23, సెప్టెంబర్ 2026, బుధవారం

అధ్యక్ష విన్యాసాలు


అధ్యక్షుడు అంటే ఆయనే.

తనను పదవి నుండి దించివేస్తే అధికారసౌధాన్ని అనుచరులను వెంటవేసుకొని పోయి ముట్టడించి గలాభా చేసారు.

పట్టుదలతో మళ్ళీ ఎన్నకలలో గెలిచి ఆ అధికారసౌధాన్ని దర్జాగా స్వాధీనం చేసుకున్నారు.

గతంలో తాను చేసిన గలాభా తాలూకూ కేసును కూడా అంతే దర్జాగా ఎత్తి అవతల పారేసారు.

ఈయన వ్యవహారశైలితో తగాదాపడి సోషల్ మీడియా తనను బహిష్కరిస్తే తానే ఒక పోటీ సోషల్ మీడియాను ప్రారంభించారు. 

తనను సబహుమానంగా కవర్ చేయటంలేదు టీవీ ఛానెల్స్ అని తోచగానే వాటినీ అధికారసౌధం నుండి బహిష్కరించారు.

ఆయనకు తెలియనిది లేదు.

అలా ఉండటానికి వీల్లేదంతే.

ఆయనకు నచ్చనిది ఉండటానికి వీల్లేదు.

వీల్లేదంతే.

అలా ఉన్నది ఏదైనా కనిపిస్తే దాన్ని తనకు నచ్చినట్లు మార్చి అవతల పడేస్తారు.

జలసంధులు, ద్వీపాలు దేశాలు ఏవైనా సరే అధ్యక్షుల వారికి నచ్చకపోతే పేరు మార్చేసుకోవలసిందే.

కొత్తగా వారికి నచ్చనిది మరొకటి కనిపించింది.

దాని పేరు మార్చేసారు.

మీరు కాని ఆపాతపేరు వాడారో మీరు అద్యక్షుల వారి ఆనతిని ధిక్కరించిన నేరస్థులు ఐపోతారు.

మీరు విదేశీమూలం కలవారైతే దేశంనుండి గెంటేయకలరు జాగ్రత్తగా ఉండాలి.

మీది వేరే దేశం ఐతే మీదేశం మీద ఆర్ధికమైన ఆంక్షలు విధించగలరు.

ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప ప్రమాదం పొంచి ఉంది.

ఈ అద్యక్ష మహాశయులను పదవీకాలం పూర్తి అయిన పిదప నిబంధనలన్నీ మార్చిపారేసి ఐనా తిరిగి ఎన్నుకోకపోతే?

వారి ఆగ్రహం ఎంతదూరం పోతుందో?!!

 వారు తమదేశం రాజ్యాంగాన్ని మార్చేస్తారా?

తమ దేశం పేరునే మార్చేస్తారా?

ఒక వేళ కొంపమునిగి అద్యక్షుల వారిని హోల్ మొత్తం ప్రపంచం ఛీ కొట్టితే? వారు దిగిపోక తప్పనిసరి పరిస్థితే వస్తే?

అధ్యక్షుల వారు దిగిపోతారా?

ప్రపంచాన్నే తిరస్కరించి పోటీ ప్రపంచాన్ని ఏర్పాటుచేస్తారా?

ఏమో!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.