12, జులై 2021, సోమవారం

రామచంద్ర యనరాదా రాఘవేంద్ర యనరాదా

రామచంద్ర యనరాదా రాఘవేంద్ర యనరాదా
నా మనోహరా జగన్నాథా యనరాదా

కామితశుభసందాయక కటాక్షించు మనరాదా
రామా జగదీశ్వరా రక్షరక్ష యనరాదా
స్వామీ నీకన్య మెఱుగ వరదాయక యనరాదా
ప్రేమామృతసాగర నిను విడచియుండ ననరాదా

సన్నుతాంగ నీకెవరును సరిరారని యనరాదా
నిన్ను నమ్ము కొంటి నింక నీది భార మనరాదా
కన్నులార నిన్నుచూడ కటాక్షించు మనరాదా
మిన్నుమన్ను నేకమైన నిన్నువిడవ ననరాదా

రక్తి నిన్ను పొగడుట నారసనకని యనరాదా
భక్తిమీఱ నిన్నుపొగడు వాడనని యనరాదా
ముక్తిదాయకా నాకు మోక్షైమీయు మనరాదా
శక్తికొలది రామునకు సాగిలపడి ఓమససా4 కామెంట్‌లు:

 1. కీర్తన చాలా బాగుంది
  విజయ

  రిప్లయితొలగించండి
 2. కీర్తనలు అన్నీ చాలా బాగున్నాయి 🙏🙏

  రిప్లయితొలగించండి
 3. శ్యామల్ రావు సర్.. మీ ప్రతి రామ సంకీర్తన ఒక మహాయోగమే.. భక్తి రసామృతఝరి సమతుల్యమే..

  రఘునందన రాఘవ రవికుల తిలక
  దాశరథి నమామ్యహమిదం లోకపాలక

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.