16, ఆగస్టు 2015, ఆదివారం

ఎందుజూచిన హరిగలడుఅందరికి హరిగలడు మరి యన్నిటికి హరిగలడు
ఎందుజూచిన హరిగల డానందరాముడై హరిగలడుఇవల నవల గల యన్నిటిని సృష్టించినవాడై హరిగలడు
స్థావరజంగమప్రవితతమగు నీ సర్వసృష్టియై హరిగలడు
కేవల నిర్గుణుడయ్యును గుణముల క్రీడ సల్పుచు హరిగలడు
జీవకోటిహృత్సరసిజములలో చిద్విలాసుడై హరిగలడు
అందరికి

అర్తితోడ తనపదముల బడువా రందరి కెప్పుడు హరిగలడు
నేర్తుము ప్రీతిని నినుగూర్చియని నిలచిన వారికి హరిగలడు
కీర్తి నర్థమును కోరి గొలువ పరికించి యిచ్చుటకు హరిగలడు
వర్తింతుము నీ వారలమై యను భక్తుల బ్రోచుచు హరిగలడు
అందరికి

నిరుపమతత్త్వఙ్ఞానము గలిగిన నిశ్చలమతులకు హరిగలడు
పరమయోగులను పరిపరివిధముల పరిపాలించుచు హరిగలడు
హరిపారమ్యము నెఱిగినవారికి యన్ని విధముల హరిగలడు
స్థిరముగ నమ్మిన వారికి భవవిఛ్ఛేదనపరుడై హరిగలడు
అందరికికామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.