ఆడ నీడను నీవె యండగా నుండగా
వేడ నేమిటి కితర వేల్పుల నింక
వేడి చెడినది చాలు వివిధజన్మంబులను
నేడుండి రేపుచెడు నీచసంపదలకు
వాడని భాగ్య మపవర్గంబు నందించు
వాడవు నీవనుచు నేడుగా నెఱిగితిని
కూడ రాని వారి కువలయంబున నేను
గూడి చెడినది చాలు కూడ నికమీదను
వేడుకతోడ నిదే విభుడ శ్రీరఘువర
నేడు నిను చేరితిని నిక్కంబుగాను
విడువ నీసన్నిదిని విమల స్వస్వరూప
మడగి మన యభేదము తొడిగితి దేహము
విడువని మాయచే వేలజన్మల నుండి
పడుచున్న బాధలను బాప నాతోడగుచు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.