19, ఆగస్టు 2015, బుధవారం

ఆహా ఓహో అననే అనను
ఆహా ఓహో అననే అనను అందరి మాటలకు
బాహాబాహీలకు నే దిగను వలనుపదదు నాకునాలో నేనే రామరామయని నాదుభక్తి కొలది
వీలుచేసుకొని తలచుకొందును వెఱ్ఱిప్రేమ నాది
ఈ లోకములో ఎవరికి నచ్చును ఎవరికి నచ్చదిది
ఏల గణింతును నా మనసున కిది మేలని తోచినది
ఆహా

నా జీవితమిది నా భాగ్యమిది నా సంతోషమిది
రోజురోజునకు పెరుగుచున్నది లోకము చూడనిది
నా జన్మంబును ధన్యము చేయుచు నాదగు పుణ్యనిధి 
నా జీవనము రామార్పణము నాదు బుధ్ధి నాది
ఆహా

కొందరు హరిభక్తులుకని మెచ్చెద రందు వింతలేదు
కొందరు రామవిరోధులు తిట్టెద రందు వింత లేదు
అందరు జీవులు కర్మబంధముల కనుగుణమగు బుధ్ధి
పొంది రాముని పొగడుట తెగడుట యందు వింతలేదు
ఆహా6 కామెంట్‌లు:


 1. ఇందులోని 'హరి' ఎవరు ? రామ విరోధి ఎవరు ?

  "కొందరు హరిభక్తులుకని మెచ్చెద రందు వింతలేదు
  కొందరు రామవిరోధులు తిట్టెద రందు వింత లేదు"

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. హరిభక్తులు అక్కడక్కడా ఉన్నారు. రామవిరోధులూ అనేకులున్నారు. ఎందదు చూచినా అందందే గల హరి ఎవరో మీకూ తెలుసును. రాముడా హరియేననీ మీకు తెలుసును. ఇంకా ఏం చెప్పాలీ?

   తొలగించు
 2. ఆ హరియే ఈ హరియా?
  ఆనాటి అయోధ్యానిలయుడే
  ఈనాటి ధర్మహాస రామచంద్రుడా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఉన్న దొకడే హరి
   వాడె రామాహరి

   తొలగించు


  2. ఈ ధర్మ దర హాసం లో ఏమన్నా సూక్ష్మం ఉందా :)

   జిలేబి

   తొలగించు
  3. సూక్ష్మ మెఱుఁగు జీవులు మోక్షగాములు
   వీక్షింతురు వారు మాయ వీడి జగతిని

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.