దేహధారు లందరకును దేవుడే దిక్కు సం
దేహమేల నెల్లప్పుడు దేవుడే దిక్కు
దేహమేల నెల్లప్పుడు దేవుడే దిక్కు
చేవచెడి యున్న వేళ దేవుడే దిక్కు స
ర్వావస్థల జీవుల కాదేవుడే దిక్కు
దేవతలకు నైనను దేవుడే దిక్కు ఆ
దేవేంద్రున కైనను దేవుడే దిక్కు
భూవలయ మందైనను దేవుడే దిక్కు ఆ
దేవభూమి యందైనను దేవుడే దిక్కు
వేవురిలో నుండినను దేవుడే దిక్కు మరి
నీవొక్కడ వైయున్నను దేవుడే దిక్కు
జీవునకు సంసారమందు చేరిన దాది
త్రోవకాన రాని దైన దేవుడే దిక్కు
చావైనను రేవైనను దేవుడే దిక్కు ఆ
దేవదేవుడైన రామదేవుడే దిక్కు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.