18, ఆగస్టు 2015, మంగళవారం

నేలపై పుట్టినందు కేలా విచారము
నేలపై పుట్టినందు కేలా విచారము
మేలైన రామభక్తి మెత్తె పుణ్యముశ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మన
సార గడపుకొన్న జన్మము లెన్నింట 
సారెకును నేను ప్రియము మీర పాడితి గాన
జారకుండ నిలచితిని చక్కని భక్తి
నేలపై

వెలివిద్య లేల నేర్వ విలువైన రామవిద్య
తలలోన నాటుకొన్న తరువాతను
కలి యంటుకొనబోదు  కలుషమెల్ల వీగు
వెలలేని రామవిద్య వెలసియున్నను
నేలపై

కాలాంతరమున మోక్షగామిని కానుంటిని
ఈ లోన తన సేవ నిచ్చి ప్రేమతో
నీలమేఘశ్యాము డేలెడు జన్మములు
మేలే వేలైన గాని యేల దుఃఖము
నేలపై
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.