ దంతే.

చిన్నమాట. "అటు నేనే - ఇటు నేనే"

రాప్తాడులో గోపిక అనే విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను కాపాడేందుకు జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన సాల్మన్‌ రాజు, మంగళగిరికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు గుండా గోపీకృష్ణ ద్వారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయించారని ఒక వార్త వచ్చింది. అందులో "ఒకవైపు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆడబిడ్డను పరామర్శించి మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు ఆ దాడికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు" అంటున్నారు!

జగన్ గారు "అటు ఉన్నది నేనేలే ఇటు ఉన్నది నేనేలే" అంటున్నా రన్న మాట

చిన్నమాట. "ఉద్యమకారుడి బలవన్మరణం"


జనగామ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్  ఆత్మహత్య వార్త, "తండ్రి కష్టపడి చదివిస్తే, ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని పాడుచేసుకున్నాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల బతుకులు మారలేదు" అని ఆవేదనతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు!

కేసీఆర్ & కుటుంబం కన్నా గొప్ప ఉద్యమకారులు ఎవరున్నారు? వారి బ్రతుకులు ఎంతగా మారాయి? వారెంత బాగుపడ్డారు? కాని ఉద్యమకారుల బ్రతుకులు మారలేదు అంటున్నారు ఏమిటి?