రామచంద్ర వలదురా పరాకు దేవరా ఏమి యీ దాసుడు నీ కింత చులకనా గడచిన వే జన్మములను కాచితివి గాన ఎడతెగనిది బంధ మనుచు నెంచితిని గాన ॥రామచంద్ర॥ కామిత మది యిచ్చెద నని ఘనముగా బలికి నా మనవిని వినియు నన్ను మరచినా వేమి ॥రామచంద్ర॥ నిరుపమకరుణానిధి వని వరదుడ వనిగా పరమయోగివర్యు లెల్ల పలికెదరిది యేమి ॥రామచంద్ర॥ |
5, అక్టోబర్ 2013, శనివారం
రామచంద్ర వలదురా పరాకు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బావుందండీ! ఏ జన్మకైనా కాచే దైవమని విశ్వసించుటలోనే ధన్యత .
రిప్లయితొలగించండి