5, అక్టోబర్ 2013, శనివారం

వత్తురు బ్రహ్మజ్ఞానులు


వత్తురు బ్రహ్మజ్ఞానులు రామభక్తులు మా యింటికిదే
చిత్తము లోపల చిన్మయు నెపుడు చింతన జేసే వారిదే

చిరుచిరు నగవుల శ్రీపతి ముఖమును
తరచుగ కనుగొని తమ చిత్తంబుల
పరిపరి విధముల భావజజనకుని
కరుణను పొగడే కడు ధన్యు లిదే ॥వత్తురు॥

వడివడి ఘనపాపౌఘవిదారణ
మడుగిడి నంతనె యమరగ జేసే
కడు పుణ్యాత్ములు కలుషవిదూరులు
అడిగి వచ్చువా రాహా ప్రేముడి  ॥వత్తురు॥

ఘనపుణ్యోదయకాలం బిదియే
అని పొంగును హృదయంబు నిజంబుగ
ఇనకులపతి దయ ఇటు వచ్చుటయే
కనుగొన నిజభక్తాళిని బంపుట  ॥వత్తురు॥


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.