మెలకువ రాగానే పలకరింతు రాముని పులకరించి పలకరింతు జలధరసుశ్యాముని |
|
నా రాముని దయవలన నాకు గలిగె నీ తనువు నా రాముని సేవలోన నడచి పోవు నా బ్రతుకు నా రాముని తలపులే నా కన్నము పానము నా రాముని పొగడుటయే నాకు సంతోషము |
మెలకువ |
నా రాముడు లేని చోటు నా కగుపడకుండు నా రాముడు పవలురేలు నన్ను కాచియుండు నా రాముడు నిదురనైన నన్ను వదలకుండు నా రాముడు కలల నన్ను చేరి యాడుచుండు |
మెలకువ |
నా రాముని పాటలతో నాకు ప్రొద్దుపోవును నా రాముని యనుజ్ఞతో నాకు నిదురకల్గును నా రాముని నామముతో నాపెదవులు కదలును నా రాముని పొగడుకొనగ నాకు తెల్లవారును |
మెలకువ |
21, ఆగస్టు 2016, ఆదివారం
మెలకువ రాగానే పలకరింతు రాముని ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.