17, ఆగస్టు 2015, సోమవారం

కలలన్నీ నీ కొఱకే కలిగినవి
కలలన్నీ నీ కొఱకే కలిగినవని తెలిసెను
కలరాని నాడు నీ వలిగితివని తెలిసెనుతీయని నీ పలుకు తేనెలతో ముఱిపించి
హాయిగా నా తోడ ఆడిపాడి వలపించి
వేయేల నేను నీ వేనని కడు రెట్టించి
పోయెదవు తెలవారిపోవులోన నమ్మించి
కలలన్నీ

కలలలో నీ తోడ కలిసియాడుదును నేను
కలిసి యాడుటే కాదు కడకు నీ యింటికి
పిలిచెద వొక నాడని తెలిసియింటిని నేను
నిలిపి నీ మీద యాశ నిలచియుంటిని నేను
కలలన్నీ

నీకొఱకే నాయాట నీకొఱకే నాపాట
నీకొఱకే నేలమీద నిలచి నడయాడుట
నీకొఱకే నా నిదుర నీకొఱకే నా కలలు
నాకు ప్రసన్నుడవు కమ్ము నా రామచంద్రుడ
కలలన్నీకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.