దేవదేవుడా నీకు తెలియని దేమున్నది
భావించును తనవాడని భక్తుడు నిన్ను
ఎవ్వానికి నీదు తత్త్వ మెఱుకగునయ్య
ఇవ్వధను నరులె కా దెంచ విరించికిని
రవ్వంతకు మించి తెలియ రానిదే యది
నవ్వుచు నందరి నేలెడు నారాయణుడా
మోహించని మునిలేని మోహనరాముడా
మోహించని వనితలేని మోహనకృష్ణుడా
మోహించని యౌగిలేని ముక్తిరూప యీ
మోహించుట నాయందే పుట్టలేదుగా
నీవిలాసమాత్ర మగుచు నెగడు సృష్టిలో
జీవులందరు చూడ నీ చిత్కళలే కదా
కావున నందరును నిన్ను కలియు వారలే
నీవు తనవాడవనుచు భావించు వారే
బాగుంది కీర్తన.. రాముడి గురించి.. కృష్ణుడి గురుంచి వర్ణన బాగుంది
రిప్లయితొలగించండివిజయ