12, అక్టోబర్ 2013, శనివారం

అమ్మా నమ్మితి నమ్మా
  

అమ్మా నమ్మితి నమ్మా దయగన వమ్మా ఓ దుర్గమ్మా
ఉమ్మలికమ్ముల గమ్మున ద్రోయగ రమ్మా ఓ దుర్గమ్మాసర్వాపద్వినివారణనిపుణా సర్వవ్యాధినివారణనిపుణా
సర్వమృత్యునివారణనిపుణా సర్వమంగళా సర్వజ్ఞా
॥అమ్మా॥


సర్వభూతేశి సర్వమోహినీ సర్వగా సర్వతంత్రేశీ
సర్వార్థదాత్రి సర్వాధారా శర్వాణీ సర్వలోకేశీ
॥అమ్మా॥


సర్వాయుధధర దానవలోక గర్వపర్వతఘనదంభోళీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాంతా సర్వశక్తిమయి శ్రీమాతా
॥అమ్మా॥