24, ఆగస్టు 2026, సోమవారం

శివమయము కాని దేది జీవుడా


శివమయము కాని దేది జీవుడా పరమ
శివుడు లేని చోటు లేదు జీవుడా

చెట్టు పుట్ట లన్నిటిలో శివుడు కలడు జీవుడా
గట్టు గుట్టు లన్నిటిలో కలడు శివుడు  జీవుడా
పిట్ట పశువు లోన తానె వెలుగు శివుడు జీవుడా
పట్టరాని శివునివెలుగు భావించర జీవుడా

శివుని కాక యితరములను చింతించే జీవుడా
శివుని నీవు తెలియుటెట్లు చెప్పవయ్య జీవుడా
శివచింతన కలిగి నీవు జీవించిన జీవుడా
శివుని యనుగ్రహము నీకు సిధ్ధించును జీవుడా

శివుని నీవు మనసారా చింతిచిన జీవుడా
శివుడిచ్చును భవతారక చింతామణి జీవుడా
శివుడిచ్చిన రామమంత్ర సిధ్ధి వలన జీవుడా
చివరకు  కైవల్యపదము చేరగలవు జీవుడా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.