6, జులై 2021, మంగళవారం

నరుని రక్షించు హరినామస్మరణము

నరుని రక్షించు హరినామస్మరణము
తరణోపాయమిదే తప్ప వేరు లేదు

సవనంంబు లిన్ని చేసి సత్కార్యము లన్ని చేసి
భవసాగర మీదుద మని భావించుట వెఱ్ఱి
నవనీతహృదయుడైన నారాయణు నామమలే
యవిరళముగ జపియించక భవము దాటడు

మంచివిద్య గలవారును మంచితనము కలవారును
కొంచెము చదువైన నేర్చుకొననట్టి వారలును
అంచితముగ రామనామ మందు శ్రధ్ధజూపిన తరి
యించవచ్చు భవసాగర మిది సత్యము

ఒరుల తప్పు లెన్నుటకే యుబలాటపడు నాల్కకు
హరినామము చేయుటయే యలవడెనా మేలు
హరేరామ హరే‌కృష్ణ యని పలుకుచునుండు వాడు 
నిరాటంకముగ భవమును తరియించును


3 కామెంట్‌లు:

  1. మా అందరీ చేతకూడా హరినామ స్మరణ చేయిస్తునందుకు 🙏 మా పూజ లో కూడా నీ కీర్తనలే చదువుతున్నాము 🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునా? చాలా సంతోషం. పదిమందీ వీటి మనసారా చదువుకొనటమే పరమార్ధం కదా!

      తొలగించండి
  2. శ్యామలీయంవారు,
    మీ బ్లాగ్ విజిటర్స్ కౌంటర్ 928340 చూపుతోంది, గమనించరా?
    కంగ్రాట్స్ సార్.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.