11, అక్టోబర్ 2013, శుక్రవారం

అందరు చక్కగ మ్రొక్కండీ మీ రందరు శుభములు బడయండీ
  

అందరు చక్కగ మ్రొక్కండీ మీ
రందరు శుభములు బడయండీచక్కని తల్లికి మ్రొక్కండీ మీ
మక్కువ తీరగ కొలవండీ
ఒక్కుమ్మడిగా తల్లి కీర్తిని
దిక్కులు మ్రోయగ పాడండీ
॥అందరు॥


బంగరు తల్లికి మ్రొక్కండీ మీ
సంగతి తల్లికి తెలుసండీ
మంగళరూపిణి మన దుర్గమ్మ
కొంగుబంగరు మూటండీ
॥అందరు॥


చల్లని తల్లికి మ్రొక్కండీ మీ
రెల్లరు వలసిన వడగండీ
కల్లయు కపటము లేని వారికే
తల్లి యనుగ్రహ ముందండీ 
॥అందరు॥