22, జనవరి 2020, బుధవారం

నేనెఱిగినది యెంత నినుగూర్చి పాడగా జ్ఞానినా మౌనినా సర్వేశ్వరా రామ


నేనెఱిగినది యెంత నినుగూర్చి పాడగా
జ్ఞానినా మౌనినా సర్వేశ్వరా రామ

చదువలేదు నేనేమియు శాస్త్రగ్రంథంబులను
విదుల శుశ్రూష చేసి విడువ నజ్ఞానమును
పదిలముగ నానోటను భవదీయ నామమే
కదము త్రొక్కుచుండు నీ కరుణవలన రామ

తపము చేయు నంత సాధనసంపత్తియె లేదు
విపరీతపు బుద్ధిగల వీఱిడి నైయుంటిని
అపరాధిని నేను మిగుల కపటవర్తనుండను
కృపజూపితిట్టి నాపై నృపతిశేఖర రామ

అంతే చాలు ననుచు నిన్నవరతము పొగడగ
సుంత సాహసించితిని సూర్యవంశతిలక
యెంతైనను నీవు తండ్రి వెంతో మెచ్చుకొనుచు
చింతతీర్చి ప్రోచెదవు సీతారామస్వామివ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.